A homepage subtitle here And an awesome description here!

Thursday, March 31, 2022

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*


Tuesday, March 29, 2022

తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*

*నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*



*సంకీర్తనాచార్య! అన్నమాచార్య విచ్చేయవే!*

తాళ్ళపాక అన్నమయ్య! తెలుగు పద భారతికి తన అపూర్వమైన భావనా పటిమతో, నవ్య నవనీతమైన సుమధుర గీతికలతో వెలుగు హారతులద్ది, భాషా ప్రవర్ధమానానికి ఎనలేని కృషి సల్పిన వాగ్గేయ ధురీణుడు. తెలుగు పద కవితకు సొబగులద్ది, ఆ సొగసులకు అద్భుత పదసిరులనే విరుల పరిమళాన్ని అద్దిన పద కవితా పితామహుడు. తన సంకీర్తనా ప్రక్రియతో తేటతెలుగుపాటకు ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ మధురిమలకు అద్బుత పదసిరులను విరుల పరిమళాన్ని గుబాళించిన పదకవితా పితామహుడు. వాడుక భాషలో గేయరచన చేసి సామాన్యజనులకు పాట పాడుకునే అవకాశాన్ని కలిగించిన స్తవనీయుడు! భాష యొక్క పరమార్థాన్నీ, నిజమైన ప్రయోజనాన్నీ గ్రహించి తాను రాసిన వాటిలో అత్యధిక సంకీర్తనలను సామాన్యులు, పల్లెపట్టుల్లో నివసించే గ్రామీణులు పాడుకునే జానపద బాణిలో సృజించి సరికొత్త వాజ్ఞయాన్ని సృష్టించిన మహనీయుడు.

అందరిలోనూ శ్రీనివాసుడే...
తాను దర్శించిన సకల దేవతా స్వరూపాలలోనూ శ్రీవేంకటేశ్వరుని దర్శించిన భక్తశిరోమణి అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన గేయ రచనకు ఆద్యుడై, శ్రీనివాసుని పదారవింద అనుభూతినీ, ఆ హరిపద మకరంద ఆసక్తినీ తన సంకీర్తనలలో సరళమైన భాషలో వెలయించిన ఘనుడు అన్నమయ్య. సకల వేదాల సారాన్నీ తన సంకీర్తనలుగా చేసి వేదాలలోని ఉత్తమ గుణాలను అమృత గుళికలుగా చేసి మనకు అందించాడు సంకీర్తనాచార్యుడు. అన్నమయ్య సంకీర్తనలు వెంకట పద ముద్రాంకితాలు.

రాముడైనా, కృష్ణుడైనా, నారసింహుడైనా, అన్నమయ్య పదాలలో వేంకటేశ్వరునిగా ఒదిగి వేంకట పద ముద్రాంకితులు కావలసిందే. వేంకటాచలవల్లభునిగా, భక్తజన సన్నిభునిగా వెలుగొందవలసిందే. బాలకృష్ణుడైనా, తిరుమలగిరిపై వేంకటాద్రి ఇంద్రనీలమణిలా ప్రకాశించవలసిందే. ఘోర విదారణ నృసింహుడైనా వేంకటగిరిపై వెలుగుతూ అందపు నవ్వులు చల్లవలసిందే. తాను రాసిన ప్రతి సంకీర్తన హరి వైభవాన్నీ, ఆ తిరువేంకట విభుని ప్రాభవాన్నీ చాటిన వాణీ వీణా నాదాలుగా నినదించేలా చేసి, అద్భుత భావ సౌందర్యం ప్రతిఫలించే గీతికలుగా తీర్చిదిద్దిన అక్షర శిల్పి అన్నమయ్య.

అంతేగాక హరి తనకే సొంతమనే భావనకు ప్రతిబింబంగా 'నేనొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది' అంటూ ఒకింత ఆడంబరం ఒలకబోస్తాడు. అయితే, అన్నమయ్యకు ఉన్నది ఆడంబరం కానే కాదని, అణువణువునా నిండిన శ్రీనివాస పదానుభూతి అని, తన్మయత్వంతో కూడిన అలౌకిక భావన మాత్రమేనని అవగతమవుతుంది. భక్తిస్ఫోరకమైన 'అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' అంటూ ఆర్తితో కీర్తించిన సంకీర్తనలలో భక్తి గంగ ఉప్పొంగుతుంది.

అలతి పదాలతో అనంతమైన భావాన్ని వెలయించటం అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత. భగవంతుని కీర్తించటంలో భక్తికి ప్రాధాన్యతనిస్తూ ధన్యత చెందిన భక్త కవులు మన విశాల సంస్కృతిలో కోకొల్లలుగా కనబడతారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైవిధ్యం భారతీయ వాగ్గేయకార రచనల్లోనే అగ్రగణ్యంగా విరాజిల్లుతోందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అన్నమయ్య సంకీర్తనల్లో దేవభాషగా పిలువబడే సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడై సకల సుగుణాలకు నెలవైన శ్రీరాముని 'దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘు పుంగవం రామం' అంటూ కీర్తిస్తాడు. హిరణ్యకశిపుని భంజించిన నారసింహుని "జయజయ నృసింహ సర్వేశ! భయహర వీర ప్రహ్లాద వరద'' అంటూ ప్రణతులర్పిస్తాడు.

తన్మయ హృదయంతో 'కేవల కృష్ణావతార కేశవా! దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవ' అంటూ గోపాలకృష్ణుని సన్నుతి చేస్తాడు. ఇక అన్నమయ్య ఘనవిశేషణాలతో ఆగణిత భవహరుడైన శ్రీహరిని కీర్తించాడు. "ఆగమ పుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయత తల్పుని నానాకల్పుని కోరుదు నామది ననిశము'' అంటూ సాగుతుంది ఘనపద విభూషితమైన ఆయన పదం.

సంకీర్తనా మాణిక్యాలు
జానపదులకు ప్రాణప్రదుడై అద్భుత సంకీర్తనా మాణిక్యాలను సృజించిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. పల్లెపట్టుల్లో జనం పాడుకునే సువ్విపాటలు, గొబ్బిపాటలు, కోలాటం పాటలు అన్నమయ్య హృదయసాగరం నుంచి ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డాయంటే అతిశయోక్తి లేదు. శ్రమజీవులు అలసట తొలగటం కోసం ఆలపించే దంపుళ్ళ పాటలు అన్నమయ్య రాసిన విధం పులకింపచేస్తుంది. కన్నెపిల్లలు వెన్నదొంగపై ముద్దుగా ఆలపించే 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో' వంటి సంకీర్తనలకు ప్రాణం పోసింది అన్నమయ్యే.

ఇక అన్నమయ్య తత్వామృతాలు జగత్ప్రసిద్ధాలు. "తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా..', 'ఎంత విభవము కలిగే నంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవితము' వంటి అన్నమయ్య తత్వాలు మనకు జ్ఞానబోధ చేసి మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలతాయి.అన్నమయ్య సంకీర్తనలు సాహిత్య ప్రధానమైనవని కొందరూ, సంగీతం పాలు తక్కువని వాదించేవారు కొందరూ ఉన్నారు. ఈ అల్పమైన విషయాలను పక్కనపెడితే అనల్పమైన అన్నమయ్య సాహిత్య సేవ, భక్త పారవశ్యం తెలుగుజాతికి ఎన్నటికీ శిరోధార్యమే.

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు  అన్నమయ్య వర్ధంతి. తన తండ్రికి తీర్థవిధిని నిర్వర్తిస్తూ అన్నమయ్య పుత్రుడు, వాగ్గేయకారుడు అయిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఆర్తితో లిఖించిన "దినము ద్వాదశి నాడు..తీర్థ దివసము నేడు.. జనకుండ..! అన్నమాచార్యుండ..! విచ్చేయవే..'' అనే సంకీర్తనను స్మరిస్తూ తెలుగు నేలపై ఆ భాగవతుని తిరిగి అవతరించమని అర్థిస్తూ, అన్నమయ్యకు భక్తిభావాంజలితో ప్రాంజలి ఘటిద్దాం.



10 వ తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు time table





ప్రీఫైనల్‌ పరీక్షలు 4 నుంచి*

*🔶️పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు నిర్వహించనున్నారు. పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి నిర్వహించనున్నందున నాలుగో తేదీ నుంచి ప్రీఫైనల్‌ పరీక్షల నిర్వహణకు టైంబుల్‌ విడుదల చేశారు. ఉదయం 9.15గంటల మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.*

🔷️🔶️🔷️🔶️🔷️


Sunday, March 27, 2022

అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల




అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు వస్తే  అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.



Monday, March 21, 2022

ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷

🌹✒️ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷


【మనసులో మెదిలే భావాలను కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత】

 తమ కవితా తేజస్సుతో ప్రకాశించి 
       ప్రపంచాన్ని  ప్రకాశింపజేస్తున్న  కవులకు.....
    🏵️ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు🏵️
   

✍️కవిత్వము లేని భాష లేదు. కవిత్వము పుట్టని ప్రాంతం లేదు . కాబట్టి ప్రపంచములోని నలుమూలలా ఉన్న కవితా వైవిధ్యాన్ని అర్ధము చేసుకుని , కవితా మాధుర్యాన్ని చవిచూసే లక్ష్యము తో కవితా దినోత్సవం యేర్పాటు చేసారు.

"✍️రవి కాంచనిచో కవి గాంచునే " అన్నది లోకోక్తి . . అంటే సూర్యుడి కన్నా కవే గొప్ప అని . సూర్యుడు ప్రత్యక్షదైవము , ఆయన కిరణాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి . అయినా ఆ శక్తి వంతమైన కిరణాలు ప్రసరించలేని ప్రదేశాలు వుంటాయి. వాటి గురించి రవి కి తెలీదు . అటువంటి ప్రదేశాల గురించి కూడా కవి వర్ణించగలడు . అతడి ఊహాశక్తి పరిధి అంత విసృతమైనది . అందుకే కవులన్నా , కవిత్వమన్నా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరము ఉన్నది . ఆ గౌరవాన్ని తెలియజేసేందుకు ప్రపంచమంతటా ప్రతిసంవత్సరము మార్చి 21 వ తేదీన " కవితా దినోత్సవం " జరుపుకుంటునారు .

✍️కవిత్వము ఎంతో పురాతనమైనది . కవులను గౌరవించే సాంప్రదాయము మన దేశములోనూ ఉంది . ప్రతి రాజూ ఒక ఆస్థానకవిని నియమించుకుని గౌరవించేవాడు.ఇక శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏకంగా అష్టదిగ్గజాలే ఉన్నారు . అనేకమంది భారతీయ రాజులు కవి పోషణ లక్షణము గా తీసునేవారు.

✍️మార్చి 21న....

అటువంటి విశిష్ట సాంప్రదాయం మనకు అనాధిగా ఉన్నా ఐరోపాలో మాత్రము 18 వ శతాబ్ధము వరకు లేదు . ఆ శతాబ్దములో రోమన్‌ కవి ' విర్రీన ' పేరున అక్టోబర్ లో కవితా దినోత్సవాన్ని తొనిసారిగా జరిపారు . నాడు ఆ ఉత్సవం అక్టోబర్ నెలలో జరిగింది . అప్పటినుండి ఐరోపా వారిని అనుకరిస్తూ ఇతర ప్రదేశాలలో కూడా కవితా దినోత్సవం జరపడం మొదలైనది . ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో తన 30 వ సమావేశాన్ని 1999 లో పారిస్ లో జరిపింది . ఆ సందర్భములో మార్చి 21 తేదీని ' ప్రపంచ కవితా దినోత్సవం ' గా జరపాలనే తీర్మానము చేసారు . ఆ నాటి నుండి ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరపుతున్నారు.

✍️ప్రతి సంస్కృతిలోనూ...

చరిత్ర అంతటా, కవిత్వం ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ ఉంది. సరళమైన మరియు సంక్లిష్టమైన రెండు రూపాల్లో, క్రియాశీలత మరియు మార్పును తీసుకురావడానికి లేదా ప్రేమ మరియు నష్టాన్ని వ్యక్తీకరించడానికి లేదా కథలు మరియు కథలను వివరించడానికి కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా ఉపయోగించబడింది. కవిత్వం ప్రజలు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదు, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు ప్రజల మధ్య బంధాలను పునరుద్ధరించగలదు.

✍️ప్రపంచ భాషావైవిధ్యాన్ని కవిత్వము మాత్రమే వెలుగు లోకి తీసుకురాగలదు అని యునెస్కో భావించింది . భావవ్య్క్తీకరణకు కవిత్వమే తగిన సాధనము . అందువల్ల కవ్త్వానికి ప్రోత్సాహము ఇస్తే భాషలు బతికివుంటాయని యునెక్సో తన విశ్వాసాన్ని ప్రకటించింది.అన్ని ప్రాంతాలలో అన్ని భాషలవారూ కవిత్వాన్ని రాయడం , చదవడం మొదలు పెడితే భాషకు విసృత ప్రచారము లభిస్తుంది.

✍️కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింప జేసేందుకు....

కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింపజేసేందుకే ఐక్యరాజ్యసమితి పాఠశాల స్థాయినుండి విశ్వవిస్యాలయ స్థాయివరకు భాషాపాఠ్యాంశాలలో కవిత్వభాగాలను పెంచమని సూచించింది . పిల్లలలో ఆసక్తి పెంచేందు కు అన్ని స్థాయిలలో కవితా క్లబ్ లను ఏర్పాటు చేయమంటున్నది . భావయుక్తం గా కవిత చదివే పిల్లలను ప్రోత్సహించి తీర్చిదిద్దమని సూచనలు ఇస్తుంది.

*✍️భాషా భిన్నత్వాల్ని, కవితా ప్రచారం ద్వారా ఏకం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడటం కూడా ఈ దినోత్సవ ఏర్పాటు యొక్క  ఉద్దేశ్యం.*

✍️ ప్రపంచ కవితా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యాలు:

• కవితా ప్రచారం ద్వారా భాషా భిన్నత్వానికి చేయూతనివ్వడం.
• అంతరించిపోతున్న భాషలకు తోడ్పాటు అందించి, తిరిగి కాపాడటం
• అశువుగా కవిత్వాన్ని చెప్పే కళా సంస్కృతిని ప్రోత్సహించి ప్రతిస్థాపన చేయడం
• రంగస్థలం, నృత్యం సంగీతం మరియు చిత్రకళలతో కవిత్వానికి గల సంవాదాన్ని పెంచడం మరియు
• చిన్న ప్రచురణకర్తలకు చేయూతనిచ్చి, ప్రసారమాధ్యమాల్లో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించడం.

✍️అందమైన పదాల పలకరింపులు
తీరైన భావాల కలబోతలు
వెన్నెల వెలుగులు వేకువ కాంతులు
హృదయ నివేదనలను
అక్షరాల విరిమాలలుగా చేసి
అలరిస్తూ స్తూర్తినింపుతున్న
కవులందరికీ పేరు పేరునా
కవితాదినోత్సవ శుభాకాంక్షలు...




Sunday, March 20, 2022

సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి.

💐💐సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త  సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి  సందర్భం




【వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!】

✍️విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.మూడు వందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు మాధమేటిక్ , ఫిజిక్స్ విభాగాలకు #ఆద్యుడు న్యూటన్. ఆప్లిక్స్ కాలుక్యులస్ ఆయన సృష్టించినవే ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీపడడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్. న్యూటన్ పేరు తెలియకుండా పాటశాల విద్య ముగియదు. సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయన్న న్యూటన్ సూత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసినపుడల్లా గుర్తుకు వచ్చి తీరుతుంది. న్యూటన్ ఒక అపూర్వ మేధావి. మాధమేటిక్స్ ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, మత శాస్త్రాలన్నింటిని అధ్యయనం చేసిన వాడు. 17వ శతాబ్దపు విజ్ఞాన విప్లవంలో కీలక పాత్ర పోషించారు సర్ ఐజాక్ న్యూటన్.

✍️మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. 

✍️ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను "సైన్సు పితామహుడు"గా కీర్తించింది. 

✍️బాల్యం:

జనవరి 4, 1643వ సంవత్సరంలో నెలలు నిండకుండానే జన్మించాడు ఓ చిన్నారి. ఆ చిన్నారే పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారే సర్ ఐజాక్ న్యూటన్. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలం జన్మించాడు. తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.

✍️న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

✍️ఉన్నత విద్య-గురుత్వాకర్షణ సిద్ధాంతం:

1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై #గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, ఉన్నత విద్య నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ "ప్రిన్సిపియా మేథమేటికా" అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా "దృశాశాస్త్రం" పుట్టింది.

✍️మూడు గమన నియమాలు:

✍️ఐజాక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు, మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు. 
అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉందే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజక్ న్యూటన్ అన్న మనిషి ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

✍️మొదటి సూత్రము:

"బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది". ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.

✍️రెండవ సూత్రము: 

"ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
ప్రచోదనం 
ఒక ప్రచోదనం j, ఒక బలం f, ఒక సమయం Δt లో ఒక వస్తువుపై పనిచేస్తే కలుగుతుంది

✍️న్యూటన్ మూడవ నియమం:

ఇది అసలైనది
న్యూటన్ సూత్రాన్ని దృష్టాంతం చేయడానికి ఇద్దరు స్కేటర్లు వ్యతిరేఖ దశలో ఒకరిని ఒకరు గెంటుకొనుచున్నారు.ఎడమవైపు మొదటి స్కేటర్ 12 కుడి వైపు దిక్కునకు, మరియు రెండవ స్కేటర్ N21 ఎడమ వైపు దిక్కునకు బలాన్ని ప్రయోగిస్తున్నారు.ఇద్దరి బలాలు సమానం కానీ న్యూటన్స్ మూడవ సూత్రం ప్రకారం వ్యతిరేఖ దశలో ప్రయోగించబడ్డాయి.
అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది.
చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.
F (A) =-F (B)
(-గుర్తు వ్యతిరేకతను సూచిస్తుంది)
ఉదాహరణ: రాకెట్

✍️ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం "సర్‌" అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు.

 ఆ తరువాత కూడా ఎన్నో #మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్లిపోయారు

 ✍️వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!!!

వాషింగ్టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం
ఆ కథనం ప్రకారం.. గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించిన ఐజాక్ న్యూటన్ ఇరవయ్యో పడిలో ఉన్నప్పుడు లండన్‌ను గ్రేట్ ప్లేగ్ అనే వ్యాధి కుదిపేసిందట. అప్పుడు న్యూటన్ ట్రినిటీ కాలేజీలో చదువుకుంటున్నారు. కాగా.. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం మనం చూస్తున్న జాగ్రత్తలే అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాలేజీలు సెలవులు ప్రకటించాయి. న్యూటన్ చదువుకుంటున్న ట్రినిటీ కాలేజీ కూడా విద్యార్థులను ఇంటికి పంపించింది. అలా ఇంటికే పరిమితమైన న్యూటన్.. క్యాలిక్యులస్ వంటి కొత్త గణిత విధానాలకు రూపకల్పన చేశారట. అంతే కాదు... గురుత్వాకర్షణ సిద్ధాంతానికి కూడా అప్పుడే బీజం పడిందట. సో అదండీ.. వర్క్ ఫ్రమ్ హోంకు ఆసక్తికర నేపథ్యం.





Thursday, March 17, 2022

కల్పనా చావ్లా జయంతి 🌻

🌻TODAY KALPANA CHAWLA BIRTH ANNIVERSARY🌻

🌻కల్పనా చావ్లా జయంతి సందర్భంగా🌻



🌺కల్పనా చావ్లా (మార్చి 17 , 1962 – ఫిబ్రవరి 1 ,
2003 ), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.

🌺నాసా శాస్త్రవేత్తగా ఎంపిక🌺

🌺1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.

🌺అంతరిక్ష యానం🌺

🌺1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపుక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక డాక్టరు ఈమె ఎక్స్రే పరిశోలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ డాక్టరు పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.

🌺2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మిరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేయని చెప్పెవారు.

🌺పరిశోధనా రంగంలో🌺

🌺డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కది శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షం లో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిసోధనలు చేశారు.ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.

🌺వ్యోమగామిగా🌺

🌺వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువూ మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంత్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997, నవంబరు 19 న మిషన్ స్పెషలిస్టు గా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా "ఎస్టిఎస్ -87" మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.

🌺రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడ ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది.

🌺అవార్డులు🌺

🌺మరణానంతర గౌరవాలు🌺

🌺కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్

🌺NASA స్పేస్ ఫ్లైట్ మెడల్

🌺NASA విశిష్ట సేవా మెడల్

🌺డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯