Monday, March 21, 2022

ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷

🌹✒️ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷


【మనసులో మెదిలే భావాలను కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత】

 తమ కవితా తేజస్సుతో ప్రకాశించి 
       ప్రపంచాన్ని  ప్రకాశింపజేస్తున్న  కవులకు.....
    🏵️ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు🏵️
   

✍️కవిత్వము లేని భాష లేదు. కవిత్వము పుట్టని ప్రాంతం లేదు . కాబట్టి ప్రపంచములోని నలుమూలలా ఉన్న కవితా వైవిధ్యాన్ని అర్ధము చేసుకుని , కవితా మాధుర్యాన్ని చవిచూసే లక్ష్యము తో కవితా దినోత్సవం యేర్పాటు చేసారు.

"✍️రవి కాంచనిచో కవి గాంచునే " అన్నది లోకోక్తి . . అంటే సూర్యుడి కన్నా కవే గొప్ప అని . సూర్యుడు ప్రత్యక్షదైవము , ఆయన కిరణాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి . అయినా ఆ శక్తి వంతమైన కిరణాలు ప్రసరించలేని ప్రదేశాలు వుంటాయి. వాటి గురించి రవి కి తెలీదు . అటువంటి ప్రదేశాల గురించి కూడా కవి వర్ణించగలడు . అతడి ఊహాశక్తి పరిధి అంత విసృతమైనది . అందుకే కవులన్నా , కవిత్వమన్నా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరము ఉన్నది . ఆ గౌరవాన్ని తెలియజేసేందుకు ప్రపంచమంతటా ప్రతిసంవత్సరము మార్చి 21 వ తేదీన " కవితా దినోత్సవం " జరుపుకుంటునారు .

✍️కవిత్వము ఎంతో పురాతనమైనది . కవులను గౌరవించే సాంప్రదాయము మన దేశములోనూ ఉంది . ప్రతి రాజూ ఒక ఆస్థానకవిని నియమించుకుని గౌరవించేవాడు.ఇక శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏకంగా అష్టదిగ్గజాలే ఉన్నారు . అనేకమంది భారతీయ రాజులు కవి పోషణ లక్షణము గా తీసునేవారు.

✍️మార్చి 21న....

అటువంటి విశిష్ట సాంప్రదాయం మనకు అనాధిగా ఉన్నా ఐరోపాలో మాత్రము 18 వ శతాబ్ధము వరకు లేదు . ఆ శతాబ్దములో రోమన్‌ కవి ' విర్రీన ' పేరున అక్టోబర్ లో కవితా దినోత్సవాన్ని తొనిసారిగా జరిపారు . నాడు ఆ ఉత్సవం అక్టోబర్ నెలలో జరిగింది . అప్పటినుండి ఐరోపా వారిని అనుకరిస్తూ ఇతర ప్రదేశాలలో కూడా కవితా దినోత్సవం జరపడం మొదలైనది . ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో తన 30 వ సమావేశాన్ని 1999 లో పారిస్ లో జరిపింది . ఆ సందర్భములో మార్చి 21 తేదీని ' ప్రపంచ కవితా దినోత్సవం ' గా జరపాలనే తీర్మానము చేసారు . ఆ నాటి నుండి ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరపుతున్నారు.

✍️ప్రతి సంస్కృతిలోనూ...

చరిత్ర అంతటా, కవిత్వం ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ ఉంది. సరళమైన మరియు సంక్లిష్టమైన రెండు రూపాల్లో, క్రియాశీలత మరియు మార్పును తీసుకురావడానికి లేదా ప్రేమ మరియు నష్టాన్ని వ్యక్తీకరించడానికి లేదా కథలు మరియు కథలను వివరించడానికి కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా ఉపయోగించబడింది. కవిత్వం ప్రజలు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదు, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు ప్రజల మధ్య బంధాలను పునరుద్ధరించగలదు.

✍️ప్రపంచ భాషావైవిధ్యాన్ని కవిత్వము మాత్రమే వెలుగు లోకి తీసుకురాగలదు అని యునెస్కో భావించింది . భావవ్య్క్తీకరణకు కవిత్వమే తగిన సాధనము . అందువల్ల కవ్త్వానికి ప్రోత్సాహము ఇస్తే భాషలు బతికివుంటాయని యునెక్సో తన విశ్వాసాన్ని ప్రకటించింది.అన్ని ప్రాంతాలలో అన్ని భాషలవారూ కవిత్వాన్ని రాయడం , చదవడం మొదలు పెడితే భాషకు విసృత ప్రచారము లభిస్తుంది.

✍️కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింప జేసేందుకు....

కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింపజేసేందుకే ఐక్యరాజ్యసమితి పాఠశాల స్థాయినుండి విశ్వవిస్యాలయ స్థాయివరకు భాషాపాఠ్యాంశాలలో కవిత్వభాగాలను పెంచమని సూచించింది . పిల్లలలో ఆసక్తి పెంచేందు కు అన్ని స్థాయిలలో కవితా క్లబ్ లను ఏర్పాటు చేయమంటున్నది . భావయుక్తం గా కవిత చదివే పిల్లలను ప్రోత్సహించి తీర్చిదిద్దమని సూచనలు ఇస్తుంది.

*✍️భాషా భిన్నత్వాల్ని, కవితా ప్రచారం ద్వారా ఏకం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడటం కూడా ఈ దినోత్సవ ఏర్పాటు యొక్క  ఉద్దేశ్యం.*

✍️ ప్రపంచ కవితా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యాలు:

• కవితా ప్రచారం ద్వారా భాషా భిన్నత్వానికి చేయూతనివ్వడం.
• అంతరించిపోతున్న భాషలకు తోడ్పాటు అందించి, తిరిగి కాపాడటం
• అశువుగా కవిత్వాన్ని చెప్పే కళా సంస్కృతిని ప్రోత్సహించి ప్రతిస్థాపన చేయడం
• రంగస్థలం, నృత్యం సంగీతం మరియు చిత్రకళలతో కవిత్వానికి గల సంవాదాన్ని పెంచడం మరియు
• చిన్న ప్రచురణకర్తలకు చేయూతనిచ్చి, ప్రసారమాధ్యమాల్లో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించడం.

✍️అందమైన పదాల పలకరింపులు
తీరైన భావాల కలబోతలు
వెన్నెల వెలుగులు వేకువ కాంతులు
హృదయ నివేదనలను
అక్షరాల విరిమాలలుగా చేసి
అలరిస్తూ స్తూర్తినింపుతున్న
కవులందరికీ పేరు పేరునా
కవితాదినోత్సవ శుభాకాంక్షలు...




0 comments:

Post a Comment