A homepage subtitle here And an awesome description here!

Tuesday, December 6, 2022

డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి వర్థంతి

🌷భారత రాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, సంఘసంస్కర్త, మహామేధావి డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి వర్థంతి
 సందర్భంగా🌷





ఓ #మండు వేసవి కాలం...
అస్పృశ్యత కొనసాగుతున్న  కాలమది....
వేశవిసెలవుల్లో  మామగారున్న "గోరెగావ్" అనేగ్రామానికి  ఓయువకుడు తన అన్న, మేనల్లుళ్ళతో పాటు బయలుదేరాడు. రైలులో స్టేషన్ కు చేరాడు...కానీ అనుకోని అవాంతరంతో మామ స్టేషన్‍కు రాలేకపోయారు. ఆయువకుని బృందం స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చు కున్నారు. బండీలో ప్రయానిస్తుండగా మాటల సందర్భంలో  బండివాడికి, వీళ్ళు    " మెహర్ "కులస్థులని తెలిసింది.....అంతే అతను బండిని ఆపి అందరినీ బండి నుండి దిగమన్నాడు. ....ఓ ప్రక్క ఎండాకాలం  మరోప్రక్క అంతా పిల్లలు..., వాళ్లు ఆ #బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు.చివరకు బండి వాడితో ఓ అవగాహనకు వచ్చారు.అదేంమంటే ఆయువకుని  అన్న బండి తోలేటట్లు, బండివాడు బండిముందు నడచి వచ్చేటట్లు..,.. ఎలోగో ఇబ్బందిపడి, ఆకలి దప్పులతో అలమటిస్తూ వారంతా అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు .దాహానికి తట్టుకోలేని ఆయువకుడు ఆ అర్ధరాత్రి వీధికుళాయి నీరు తాగుతూ వుంటే అక్కడి ప్రజలు ఆతని  కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. ఆరోజు అవమానం పాలయిన ఆయువకుడే తరువాతకాలంలో భారతరాజ్యాంగ  రూపశిల్పి అవుతాడని ఎవరు ఊహించి ఉండరు.ఆయువకుడే  #భీమ్‌రావ్ అంబేద్కర్.....

ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త    "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందిన డా॥ భీంరావ్ రాంజీ అంబేడ్కర్.

బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వంత ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహానీయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. 

#మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన, రాంజీసక్పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించిన వారు అంబేద్కర్.  1891 ఏప్రిల్ 14న జన్మించాడు. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. వీరి  కుటుంబం శాకాహారం మాత్రమే తీసుకొనేవారు. రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరారు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. సంస్కృతం చదువు కోవాలని ఆశించారు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివారు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు.

 బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్ధి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్ధిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరారు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడినది.

 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చారు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది. మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు! కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించారు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.

 1927లో మహద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండినది. అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.

 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. ' అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశారు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది.  మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నారు. రౌండుటేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లారు. 1932లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించారు. "మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు." అన్నాడు అంబేద్కర్. కొన్ని సంవత్సరాలు అస్పృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు.

 #భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు #రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు #అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.#అంబేద్కర్ మోయవలసి వచ్చింది. #రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నారు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. 

గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నారు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు.

 #మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశారు.

#బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.

#భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్  ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.


Sunday, December 4, 2022

ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి

🙏🎸🎻తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని అనేక దశాబ్దాలు తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన గాన గంధర్వుడు,అమర గాయకుడు...... స్వరబ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి సందర్భంగా🎻🎸🙏

【ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి జయంతి ఉత్సవాలు సందర్భంగా】





#పాటకు ప్రాణం పోసిన స్వరం ఆయనది. ఆయన పాట అలసిన మనసును సేదతీరుస్తుంది. వెన్నెల్లో #జోలపాడుతుంది. ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. కోటి వీణియలను తనలోనే దాచుకుని తుమ్మెద నాదమై మన చెవిని చేరుతుంది.వేణువులోకి దూరే పిల్లగాలులోలె సవ్వడి చేస్తుంది. ఉషోదయ సుప్రభాతమై నిద్రలేపుతుంది. భానుడి రవికిరణమై నులివెచ్చగా మదిని తాకుతుంది.తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలన్నీ ఆ గొంతుక నుంచి జాలువారినవే.తన పాటను ప్రతినోట పలికించి కంఠశాలగా నిలిచారు గంధర్వ #గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
గాయకులు చాలామంది ఉంటారు.కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు. ఎప్పటికీ గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల. ఘంటసాల అనే పదాన్ని తెలుగు నిఘంటువులో చేర్చి దానికి అర్ధంగా 'బాగా పాటలు పాడేవాడు' అని చెప్పుకోవచ్చు.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.  ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.

#బాల్యం-తొలి జీవితం:

ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. 

#సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ:

 పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది.  ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శ్రుతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.

#కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలు.....

కొన్నాళ్ళు కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలతో గడిచాయి. స్టేజినాటకాల్లో నటించే అవకాశాలు కూడా కలిగాయి. పెద్దలంతా మెచ్చుకున్నారు కాని ఆదాయం మాత్రం పెరగలేదు. ఇంతలో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంవల్ల ప్రభావితుడైన ఘంటసాల దేశభక్తి గేయాలను గానం చేస్తూ కొన్నాళ్ళు జెయిలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ పాటల రికార్డులు విశేష జనాదరణ పొందాయి. 

#సినీ రంగంలో ప్రవేశం:

ఆ రోజుల్లోనే ఆయనకు వివాహం జరగడం, అత్తవారి ఊరిలో సినీ రచయిత సముద్రాల సీనియర్‌తో పరిచయం కలిగాయి. సముద్రాల ద్వారా 1944లో ఘంటసాల సినీ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు పాటలతోనూ, ఘంటసాల నటనతోనూ ఒకేసారి కుస్తీ పడుతూండేవారు. ప్లేబాక్‌ పద్ధతి రావడం తో ఎవరి పాత్ర వారికి లభించినట్టయింది. సినీ నేపథ్య గాయకుడిగా త్వరలోనే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

#పాటలో నటించడం ఆయనకు సహజంగా అబ్బిన విద్య. ఆయన గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, #శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమ లక్షణలు ఆయన పాటలను తీర్చి దిద్దాయి.
#బాల్యం ఆయన పాడిన శకంలో ఉద్దండులైన సంగీత దర్శకులుండేవారు. రాజేశ్వరరావు, సి.ఆర్‌.సుబ్బరామన్‌, పెండ్యాల, ఆదినారాయణరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటివారి గొప్పదనం ఘంటసాల పాటలకు ఎక్కువ దోహదం చేసిందో, ఆయన వల్ల వారంతా రాణించారో చెప్పడం కష్టం. స్వరకర్తలూ గాయకులే కాక పాటల రచయితలూ, బి.ఎన్‌.రెడ్డి వంటి సినీ దర్శకులూ పాటల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు కనుకనే అటువంటి సంగీతం తయారయింది. ఈ నాటి సంగీతంలో లోపాలున్నాయంటే అందుకు కారణం “రాగాల్లోనూ, బాణీల్లోనూ వెయ్యవలసినవీ, వెయ్యకూడనివీ గమకాలూ, సున్నితమైన అనుస్వరాలూ ఉంటాయి” అనేది పాడేవారికీ పాటలు కట్టేవారికీ కూడా తెలియకపోవడమే.

#ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో......

ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో అప్పటికే పేరు పొందిన ఎం.ఎస్‌. రామారావు, ఎస్‌.రాజేశ్వర రావు వంటి గాయకులలో వినిపించని నిండుదనం, తెలుగుదనం (నేటివిటీ) మొదటిసారిగా ఘంటసాల పాటలలో వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లైలా మజ్నూలో సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, ఘంటసాల కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” అనే పాటలో హీరో ఎవరో గుర్తు పట్టడం చాలా తేలిక. అది 1949నాటి సినిమా. అప్పటికి స్టార్‌ సిస్టం అమలులోకి రాలేదు. బాగా పాడేవారినే హీరోకు ఎన్నుకునేవారు. ఘంటసాల తరవాత సినిమాల్లో పాడడానికి వచ్చిన మాధవపెద్ది సత్యం, ఏ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్‌ తదితరులు ఈనాటి గాయకుల కన్న ఎంతో ప్రతిభావంతులే. అయినప్పటికీ వారు ఘంటసాలకు సమకాలికులు కావడంతో ఆయనకు సరితూగలేక పోయారు. అంతేకాదు. ఎన్నో దశాబ్దాలపాటు సినీ హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న, రామారావు, నాగేశ్వరరావులు ఘంటసాల పాడందే నటించేవారు కాదు.

#విజయావారు సంస్థలో:

ఒకప్పుడు విజయావారు తమ నిర్మాణ సంస్థలో ఇతర కళాకారులతోబాటు ఘంటసాలను నెల జీతం మీద నియమించారు. అందులో ఇతర సంస్థలకు పని చెయ్యరాదనే నిబంధన ఉండడం వల్ల ఘంటసాల వంటి ఉత్తమ కళాకారులకు అది కుదరని పరిస్థితి అయింది. #మిస్సమ్మ సినిమాకు సంగీత దర్శకుడుగా కాని, గాయకుడుగా కాని ఆయన పని చెయ్యక పోవడానికి కారణం ఇదేనంటారు. కారణాలు ఏవైనా ఘంటసాల పాడినంత కాలమూ ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదని అనిపిస్తూండేది. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు.

#సంగీత దర్శకుడుగా:

ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. 1950 ప్రాంతాల తీసిన పెళ్ళిచేసిచూడు లోనే ఆయన చక్రవాకం (ఏడుకొండలవాడ), చారుకేశి (ఎవరో ఎవరో) వంటి కర్ణాటక రాగాలను అతి సమర్థవంతంగా సినీగీతాలకు వాడుకున్నాడు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకు సరదా అనిపిస్తుంది. రాగేశ్రీ వంటి హిందూస్తానీ రాగాలను కూడా ఆయన “ఇది నాచెలి” (చంద్రహారం), “అన్నానా భామిని” (సారంగధర) వగైరా పాటల్లో ఉపయోగించాడు. కుంతీకుమారి పద్యాల్లో కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణి, హిందూస్తానీ రాగాలైన లలిత్‌ వంటివి అనేకం వినిపిస్తాయి. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను ఆయన తన కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించాడు. ఇది విద్వాంసులు సైతం గుర్తించవలసిన విషయం. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదు. మాటల్లోని అర్థమూ కనుమరుగవలేదు. రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలలో ఆయన స్వరరచన చేశాడు. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో.
#ఘంటసాల స్వయంగా తాను సంగీతదర్శకుడు అయినప్పటికీ ఆర్కెస్ట్రాలో దిట్ట అయిన సి.ఆర్‌.#సుబ్బరామన్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేసి ఎంతో అనుభవం గడించాడు.

#మాయాబజార్‌లో:

మాయాబజార్‌లోని నాలుగు యుగళగీతాలూ మొదట రాజేశ్వరరావు స్వరపరచారట. తక్కినవన్నీ నిస్సందేహంగా ఘంటసాలవే. చారుకేశిలో సత్యంచేత “భళిభళిదేవా” పాడించి ఘటోత్కచుడికి 
**“#వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ. ఒరిజినల్‌ పాట చతురశ్రంలో సాగితే తెలుగు పాట స్వింగ్‌ రిధంలో వినబడుతుంది. పోలీసువాడి నవ్వుని రాక్షసుడి వికటాట్టహాసంగా మార్చిన ఘనత #ఘంటసాలదీ, పింగళిదీ, కె.వి.రెడ్డిిదీ కావచ్చు.**

ఈ #లుంగీ వాలా ఏం #పాడతాడు లే!....

జీవిత చక్రం కొత్తదనం కోసం ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులైన శంకర్‌-జైకిషన్‌ను ఆ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చమని కోరారు. బొంబాయిలో పాటల రికార్డింగ్‌ కోసం మద్రాస్‌ నుంచి గాయనీ గాయకుల్ని పిలిపించారు. విమానంలో ఘంటసాల బొంబాయి చేరుకున్నారు
ఘంటసాల రికార్డింగ్‌ థియేటర్‌లోకి అడుగు పెట్టగానే అక్కడున్న బొంబాయి ఆర్కెస్ట్రా జనం ఆశ్చర్యపోయారు. కారణం ఘంటసాల వేషధారణ అతి సామాన్యంగా ఉంది. తెల్లని లాల్చీ, లుంగీ, సాధారణమైన ఆకు చెప్పులతో ఉన్న ఘంటసాలలో సెలెబ్రిటీ లక్షణాలు బొత్తిగా కనిపించలేదు. ఆయన్ని చూడగానే ‘ఈ లుంగీవాలా ఏం పాడతాడు లే!’ అని బొంబాయి వాలాలు గుసగుసలుపోయారట. ఘంటసాల తెలుగు పాటల్ని పరిశీలించారు. శంకర్‌-జైకిషన్లతో మాట్లాడి ట్యూన్స్‌ తెలుసుకొన్నారు. చిన్న రిహార్సల్‌ వేసుకొని, రెడీ అంటూ టేక్‌ కోసం మైక్‌ ముందు నిల్చున్నారు. రికార్డింగ్‌ థియేటర్లో సైలెన్స్‌... ఘంటసాల తన గంభీరమైన గొంతును విప్పారు.
బొంబాయిలోని అత్యంత ఆధునికమైన రికార్డింగ్‌ యంత్రాలు ఒక్కసారి ప్రతిధ్వనించాయి. అంత వరకు ఈ లుంగీ వాలా ఏం పాడతాడు లే! అని లైట్‌ గా తీసుకొన్న బొంబాయి ఆర్కెస్ట్రా వారికి చెవిలో సముద్రపు హోరులాగా ఘంటసాల మాస్టారి గొంతు వినిపించింది. రికార్డింగ్‌ పూర్తయింది. పాట బ్రహ్మాండంగా వచ్చిందంటూ శంకర్‌-జైకిషన్లు ఘంటసాలని అభినందించారు. దాంతో తల దించుకోవడం ఆర్కెస్ట్రా సభ్యుల వంతయింది.

#వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో #మంచివాడు..... #వినయసంపన్నుడు.....

వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో మంచివాడనీ వినయసంపన్నుడనీ ఆయన సమకాలికులకు తెలిసినదే.  మద్రాసుకు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌గారు వచ్చినప్పుడు ఆయనను ఘంటసాల కోరి తమ ఇంటో అతిథిగా ఉంచుకున్నాడు. ఉస్తాద్‌గారంటే ఆయనకు అంత అభిమానం.

జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనే ఖండికను ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. ఈ సందర్భంలో గాన గంధర్వుడు ఘంటసాల గారు పాడే సందర్భంలో, రికార్డింగ్ జరిగే సమయంలో శ్రీ జాషువా గారు ఘంటసాల వారి యింటికి వచ్చి, బయట అరుగు మీద కూర్చున్నారట. ఘంటసాల గారు, బయటకు వచ్చి, "ఏమిటండీ! బయటనే కూర్చున్నారు" అని అడిగితే, అందుకు జాషువా గారు "నేను అంటరాని కులమునకు చెందిన వాడను, మీరు బ్రాహ్మణులు, మీ అనుమతి లేకుండా లోపలి ఎలా రాగలను?" అన్నారట. అందుకు, ఘంటసాల గారు  "నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్చగా లోపలి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్ధం!" అని చెప్పియింటిలోకి సాదరంగా తీసుకొని వెళ్లి, తన సహృదయాన్ని చాటుకొన్న ధన్యజీవి ఘంటసాల.

#పద్మశ్రీ వచ్చిన వార్త:

మద్రాసులోని ఒక తెలుగు సభలో ఆయన ఉండగానే ఆయనకు పద్మశ్రీ వచ్చిన వార్త విన్న ముదిగొండ లింగమూర్తిగారు, చాలా ఆర్భాటంగా ఆ సంగతి ప్రేక్షకులకు ప్రకటించారు. ఘంటసాలగారు లేచి అతివినయంగా అందరికీ నమస్కరించారు.  అక్కడి సభలో ఆయన “నీ కొండకు నీవే రప్పించుకో” అని ఎంతో భావోద్వేగంతో పాడాడు.

#ఆయన చేతిలో రుమాలు ఉండాల్సిందే..#

ఘంటసాలకి రికార్డింగ్‌ సమయంలో చేతిలో కర్చీఫ్‌ ఉండాలట. పొరబాటున మర్చిపోతే ‘కర్చీఫ్‌ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయనకు అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. 

#పద్య గానంతో:

నాటకాల పద్యాల వరవడికి అలవాటుపడ్డ తెలుగు ప్రజలకు, తన పద్య గానంతో ఆకట్టుకున్నారు ఘంటసాల . లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల మొదలైన సినిమాలలో ఆయన పాడిన పద్యాలు ఆయా పాత్రలు పోషించిన వ్యక్తుల పాత్రలను ఎలివేట్ చేసాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం, కుంతీ కుమారి ... మొదలైన గీతాలను పాడి వాటికి  ప్రాణం పోసారు. అలాగే శ్రీ జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనే గీతాన్ని భావగర్భితంగా పాడి సంగీత సాహిత్యప్రియులను ఓలలాడించారు.

#అనారోగ్యం:

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

#భగవద్గీత:

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 

#ఉన్నతమైన వ్యక్తిత్వం:

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యి న్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి అతనుపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

#ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. #తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.


Saturday, December 3, 2022

హాకీ కా జాదుగర్...........🏑ధ్యాన్‌చంద్ గారి వర్థంతిసందర్భంగా

💐హాకీ కా జాదుగర్...........🏑
ధ్యాన్‌చంద్ గారి వర్థంతిసందర్భంగా




#భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో #క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు #ధ్యాన్‌చంద్‌. భారత హాకీ #ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్‌ ధ్యాన్‌చంద్‌దే. 
భారత హాకీని ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు.. #ఒలింపిక్స్‌లో భారత పతకాన్ని రెపరెపలాండించిన పౌరుడు.. హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌. 22ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన ఆయన జన్మదినమైన ఆగస్టు 29 ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ధ్యాన్‌చంద్‌ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం వలన బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

#బాల్యం:

ధ్యాన్‌చంద్‌ ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. మధ్య ప్రదేశ్‌లోని ధ్యాన్‌చంద్‌నగరంలో పెరిగారు. ఆయనకు చిన్న తనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. 
1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు.

#హాకీ స్టిక్‌ అతని చేతిలో #మంత్రదండం:

హాకీ స్టిక్‌ అతని చేతిలో మంత్రదండంగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ,  డ్రిబ్లింగ్‌ చాతుర్యం, పాసింగ్‌లో అసాధారణ నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. అతను బంతిని నియంత్రించే విధానం చూసి మైదానంలోని అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా మంత్ర ముగ్దులయ్యేవారు. ప్రపంచ హాకీ‌లో ‘ది విజార్డ్’,  ‘మెజిషియన్’ గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌‌కే దక్కింది. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. 1936లో లాస్‌ ఎంజిల్స్ లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్‌ 9 గోల్స్‌ చేసి భారత్ ను గెలిపించారు. ధ్యాన్‌చంద్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1948 లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్‌లో 400 కు పైగా గోల్స్ ను నమోదు చేసాడు.
1936నాటి ఒలంపిక్స్‌లో జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్‌లో ద్వితీయార్థంలో ధ్యాన్ చంద్..తన షూ, సాక్స్‌ను తీసేసి మ్యాచ్ ఆడారు. అయినా మూడు గోల్స్ సాధించి భారత్‌కు ఒలంపిక్స్ పతకాన్ని అందించాడు.

#ముగ్ధుడైన హిట్లర్‌:

 ధ్యాన్‌చంద్‌ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంతన హిట్లర్‌ ధ్యాన్‌చంద్‌కు జర్మనీలోధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధుడైన హిట్లర్...
"మీ హాకీస్టిక్‌ దగ్గరే బాల్ వుంటుంది, మీరు క్రికెట్లో రన్స్ చేసినట్లుగా హాకీలో గోల్స్ వేస్తున్నారు". అని ఇంకొదరు, "మీరు మా దేశానికి వస్తే మంచి ఉద్యోగం హోదా కల్పిస్తాం, మా దేశం తరుపున ఆడండి"జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కల్నల్‌ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్‌చంద్‌ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.

#స్టిక్‌లో #అయస్కాంతం ఉందా......స్టిక్‌ను విరిచి చూశారు......

ధ్యాన్‌చంద్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫార్వర్డ్‌ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బంతిని డ్రిబ్లింగ్‌ చేస్తున్నప్పుడు హాకీ స్టిక్‌, బంతి రెండు అతుక్కొని పోయాయా అన్న భ్రమ కలిగించే విధంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించే వాడని ఒక సందర్భంలో విదేశీయులు ఆయన స్టిక్‌లో అయస్కాంతం ఉందా అని స్టిక్‌ను విరిచి చూడటం ధ్యాన్‌చంద్‌ క్రీడా నైపుణ్యానికి అద్దం పడుతుంది. మరొక
హాకీ స్టిక్‌ తో ధ్యాన్‌చంద్‌ ఆటను కొనసాగించారు.

#నిశిత పరిశీలన:

ఓ మ్యాచ్ సందర్భంగా ధ్యాన్ చంద్ ప్రత్యర్థులపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. గోల్ పోస్ట్ విషయంలో రిఫరీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిశీలనలో గోల్ పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది.అందరి మన్ననలు పొందారు తద్వారా ఆయనకి ఆటమీద గల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ...

#చంద్‌గా పిలవడం......

చంద్రుడి వెలుతురులోనూ ఆయన ప్రాక్టీస్ చేసేవారు. అందుకే ఆయన్ను చంద్‌గా పిలిచేవారు.

హాకీలో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్‌చంద్‌ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్‌ పేరు ప్రపంచపటంలో మారుమ్రోగి పోవడంలో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు. 

#రాజీవ్‌ ఖేల్‌ రత్నా’ను ‘#ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నా’గా మార్పు:

ఈ ధన్యజీవికి మరింత గౌరవం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ ఖేల్‌ రత్నా’ అవార్డును ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నా’గా మార్చింది. 

#గౌరవం:

*క్రీడా రంగంలో ధ్యాన్‌చంద్ చేసిన కృషికి  ప్రభుత్వం 1956 లో భారతీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన  పద్మ భూషణ్‌తో సత్కరించింది. *క్రీడా రంగంలో ఎంతో మందికి స్ఫూర్తి‌దాతగా నిలిచిన ధ్యాన్‌చంద్ పుట్టిన‌రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
*2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణం చేశారు.  *అలిఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని ఓ హాస్టల్‌కు ఆయన పేరు పెట్టారు. 
*లండన్‌లోని ఇండియన్ జింకానా క్లబ్‌కు ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. 
*#ధ్యాన్ చంద్ పేరిట #పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకు ఆ గౌరవాన్ని పొందిన #ఏకైక భారత హాకీ క్రీడాకారుడు ఆయన ఒక్కడే.
*జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం. యూత్ ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్ట్ 29 న ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.

అసాధారణమైన గోల్-స్కోరింగ్ ఫీట్‌లకు  ప్రసిద్ధి చెందిన ధ్యాన్‌చంద్‌
3 డిసెంబర్ 1979లో
మరణించారు
#హాకీక్రీడా మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ధ్యాన్‌చంద్‌ తన క్రీడానైపుణ్యంతో దేశానికే వన్నె తెచ్చారు. ప్రతి క్రీడాకారుడు జీవితంలో క్రీడలు ఒక భాగమనే స్ఫూర్తితో పట్టుదల, కృషితో ముందుకు వెళ్లాలి.


Friday, December 2, 2022

బి.నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా💐

💐💐వినోద విజ్ఞానాల కృషీవలుడు, విజయాదిత్యుడు,చందమామ పత్రిక, అద్భుత దృశ్యకావ్యం, మాయాబజార్‌ ల సృష్టికర్త  బి.నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా💐💐






#బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. మట్టిలో #మాణిక్యం. #విజయానికి మారు పేరు. ఒక కుగ్రామంలో, రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషి, స్వీయప్రతిభ, సృజనాత్మకతతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నతుడు. నేటి తరానికి మార్గదర్శి, ‍స్ఫూర్తి ప్రదాత. క్రమశిక్షణతో కూడుకున్న జీవితం, ఉత్తమ సంస్కారం, అహర్నిశలూ పనిచేసే గుణం మూర్తీభవించిన గొప్ప వ్యక్తిగా రాణించిన ప్రతిభా మూర్తి నాగిరెడ్డి. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్యా సేవలు, వైద్య సేవలు ఉచితంగా అందించారు. ఎన్నో గుప్తదానాలు చేశారు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపార దక్షునిగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది నాగిరెడ్డి. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల #మహామనీషి.

#బాల్యం-తొలి జీవితం:

నాగిరెడ్డి  కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై. కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్‌ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్‌ బి.ఎన్‌. రెడ్డి గారు నాగిరెడ్డి గారికి స్వయానా అన్న. 

 #ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం.ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

#ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె)విశిష్టత:

#అచట పుట్టిన చిగురు కొమ్మయినా చేవగానే ఉంటుందన్నట్లు ఈ గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది.
పులివెందుల –- తాడిపత్రి మార్గంలో పులివెందుల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. జనాభా 800 మాత్రమే. ఎంతో మంది ప్రతిభా మూర్తులకు జన్మనిచ్చింది. ఈ గ్రామానికి చెందిన కొక్కంటి సుబ్బారెడ్డి, లింగిరెడ్డి వెంకటరెడ్డి, చింతా నర్సింహారెడ్డి, గుండ్రెడ్డి సోమిరెడ్డి, వి.హెచ్‌. రామిరెడ్డి అనువారు మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వమే ఇంగ్లండ్‌ వెళ్లి బారిస్టర్‌ చదివారు.
 చిత్రపరిశ్రమకు మూల విరాట్టులైన బి.ఎన్‌. రెడ్డి, నాగిరెడ్డి ఈ గ్రామవాసులే. భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, కడప జిల్లా పరిషత్‌ తొలి చైర్మన్‌, మాజీ పరిశ్రమల మంత్రి పెంచికల బసిరెడ్డి, ప్రముఖ గాంధేయవాది, మాజీ శాసనసభ్యులు చవ్వా బాల్‌రెడ్డి ఈ గ్రామవాసులే.

 #మనుషులు ఇద్దరు...మనసు ఒక్కటే..

నిజంగానే తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి... వారిద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు... వారి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం వేసుకున్నాయి... తొలి చిత్రం 'షావుకారు' మొదలు చివరి చిత్రం 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్' దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి... చక్కన్నది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది... అందుకే విజయావారి చిత్రాల్లో వారిద్దరి అభిరుచి తొణికిసలాడేది.

 #పిల్లల మాసపత్రిక #చందమామ:

1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డిగారు అని పిలిచేవారు.
 మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు.

 #ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో:

1949–-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్‌కేర్‌ సెంటర్‌, విజయా హెల్త్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు.

 ‘#విజయా ప్రొడక్షన్స్’:

1950లో విజయా ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం. 
నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం.తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు.

ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్‌, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీసు హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఓ ఎన్టీఆర్‌ను, ఓ ఎస్వీ రంగారావును, ఓ సూర్యకాంతాన్ని, ఓ సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. 

'#మాయాబజార్:

1957లో నిర్మించబడిన మాయాబజార్‌ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. ప్రేక్షక లోకానికి షడ్రసోపేతమైన విందు భోజనం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష.
మాయాబజార్' స్థాయికి - #సాంకేతిక #నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది #జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు శ్రీ కె.వి.రెడ్డి, రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు. వారి అజరామర సృష్టి - 'మాయాబజార్'.
విడుదలై 60 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ్టికీ అంతే ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్న చిత్రం ఏదైనా వుందంటే నిస్సందేహంగా 'మాయాబజార్' పేరే చెబుతారు.

#తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా:

1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మించబడింది.

#ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు:

 ఆలిండియా ఫిల్మ్‌ సమ్మేళన్‌కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు నాలుగు సార్లు అధ్యక్షులు.

#అవార్డులు:

1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్‌, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బి.ఎన్‌. రెడ్డి, బి. నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్‌, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది.

#ఇతర భాషల్లో:

విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా రాముడు-భీముడు) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు.
నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.

#ప్రముఖ నాయకుల తో అనుబంధం:

ఎం.జి.రామచంద్రన్‌తో నాగిరెడ్డి అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎమ్జీఆర్‌ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్‌ నుండి మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎమ్జీఆర్‌ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు. ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు దక్షతతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు.
నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 21 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.

#విజయం… ఓ సుదీర్ఘ రాత్రి ప్రసవించిన స్వప్నం కాదు. ఎండా వానా కలగలిసి ప్రభవించిన ఇంద్రధనస్సూ కాదు. రక్తాన్ని చెమటగా మరిగిస్తే పుట్టిన ప్రతిబింబమూ కాదు. విజయం అంటే ఓ కళ. ఆ కళలో ఆరితేరిన వ్యక్తి బి.నాగిరెడ్డి. నేటి తరానికి మార్గదర్శి, ‍స్ఫూర్తి ప్రదాత.

Wednesday, November 30, 2022

శ్రీ గురజాడ అప్పారావు గారి వర్థంతి

🌹🙏వెలుగుజాడ...గురజాడ....
నవయుగ వైతాళికుడు, "కవి శేఖర"
శ్రీ గురజాడ అప్పారావు  గారి వర్థంతి
 సందర్భంగా🙏🌷





#తెలుగు సాహిత్యంలో నూతన యుగావిర్భావాన్ని సూచించే ‘#వేగుచుక్క’ గురజాడ అప్పారావు.
తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని #సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.
తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ - గురజాడ. 
#అభ్యుదయమే నిబద్ధతగా సాగిన ఆయన జీవితం- చైతన్య గీతం. మూఢ విశ్వాసాలు, దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నపుడు తన కలంతో ప్రజలను చైతన్య పరిచేందుకు ఉద్యమించిన నవయుగ వైతాళికుడు- గురజాడ అప్పారావు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.హేతువాది అయిన అప్పారావు రచనలు 19వ శతాబ్ది ఆఖర్లోనూ మరియు 20 వ శతాబ్ది మొదట్లో వ్రాసినవి అయినప్పటకీ ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

 #విజయనగరం జిల్లా రాయవరంలో 1862, సెప్టెంబరు 21న గురజాడ వెంకట రామదాసు, కౌసల్యమ్మల సంతానంగా పుట్టిన ఈ పంధొమ్మిదో శతాబ్దపు వ్యక్తి ఇరవై ఒకటో శతాబ్దంలోనూ సజీవ స్ఫూర్తిగా ప్రకాశిస్తున్నాడంటే ఆయన పురోగామి దృక్పథం ప్రజాస్వామిక లక్షణాలు కారణం. సనాతన కుటుంబంలో పుట్టినా మానవతా చైతన్యాన్ని ప్రబోధించాడు గురజాడ. ఆధునిక మహిళ భారత చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ అప్పారావు ఓ వంద సంవత్సరాలకు పూర్వమే విశ్వసించాడు. ఆయన భావాలు, అభ్యుదయం, స్త్రీ జన ఉద్దరణ ఆనాటి కాలానికే కాదు, ఈ నాటి విశ్వాసాలకంటే కూడా ముందు వున్నాయి అంటే అతి శయోక్తి   కాదు. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు. అటు గ్రాంధికం లోను, ఇటు ఆంగ్లం లోనూ గొప్ప పట్టు ఉన్నప్పటికీ ఆయన రచనలు “జనం భాష” లోనే చేసాడు. సామాన్య జనానికి అందని సాహిత్యం సముద్రం లోని ధన రాశి  గానే అయన భావించాడు. బ్రతుకు తెరువుకై రాజు కొలువు చేసినప్పటికీ రాజ్యం కంటే దేశమే గొప్పదని భావించిన అప్పారావు “దేశమును ప్రేమించు మన్నా … మంచి యన్నది పెంచు మన్నా“, “దేశమంటే మట్టి కాదోయ్…దేశమంటే మనుషులోయ్“ అని గొంతెత్తి అరిచాడు. దేశభక్తిని పెంపొందించిన ప్రజాకవి గురజాడ.

#ఈనాటి వర కట్నం, ఆ నాటి కన్యా శుల్కం రెండూ అనాచారాలే, స్త్రీ ల పట్ల వివక్షే ! రెండూ సమాజపు విలువలను కలుషితం చేసే కాల కూట విషాలే! కన్యా శుల్కం పేరిట ముక్కు పచ్చలారని బాలికలను డబ్బు ఆశతో, తల్లి దండ్రులు జబ్బు ముదిరి  కాటికి కాళ్ళు జాచిన వృద్దులకిచ్చి బెడితే, భర్త ఆనతి కాలం లోనే కాలం చేస్తే బాలికలు వితంతువులు గానే జీవితాలను ముగించేవారు. ఆనాటి కుహనా విలువలను కళ్ళకు కట్టినట్లు చెబుతాడు అప్పారావు తన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” లో. 

#గురజాడ రచించిన “కన్యా శుల్కం” హాస్య నాటకం గా ముద్రించినప్పటికీ అందులోని పాత్రలు హాస్య రసాన్ని కురిపించినప్పటికీ  అది ఓ గొప్ప విషాద నాటకం అంటాడు తరువాత కాలం లో వచ్చిన శ్రీ శ్రీ. ఆ నాటకం లో మగ వారి స్త్రీ లోలత్వం, వున్నత కులాల్లో చాటు మాటు గా సాగే దొంగాటలు, స్త్రీల పట్ల వివక్ష, దుర్భరమైన బాల వితంతువుల జీవితాలు   మనకు కన్పిస్తాయి. నాయికానాయకులంటే కులీన వర్గాలకు, పై కులాలకే చెంది ఉండాలనే సూత్రాలన్నిటినీ ధ్వంసం చేసి వేశ్యా కులంలోని మధురవాణి ద్వారా ఆచారపరాయణులమనేవారి బూటకత్వాన్ని ఎండగట్టారు. మరోవైపు ఉన్నత కులం నుంచే వచ్చిన గిరీశాన్ని అవలక్షణాల పుట్టగా, మోసపూరితమవుతున్న సామాజిక దృశ్యానికి సంకేతంగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఆధునిక స్త్రీ కొత్త చరిత్ర సృష్టిస్తుంది అన్న గురజాడ అగ్నిహోత్రావధాన్ల భార్య వెంకమ్మ  వంటి సనాతన పాత్రలతో కూడా తిరుగుబాటు మాటలనిపించడం చూస్తాం. బాల వితంతువు బుచ్చమ్మ తన చెల్లెలి పెళ్ళి కోసమే గిరీశంతో వెళ్ళిపోవడానికి సిద్ధమవడంలోనూ సాహసం, త్యాగం చూస్తాం. పూటకూళ్ళమ్మ చీపురుతో బాదినా, మీనాక్షి శాపనార్థాలు పెట్టినా అన్నిటా స్త్రీ నిరసన తొలి సంకేతాలు అగుపిస్తాయి. “#తాంబూలాలిచ్చేశాను #తన్నుకు చావండి” , “డామిట్ కథ అడ్డం తిరిగింది“, “#పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్” లాంటి నూతన భాషా ప్రయోగాలు నేటికీ నిత్య నూతనమే. 
చింతాకు చెట్టూ చిలకలతోటి ఏ మన్పించింది, అరటికాయబజ్జి, మినపప్పు బజ్జి, ఏనుగెక్కేమనం ఏ ఊరెళదాం.. తదితర చిన్న, చిన్న గేయాలతో చిన్నారులకు ప్రియమైన తాతయ్యగా కూడా మారారు. వాడుక భాషను విస్తృత ప్రచారంలోకి తెచ్చి, ఆ భాషలోనే రచనలు చేస్తూ పండిత పామరులను కట్టిపడేసిన గురజాడ రచనా శైలి ఆయనను ‘నవయుగ వైతాళికుడి’గా నిలబెట్టింది.

#కన్యాశుల్కం నాటకంలోని మధురవాణి పాత్ర తెలుగు సాహిత్యంలోనే ఇంతవరకు సృష్టించ బడని గొప్ప పాత్ర. ఆడవారికైనా, మగవారికైనా నీతి ఒకటి ఉండాలని ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు గురజాడవారు.

#నేను చెడిపోయిన వారిని చేరదీస్తున్నానుగాని, ఎవరినీ చెడగొట్టటంలేదు. ఆ విషయాన్ని మా అమ్మ నాకు నేర్పింది.’ అంటూ మధురంగా #మధురవాణిపాత్ర ద్వారా గురజాడవారు #అద్భుతంగా చెప్పించారు.
ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

#నవయుగ కవితా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులుకు మెట్రిక్యులేషనలో క్లాస్‌మేట్‌ అయిన గురజాడ అప్పారావు కందుకూరి వీదేశలింగం పంతులు లోని సంఘ సంస్కరణ, గిడుగులోని భాషా సంస్కరణలు తీసుకుని రెండింటినీ మేళవించి ఒక సాంఘిక విప్లవం తీసుకువచ్చారు.

#ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. 
చిన్న వయస్సులోనే 1915, నవంబరు 30న కన్నుమూశారు. ఓ చిన్న జీవితం లో గురజాడ సాధించిన విజయాలు తన  స్వార్ధానికి కాదు కనుకనే చాల సంవత్సరాల తరువాత కూడా అయన ప్రజల గుండెల్లో నిలిచాడు. 


Monday, November 28, 2022

మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷

🌷🙏"బహుజనతత్వకర్త తొలి మహాత్ముడు"మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷





"ఒక యువకుడు తన ప్రాణస్నేహితుని పెండ్లికి వెళ్ళాడు..పెండ్లిఇంటిలో వరుడితో చాలా సన్నిహితంగా వుంటూ హడావుడిగా తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నాడు.. అతని హడావుడి,చురుకుదనం చూసిన కొంతమంది అతనెవరని అడిగారు.. అతని కులం ఏమిటని అడిగారు..ఆ అబ్బాయి తన పేరు,కులం చెప్పాడు..అంతే అక్కడున్న కొందరు ఒక బ్రాహ్మణునిఇంట పెండ్లిలో ఒక శూద్రుడు తిరుగాడుటయా అంటూ మండిపడ్డారు..అతనిని అవమానకరంగా మాట్లాడారు. పెండ్లికొడుకు,తండ్రి ఎంత చెప్పినవినకుండా..అతను ఇంట్లో తిరిగితే మేము వెళ్ళిపోతామంటూ బెదిరించారు.విదిలేనిపరిస్థితులలో ఆ యువకుడు అవమానభారంతో తలదించుకొని ఇంటిదారి పట్టాడు. మానవుల మధ్య వివక్షత అతని మనసును గాయపరిచింది..ఇంట్లో బాగా ఆలోచించాడు.తనను అవమానపరిచినవారి గొప్పతనం ఏమిటో ఆలోచించాడు..అతనికి వెంటనే ఆలోచన తట్టింది... ఏ "అక్షరం"చూసి వారు మిడిసిపడుతున్నారో ఆ అక్షరమనే ఆయుధాన్ని ప్రజలందరికీ అందించాలని నిర్ణయించుకున్నాడు.ఫలితంగా ఒక మహోద్యమానికి తెరతీశాడు...అతడే నవయుగవైతాళికుడు జ్యోతీరావుపూలే....
***    ***  *** 

#మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు. నిజమైన #పునరుజ్జీవనోద్యమ #పితామహుడు. భారతదేశంలోని శూద్రులు… శూద్రాతిశూద్రులు (దళిత, బహుజన, ఆదివాస, గిరిజన, ముస్లీం, మైనార్టీలు)  అగ్ర కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారు. అంతే కాకుండా అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే.
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని #పాఠశాలలను రూపొందించారు.

స్త్రీలకు #ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడటమే ప్రథమ కర్తవ్యంగా తను ప్రజలను చైతన్య పరిచి, పోరాటాన్ని నడిపినాడు.

#బాల్యం-తొలి జీవితం:

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఈ‍యన ఏడాదిలోపే పూలే తల్లి మరణించింది.

#ఇంటి పేరు ఫూలే గా మారింది.....

ఆయన తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మి వారి కుటుంబాన్ని పోషించేవాడు. కాలక్రమేణా భారతదేశంలో పీష్వా పరిపాలన ప్రారంభం అయింది. దీంతో ఆ కాలంలో కూరగాయల వ్యాపారం మానేసి పూల వ్యాపారం మొదలు పెట్టాడు పూలే తండ్రి. అలా పూల వ్యాపారం చేస్తూ ఉండడం వలన వారి ఇంటి పేరు ఫూలే గా మారింది. 

7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి తన ప్రాథమిక విద్యనభ్యాసాన్ని ప్రారంభించాడు. కొన్ని రోజులకు చదువును మానేసి తన తండ్రికి వ్యవసాయంలో సాయం చూస్తూ ఉండేవాడు. పనులు ముగించుకుని రాత్రి పూట లాంతరు ముందు కూర్చుని చదువుకునేవారు పూలే. అది గమనించిన ఒక ముస్లిం టీచర్, మరో క్రైస్తవ పెద్వ మనిషి పూలే తండ్రితో మాట్లాడి తన చదువును తిరిగి కొనసాగించేలా ఒప్పించారు. 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.

#శివాజీ అంటే అభిమానం...

జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. #థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

#వివాహం:

తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే అంటే పూలే 13వ ఏట 9ఏళ్ల సావిత్రి బాయితో వివాహం జరిపించారు. తన చదువులు పూర్తి చేసుకున్న అనంతరం పూల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. 1848లో జరిగిన ఒక సంఘటన పూలేని గాయపర్చింది. దీంతో పూలే అప్పటి నుంచి వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. దాంతోపాటు సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలనే నిర్ణయానికొచ్చాడు. తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించాడు. మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. అతను తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన భార్య #సావిత్రి బాయి పూలేని ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధాయురాలిగా నియమించాడు.

 
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు.

#ప్రజల్లో చైతన్యం:

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు.1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. అంతేకాక వింతంతువుగా మారిన గర్భిణీ స్ర్తీల కోసం 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు.
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు.

#దీనబంధు' వార పత్రిక...

 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 
1871 సత్యశోధక సమాజం తరపున 'దీనబంధు' వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు.

#శివాజీ చరిత్రను గేయ రూపంలో....

1874 ఫిబ్రవరి 12న మహాత్మ జ్యోతిబా ఫూలే, రాయఘడ్‌లోని శివాజీ సమాధిని వెలికితీసి ఆయన చరిత్రను గేయ రూపంలో రాసి 1885 నుండి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. 

#సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం  దేశానికి ముఖ్యం.....

సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం ఈ దేశానికి అతి ముఖ్యమనే సందేశాన్ని అందించినారు
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు #నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘#గులాంగిరి’.ఫూలే. సమాజంలో వెనుకబడిన వర్గాల, కులాల, మహిళల అభ్యున్నతికి చేసిన కృషికి ఆయనను ప్రజలు “#మహాత్మా” అనే బిరుదుతో పిలుచుకున్నారు.

#తెలుగు వారి సహకారం:

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న తెలుగుబిడ్డ. నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ల ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు.ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి. వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.

ఏ #ప్రాణస్నేహితుని పెండ్లిలో అవమానపడ్డాడో ..అదే ప్రాణస్నేహితుడు పూలేగారికి చివరి వరకు సహాయసహాకారాలు అందించి తోడ్పాటుగా నిలవడం #కొసమెరుపు.....

#దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ… తన జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించి మహాత్మా జ్యోతిరావు ఫూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. ఆ మహానీయుడు, సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్య శోధకుడు.

Sunday, November 27, 2022

💐💐ప్రముఖ హిందీ కవిపద్మ భూషణ్ హరివంశరాయ్‌ బచ్చన్‌ గారి జయంతి సందర్భంగా💐💐

💐💐ప్రముఖ హిందీ కవి
పద్మ భూషణ్  హరివంశరాయ్‌ బచ్చన్‌ గారి జయంతి సందర్భంగా💐💐
(హరివంశరాయ్‌ బచ్చన్‌
కుమారుడు అమితాబ్ బచ్చన్‌. బచ్చన్ 
 అనేది కలం పేరు)





"ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే.. ఎక్కడైనా కాసేపు కూర్చొని, నేనేం చేశాను? ఏం చెప్పాను? దేనిని నమ్ముతున్నాను? అందులో ఏది మంచి.. ఏది చెడు అని ఆలోచిస్తాను" హరివంశరాయ్‌ బచ్చన్‌

#హరివంశ్ రాయ్ బచ్చన్ ( 1907 నవంబరు 27 - 2003 జనవరి 18) 20 వ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలోని నయీ కవితా సాహిత్య ఉద్యమంలోని భారతీయ కవి. అతను బ్రిటిష్ ఇండియా లోని యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన బాబుపట్టి గ్రామంలో కాయస్థ కులంలోని శ్రీవాస్తవ వంశానికి చెందిన అవధి భారతీయ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను హిందీ కవి సమ్మేళన్‌కు చెందిన కవి. . అతను తన ప్రారంభ రచన మధుశాల (मधुशाला) ద్వారా గుర్తింపు పొందాడు.అతని భార్య తేజీ బచ్చన్ సామాజిక కార్యకర్త. అతని కుమారుడు అమితాబ్ బచ్చన్. అతని మనుమడు అభిషేక్ బచ్చన్. 1976 లో హిందీ సాహిత్యానికి చేసిన సేవకు గాను పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.

#పద్మభూషణ్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ రచయిత మరియు ఆధునిక హిందీ కవిత్వానికి మార్గదర్శకులలో ఒకరు. అతను  విభిన్నమైన రచనా శైలిని కలిగి ఉన్నాడు. అతని సహచరులలో మహాదేవి వర్మ, సుమిత్రానన్ పంత్ మరియు రాంధారి సింగ్ దినకర్ వంటి ప్రసిద్ధ రచయితలు ఉన్నారు.

*"#బచ్చన్"  అనేది కలం పేరు*

1941 నుండి 1957 వరకు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా బోధించాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలు అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ కాథరీన్ కళాశాలలో ఐరిష్ రచయిత డబ్ల్యూ.బి.యీట్స్ రచనలపై పి.హెచ్.డి చేసాడు. అతను హిందీ కవిత్వం రాసేటప్పుడు వాడే శ్రీవాస్తవకు బదులుగా "బచ్చన్" (బాలుడు అని అర్థం) అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం బోధించాడు. అలహాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియోలో కూడా పనిచేశాడు

#రచనా వృత్తి:

బచ్చన్ అనేక హిందీ భాషలలో ( హిందూస్థానీ, అవధి ) నిష్ణాతుడు. అతను దేవనాగరి లిపిలో వ్రాసిన విస్తృత హిందూస్థానీ పదజాలం  చేర్చాడు. అతను పెర్షియన్ లిపిని చదవలేకపోయినపుడు, అతను పెర్షియన్, ఉర్దూ కవిత్వం పట్ల ఒమర్ ఖయ్యామ్ చేత ప్రభావితమయ్యాడు.

బచ్చన్ రచనలు సినిమాలు, సంగీతంలో ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, అమితాబ్ బచ్చన్ నటించిన 1990 చిత్రం అగ్నీపాత్లో అతని రచన "అగ్నిపత్" లోని ద్విపదలు ఉపయోగించారు. తరువాత 2012లో హృతిక్ రోషన్ నటించిన రీమేక్ చేయబడిన అగ్నీపథ్ లో కూడా ఆ ద్విపదలు ఉపయోగించబడ్డాయి.

1968: సాహిత్య అకాడమీ అవార్డు లభించింది • 1976: పద్మభూషణ్‌తో సత్కరించబడింది • 1991: తన నాలుగు-వాల్యూమ్‌ల ఆత్మకథ, క్యా భూలూన్ క్యా యాద్ కరూన్, నీదా కా నిర్మాణ్ ఫిర్, బసేరే సే దూర్ మరియు దశద్వార్ సే సోపన్ తక్ కోసం సరస్వతి సమ్మాన్‌తో సత్కరించారు.

కొంతకాలం క్రితం పోలండ్ లోని వ్రోక్లా పట్టణంలో ఒక చతురస్రానికి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం అక్కడి నుంచి బయటకు వచ్చింది. హరివంశరాయ్ బచ్చన్ దగ్గర ఒక దీపం వెలిగించబడుతుంది, పుస్తకాలతో కుర్చీపై కూర్చొని. ఈ చిత్రాన్ని పంచుకున్న అబితబ్ బచ్చన్ ఇలా రాశాడు- 'పోలండ్ లోని వోక్లాలోని తన విగ్రహం వద్ద దీపావళికి 'దియా' ఉంచడం ద్వారా వారు బాబూజీని గౌరవిస్తారు. ఒక గౌరవప్రదం."

#రాజ్యసభ సభ్యునిగా
3 ఏప్రిల్ 1966 - 2 ఏప్రిల్ 1972 వరకు పనిచేశారు.

2003 జనవరి 18 (వయస్సు 95) మరణించారు.
🙏🙏🌷🌺🌹🙏🙏


1) EWS అంటే ఏమిటి ? Economically Weaker Section. OC లలో అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు

1) EWS అంటే ఏమిటి ?
జ) Economically Weaker Section.







కేంద్ర ప్రభుత్వం OC లలో అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది.

2) EWS వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
జ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అన్ని కళాశాలల్లో 10% సీట్లు,కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో  ఉండే అన్ని ఉద్యోగాలలో 10% కేటాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో,ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.

3) EWS రిజర్వేషన్ పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి ?
జ) 1) కుటుంబ ఆదాయం 8 లక్షలు,ఆ లోపు మాత్రమే ఉండాలి.

2)వ్యవసాయ భూమి 5 ఎకరాలు,ఆ లోపు మాత్రమే ఉండాలి.

3)ఇల్లు 1000 చదరపు అడుగులలో మాత్రమే ఉండాలి.

4)నోటిఫై చేసిన మున్సిపల్ ఏరియాలో స్థలం 100 చదరపు గజాలు మాత్రమే ఉండాలి.

5)  రూరల్ ఏరియాలో  స్ధలం ఉంటే అది 200 చదరపు గజాలు మాత్రమే ఉండాలి.

4) EWS కి ఎలా అప్లై చేయాలి ?
జ) మీ ఆధార్ కార్డును అడ్వకేట్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి EWS అప్లై చేయడానికి నోటరీ కావాలని అడగండి.వెంటనే నోటరీ సర్టిఫికేట్ ఇస్తారు.
ఆ ఒరిజనల్ నోటరీతో పాటు,అభ్యర్ధి ఆధార్ జెరాక్స్ ,ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని మీ సేవ ఆఫీసు/సచివాలయం కు వెళ్ళండి.అక్కడ వారు ఓ అప్లికేషన్ ఇస్తారు.దానిపై సంతకం చేసేసి మీ దగ్గర ఉన్న  పేపర్లు అన్ని ఇస్తే సరిపోతుంది.

5) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఎంత  ?
జ) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఒక  సంవత్సరం (ఏప్రియల్ నుండి మార్చి వరకు)మాత్రమే.టైమ్ అయిపోతే మరల నోటరి దగ్గర నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాలి.
2021-22ఫైనాన్షియర్ ఇయర్ లో వచ్చిన ఆదాయం బట్టి ఇచ్చిన సర్టిఫికేట్ కాల పరిమితి 2022 ఏప్రియల్ నుండి 2023మార్చి వరకు మాత్రమే.

6) కుటుంబం అంతటికి ఒక EWS సర్టిఫికేట్ సరిపోతుందా ?
జ) సరిపోదు.విద్య,ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబం లో వారందరూ విడివిడిగా చేయించుకోవాలి.
🤝🙏

🌺📚జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22📚🌺


డిసెంబరు 22.. జాతీయ గణిత దినోత్సవం.. రామానుజన్ నంబరు గురించి మీకు తెలుసా..?






శ్రీనివాస రామనుజన్ పుట్టినరోజుని భారత జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1887 డిసెంబరు 22వ తేదిన తమిళనాడులో జన్మించిన రామానుజన్, గణితంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొన్నాడు. ఐతే రామానుజన్ గురించి తెలిసిన వాళ్లకి రామానుజన్ నంబర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. 1729.. రామానుజన్ నంబరు.. అసలు ఈ నంబరుని రామానుజన్ నంబర్ అని ఎందుకంటారు. దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గణితంలో మరిన్ని పరిశోధనల కోసం రామానుజన్ గారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రొఫెసర్ హార్డీతో రామానుజన్ గారికి మంచి పరిచయం ఏర్పడింది. హార్డీగారు రామానుజన్ తో కలిసి అనేక గణిత శాస్త్ర ఫార్మూలాలు కనుక్కున్నారు.


ఐతే రామానుజన్ గారు అనారోగ్యానికి గురై మంచం పట్టినపుడు ప్రొఫెసర్ హార్డీ చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ల మాటల మధ్యలో రామానుజన్ గారు, హార్డీ.. నువ్వు ఎలా వచ్చావని అడగ్గా, కారులో వచ్చానని బదులిచ్చారు.

ఆ కారు నెంబరు ఎంత అని అడగ్గానే, కారు నెంబరుకి పెద్ద ప్రత్యేకతేం లేదు అని 1729 అని చెప్పాడు. అప్పుడు వెంటనే రామానుజన్ గారు ఆ నంబరుకి ప్రత్యేకత లేదని ఎవరు చెప్పారు. ఆ సంఖ్యని రెండు ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయవచ్చు. అలా రాయగలిగిన ఒకే ఒక్క నంబరు అది అని చెప్పడంతో హార్డీ షాకయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా నంబరుకి ఉన్న ప్రత్యేకత చెప్పడంతో, హార్డీ ఆశ్చర్యానికి గురయ్యారు.

1729..
ఈ సంఖ్యని 9, 10 ఘనాల మొత్తాన్ని(9*9*9*)+(10*10*10) కలిపితే 1729వస్తుంది.
అలాగే 12, 1 ఘనాల మొత్తాన్ని (12*12*12) + (1*1*1) కలిపినా 1729 వస్తుంది.















































































Saturday, November 26, 2022

💐భారత రాజ్యాంగ ప్రవేశిక💐

భారత రాజ్యాంగ ప్రవేశిక: భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క సూత్రాలను సూచిస్తుంది మరియు దాని అధికారం యొక్క మూలాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ చే ఆమోదించబడింది మరియు 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. మేము భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాము.






1946లో, రాజ్యాంగ నిర్మాణాన్ని వివరిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్‌ను ప్రవేశపెట్టారు. 1947లో (జనవరి 22) ఇది ఆమోదించబడింది. ఇది భారత రాజ్యాంగాన్ని ఆకృతి చేసింది మరియు దాని సవరించిన సంస్కరణ భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిబింబిస్తుంది. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు:

భారతదేశాన్ని స్వతంత్ర, సార్వభౌమాధికారం మరియు గణతంత్ర దేశంగా చూడాలనే రాజ్యాంగ సభ సంకల్పం
భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి
స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న భారతదేశంలోని అన్ని భూభాగాలను స్వతంత్రానంతర భారతదేశం యొక్క యునైటెడ్ స్టేట్స్‌గా మార్చడం
అవశేష అధికారాలను గ్రహించడానికి, భారత రాజ్యాంగం వంటి రాష్ట్రాలపై స్వయంప్రతిపత్తి ప్రతిబింబిస్తుంది
అటువంటి రాష్ట్రాలకు ఇచ్చిన వాటి కంటే భిన్నంగా ఉండే శక్తితో ఐక్యతను గ్రహించడం
భారతదేశ ప్రజలు సార్వభౌమాధికారం మరియు స్వాతంత్ర్యం యొక్క శక్తి మరియు అధికారం యొక్క మూలాన్ని గ్రహించడం
న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వం యొక్క హోదా మరియు ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన, వృత్తి, సంఘం మరియు చర్య, చట్టం మరియు ప్రజలకు లోబడి స్వేచ్ఛను అందించడం
మైనారిటీలు, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలు మరియు ఇతర అణగారిన మరియు వెనుకబడిన తరగతులకు తగిన రక్షణ కల్పించడం
భారత రిపబ్లిక్ భూభాగం యొక్క సమగ్రతను మరియు నాగరిక దేశం యొక్క న్యాయం మరియు చట్టం ప్రకారం భూమి, సముద్రం, గాలిపై దాని ప్రాదేశిక హక్కులను కొనసాగించడం
ప్రపంచ దేశాల మధ్య శాంతి మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడం.

 (భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి వాస్తవాలు)
ఇది మొత్తం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రూపొందించబడింది
1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘సెక్యులర్’ అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.
పీఠిక భారతదేశంలోని పౌరులందరికీ విశ్వాసం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛను అందిస్తుంది
పీఠికలోని న్యాయం (సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ) ఆదర్శాలు సోవియట్ యూనియన్ (రష్యా) రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి
రిపబ్లిక్ మరియు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి
రాజ్యాంగ ప్రవేశిక, మొదటగా అమెరికన్ రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టబడింది

భారత ప్రవేశిక యొక్క నాలుగు ప్రధాన అంశాలు

భారత రాజ్యాంగ ప్రవేశికలోని కీలక పదాలు)
భారతదేశ ప్రవేశికలో కొన్ని ముఖ్యమైన కీలకపదాలు ఉన్నాయి:

సార్వభౌమ
సోషలిస్టు
సెక్యులర్
డెమోక్రటిక్
రిపబ్లిక్
న్యాయం
స్వేచ్ఛ
సమానత్వం
సోదరభావం

Sovereign (సార్వభౌమ)
ప్రవేశిక ద్వారా ప్రకటించబడిన ‘సార్వభౌమాధికారం’ అంటే భారతదేశానికి దాని స్వంత స్వతంత్ర అధికారం ఉంది మరియు అది మరే ఇతర బాహ్య శక్తి యొక్క ఆధిపత్యం కాదు. దేశంలో చట్టసభలకు కొన్ని పరిమితులకు లోబడి చట్టాలను రూపొందించే అధికారం ఉంది.

Socialist (సోషలిస్టు)
‘సోషలిస్ట్’ అనే పదాన్ని 42వ సవరణ, 1976 ద్వారా ప్రవేశికలో చేర్చారు, అంటే ప్రజాస్వామ్య మార్గాల ద్వారా సోషలిస్టు లక్ష్యాలను సాధించడం. ఇది ప్రాథమికంగా ‘ప్రజాస్వామ్య సోషలిజం’, ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని కలిగి ఉంది, ఇక్కడ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు రెండూ పక్కపక్కనే ఉన్నాయి.

Secular (సెక్యులర్)
‘సెక్యులర్’ అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ, 1976 ద్వారా పీఠికలో పొందుపరిచారు అంటే భారతదేశంలోని అన్ని మతాలకు రాష్ట్రం నుండి సమాన గౌరవం, రక్షణ మరియు మద్దతు లభిస్తాయి.

Democratic (డెమోక్రటిక్)
‘డెమోక్రటిక్’ అనే పదం, భారత రాజ్యాంగం రాజ్యాంగం యొక్క స్థిర రూపాన్ని కలిగి ఉందని సూచిస్తుంది, ఇది ఎన్నికలలో వ్యక్తీకరించబడిన ప్రజల అభీష్టం నుండి దాని అధికారాన్ని పొందుతుంది.

Republic (రిపబ్లిక్)
‘రిపబ్లిక్’ అనే పదం రాష్ట్ర అధినేతను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలు ఎన్నుకున్నారని సూచిస్తుంది. భారతదేశంలో, రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి మరియు అతను ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతాడు.

Justice (న్యాయం)
న్యాయం అంటే చట్టం యొక్క పాలన, ఏకపక్షం లేకపోవడం మరియు సమాజంలో అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు అవకాశాల వ్యవస్థ.
భారతదేశం తన పౌరులకు సమానత్వాన్ని నిర్ధారించడానికి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని కోరుకుంటుంది.

Liberty (స్వేచ్ఛ)
లిబర్టీ ఆలోచన భారతీయ పౌరుల కార్యకలాపాలపై స్వేచ్ఛను సూచిస్తుంది. భారతీయ పౌరులపై వారు ఏమనుకుంటున్నారో, వారి వ్యక్తీకరణల విధానం మరియు వారి ఆలోచనలను చర్యలో అనుసరించాలనుకునే విధానంలో ఎటువంటి అసమంజసమైన ఆంక్షలు లేవని ఇది నిర్ధారిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, స్వేచ్ఛ అంటే ఏదైనా చేసే స్వేచ్ఛ కాదు మరియు అది రాజ్యాంగ పరిమితులలో ఉపయోగించబడాలి.

Equality (సమానత్వం)
‘సమానత్వం’ అనే పదానికి సమాజంలోని ఏ వర్గానికైనా ప్రత్యేక హక్కు లేకపోవడం మరియు ఎలాంటి వివక్ష లేకుండా వ్యక్తులందరికీ తగిన అవకాశాలను కల్పించడం.

Fraternity (సోదరభావం)
ఇది సోదరభావం మరియు సోదరి భావాన్ని మరియు దేశంతో దాని ప్రజలలో ఉన్న భావాన్ని సూచిస్తుంది.
సోదరభావం రెండు విషయాలకు హామీ ఇవ్వాలని పీఠిక ప్రకటించింది-వ్యక్తి గౌరవం మరియు దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత. 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా ‘సమగ్రత’ అనే పదాన్ని పీఠికలో చేర్చారు