💐హాకీ కా జాదుగర్...........🏑
ధ్యాన్‌చంద్ గారి వర్థంతిసందర్భంగా
#భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో #క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు #ధ్యాన్‌చంద్. భారత హాకీ #ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే.
భారత హాకీని ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు.. #ఒలింపిక్స్‌లో భారత పతకాన్ని రెపరెపలాండించిన పౌరుడు.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్. 22ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన ఆయన జన్మదినమైన ఆగస్టు 29 ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ధ్యాన్‌చంద్ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం వలన బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
#బాల్యం:
ధ్యాన్‌చంద్ ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. మధ్య ప్రదేశ్‌లోని ధ్యాన్‌చంద్‌నగరంలో పెరిగారు. ఆయనకు చిన్న తనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం.
1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు.
#హాకీ స్టిక్ అతని చేతిలో #మంత్రదండం:
హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండంగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్ చాతుర్యం, పాసింగ్‌లో అసాధారణ నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. అతను బంతిని నియంత్రించే విధానం చూసి మైదానంలోని అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా మంత్ర ముగ్దులయ్యేవారు. ప్రపంచ హాకీలో ‘ది విజార్డ్’, ‘మెజిషియన్’ గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కింది. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. 1936లో లాస్ ఎంజిల్స్ లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి భారత్ ను గెలిపించారు. ధ్యాన్‌చంద్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1948 లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్‌లో 400 కు పైగా గోల్స్ ను నమోదు చేసాడు.
1936నాటి ఒలంపిక్స్‌లో జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్‌లో ద్వితీయార్థంలో ధ్యాన్ చంద్..తన షూ, సాక్స్‌ను తీసేసి మ్యాచ్ ఆడారు. అయినా మూడు గోల్స్ సాధించి భారత్‌కు ఒలంపిక్స్ పతకాన్ని అందించాడు.
#ముగ్ధుడైన హిట్లర్:
ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంతన హిట్లర్ ధ్యాన్‌చంద్‌కు జర్మనీలోధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధుడైన హిట్లర్...
"మీ హాకీస్టిక్ దగ్గరే బాల్ వుంటుంది, మీరు క్రికెట్లో రన్స్ చేసినట్లుగా హాకీలో గోల్స్ వేస్తున్నారు". అని ఇంకొదరు, "మీరు మా దేశానికి వస్తే మంచి ఉద్యోగం హోదా కల్పిస్తాం, మా దేశం తరుపున ఆడండి"జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కల్నల్ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్‌చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.
#స్టిక్‌లో #అయస్కాంతం ఉందా......స్టిక్‌ను విరిచి చూశారు......
ధ్యాన్‌చంద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫార్వర్డ్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బంతిని డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు హాకీ స్టిక్, బంతి రెండు అతుక్కొని పోయాయా అన్న భ్రమ కలిగించే విధంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించే వాడని ఒక సందర్భంలో విదేశీయులు ఆయన స్టిక్‌లో అయస్కాంతం ఉందా అని స్టిక్‌ను విరిచి చూడటం ధ్యాన్‌చంద్ క్రీడా నైపుణ్యానికి అద్దం పడుతుంది. మరొక
హాకీ స్టిక్ తో ధ్యాన్‌చంద్ ఆటను కొనసాగించారు.
#నిశిత పరిశీలన:
ఓ మ్యాచ్ సందర్భంగా ధ్యాన్ చంద్ ప్రత్యర్థులపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. గోల్ పోస్ట్ విషయంలో రిఫరీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిశీలనలో గోల్ పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది.అందరి మన్ననలు పొందారు తద్వారా ఆయనకి ఆటమీద గల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ...
#చంద్‌గా పిలవడం......
చంద్రుడి వెలుతురులోనూ ఆయన ప్రాక్టీస్ చేసేవారు. అందుకే ఆయన్ను చంద్‌గా పిలిచేవారు.
హాకీలో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్‌చంద్‌ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్ పేరు ప్రపంచపటంలో మారుమ్రోగి పోవడంలో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు.
#రాజీవ్ ఖేల్ రత్నా’ను ‘#ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా’గా మార్పు:
ఈ ధన్యజీవికి మరింత గౌరవం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ‘రాజీవ్ ఖేల్ రత్నా’ అవార్డును ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా’గా మార్చింది.
#గౌరవం:
*క్రీడా రంగంలో ధ్యాన్‌చంద్ చేసిన కృషికి ప్రభుత్వం 1956 లో భారతీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. *క్రీడా రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచిన ధ్యాన్‌చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
*2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణం చేశారు. *అలిఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని ఓ హాస్టల్‌కు ఆయన పేరు పెట్టారు.
*లండన్‌లోని ఇండియన్ జింకానా క్లబ్‌కు ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.
*#ధ్యాన్ చంద్ పేరిట #పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకు ఆ గౌరవాన్ని పొందిన #ఏకైక భారత హాకీ క్రీడాకారుడు ఆయన ఒక్కడే.
*జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం. యూత్ ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్ట్ 29 న ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.
అసాధారణమైన గోల్-స్కోరింగ్ ఫీట్‌లకు ప్రసిద్ధి చెందిన ధ్యాన్‌చంద్
3 డిసెంబర్ 1979లో
మరణించారు
#హాకీక్రీడా మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ధ్యాన్‌చంద్ తన క్రీడానైపుణ్యంతో దేశానికే వన్నె తెచ్చారు. ప్రతి క్రీడాకారుడు జీవితంలో క్రీడలు ఒక భాగమనే స్ఫూర్తితో పట్టుదల, కృషితో ముందుకు వెళ్లాలి.
0 comments:
Post a Comment