A homepage subtitle here And an awesome description here!

Friday, January 14, 2022

✍️సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు🌅🌅🏕️

 ✍️సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు🌅🌅🏕️


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.

1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి , ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ , వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ! 

2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.
శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని , నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది ! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే , ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.

3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి *‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి , నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’* అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో *‘రోజూ ఆహారం తీసుకోవాలి , నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’* అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. *‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’* అని శపించాడు.
అప్పటి నుంచి ఎద్దులు , వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.

4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు , వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే , హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర , ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.
🌾🌾🌾🌾🌾🌾🌴🌴🌴🔥🌳🌳🌻🌻🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌅🌅🌅🙏






🏅ప్రముఖ రచయిత్రి,సామాజిక కార్యకర్త మహా శ్వేతాదేవి గారి జయంతి 🏅

💐🌷ప్రముఖ రచయిత్రి,
సామాజిక కార్యకర్త
మహా శ్వేతాదేవి గారి జయంతి 🌷💐
✍️సాహిత్యకారుల కుటుంబంలో జన్మించిన మహా శ్వేతాదేవి
సాహిత్యంతో పాటు సామాజిక అంశాలపై పనిచేయడం ప్రారంభించారు. గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. తాను చూసిన జీవితాలను పుస్తకాల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. అక్షరాలతో చైతన్యం తీసుకువచ్చారు. ఆమే మహాశ్వేతాదేవి. చివరివరకు సాహిత్యవనంలో సేదతీరిన మహారచయిత్రి. ఆమె సుప్రసిద్ధ నవలా రచయిత అంతకు మించి సామాజిక కార్యకర్త.

✍️బాల్యం-తొలి జీవితం:

ఆమె 1926 జనవరి14న ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది.ఆమె తండ్రి మనిష్‌ ఘటక్‌ కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త. తల్లిదండ్రుల బాటలోనే ఆమె పయనించారు. విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్య్రం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు వచ్చింది. ఆ తర్వాత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతి నికేతన్‌ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వ విద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేశారు. ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజన్‌ భట్టాచార్య ను ఆమె వివాహం చేసుకున్నారు.

✍️ఉద్యోగం:

1964లో కోల్‌కతా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బిజోరుగఢ్‌ కాలేజిలో ప్రొఫెసర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన సామాజిక అంశాలపై అధ్యయనం చేశారు. 

✍️సాహిత్యం:

దేవి 100కి పైగా నవలలు మరియు 20కి పైగా చిన్న కథల సంకలనాలను రాశారు. ప్రాథమికంగా బెంగాలీలో వ్రాయబడింది కానీ తరచుగా ఇతర భాషలకు అనువ దించబడింది.ఝాన్సీ రాణి జీవిత చరిత్ర ఆధారంగా ఆమె మొదటి నవల ఝాన్సీ రాణి 1956లో ప్రచురించబడింది. నవల కోసం స్థానిక ప్రజల నుండి సమాచారం మరియు జానపద పాటలను రికార్డ్ చేయడానికి ఆమె ఝాన్సీ ప్రాంతంలో పర్యటించింది.

✍️మహాశ్వేతా దేవి ప్రత్యేకత ఆదివాసీ, దళిత మరియు అట్టడుగు పౌరుల స్త్రీలపై దృష్టి సారించి వారి అధ్యయనాలలో ఉంది. బ్రిటీష్ వలసవాదం , మహాజనాలు మరియు ఉన్నత తరగతి అవినీతి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా వారు నిరసనకారులుగా సంబంధం కలిగి ఉన్నారు . ఆమె కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గ్రామాల్లో వారితో స్నేహం చేస్తూ, వారి నుంచి నేర్చుకుంటూ ఉండేది. ఆమె వారి పోరాటాలు మరియు త్యాగాలను తన మాటలలో మరియు పాత్రలలో పొందుపరిచింది. తన కథలు తన సృష్టి కాదని, అవి తన దేశ ప్రజల కథలని ఆమె పేర్కొంది. ఆమె రచన " చోట్టి ముండి ఎబాంగ్ టార్ తిర్ " అటువంటి ఉదాహరణ.

✍️బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల్లో చైతన్యం కోసం ఆమె ఉద్యమించారు. ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్నది ఇతివృత్తంగా తీసుకుని ఆమె రాసిన నవల ఎంతో పాఠకాదరణ పొందింది.
✍️సాధించాడన్న విషయంపై ‘ఎతోవా పోరాటం గెలిచాడు’. అనే నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి గారిచే అనువదించబడింది. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలతో రూపొందించారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటిని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు

✍️ఆమె సాహిత్య సంపదలో ఎన్నో ఆణిముత్యాలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. హజార్‌ చౌరాసిర్‌ మా, ద క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ, డస్ట్‌ ఆన్‌ ద రోడ్‌, అవర్‌ నాన్‌వెజ్‌ కౌ, టిటు మిర్‌, ద్రౌపది, ఓల్డ్‌ వుమెన్‌, డకతేరు కహానీ, టిల్‌ డెత్‌ డు అజ్‌ పార్ట్‌ తదితరాలన్నీ మహాశ్వేతా దేవి సాహిత్య సంపదలోవే. మహాశ్వేతా దేవి రచనల ఆధారంగా బాలీవుడ్‌లో రుడాలి, హజార్‌ చౌరాసీ కీ మా, మాటీ మారు, గంగోర్‌ వంటి సినిమాలు కూడా వచ్చాయి. 

✍️ప్రధాన రచనలు:

*ఝాన్సీ రాణి (1956, జీవిత చరిత్ర) 
*హజర్ చురాషిర్ మా
 (1974, నవల, మదర్ ఆఫ్ 1084 ) 
*అరణ్యర్ అధికార్ (1979, రైట్ టు ది ఫారెస్ట్ ) 
*అగ్నిగర్భ (1978, చిన్న కథల సంకలనం) 
*మూర్తి (1979, చిన్న కథల సంకలనం)
*నీరేతే మేఘ్ (1979, చిన్న కథల సంకలనం)
*స్టాన్యదాయని (1980, చిన్న కథల సంకలనం)
*చోట్టి ముండా ఎబాంగ్ *తార్ తిర్ (1980, చిన్న కథల సంకలనం)

✍️అవార్డులు:

*2006లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
*2004లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం లభించింది.
*1997లో రామన్ మెగ్సేసే అవార్డు స్వీకరించింది.
*1996లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు లభించింది.

90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28న తుది శ్వాస విడిచారు.
🙏🙏🌷🌹🌸🙏🙏

Thursday, January 13, 2022

🧚🌴దేవత - బంగారు గొడ్డలి 🌴

 అనగనగా ఒక ఊరిలో రామయ్య , సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుండే వారు . 

ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది . దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయుందని భాదపడుతూ నది ఒడ్డున కూర్చుని విచారిస్తున్నాడు .
 
దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీదేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యు ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది . తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గానీ నాకు పూట గడవదు . 
ఇప్పుడు నాకన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు . దీంతో నదీ దేవత నదిలో నుండి ఓ బంగారు గొడ్డలి  
తీసి ఇదేనా రామయ్య నీ గొడ్డలి అని ప్రశ్నించింది . ఆ గొడ్డలి చూసిన రామయ్య నాది కాదని సమాధానం చెప్పాడు. మళ్ళీ నదీదేవత వెండి గొడ్డలని తీసి చూపగా అదీ నాది కాదని సమాధానం చెప్పగా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప తీసి చూపించింది . 
తన గొడ్డలిని చూసి సంతోషించిన రామయ్య ఇదే నా గొడ్డలి తల్లీ అని నదీ దేవతతో చెప్పాడు . బంగారు , వెండి గొడ్డల్లు ఇచ్చినా ఆశపడని నదీ దేవత మెచ్చి రామయ్యకు మూడు గొడలను ఇచ్చి మాయమయ్యింది.


🛖🏕️పెద్దల మాట✍️

🏕️🏕️⛺🛖 అనగనగా రాజుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది . అది లోతట్టులో ఉన్న గ్రామం . గోదావరి సమీపంలో ఉండటంతో భారీ వర్షాలు వచ్చినప్పు డల్లా మునిగి పోతుండేది . ఒక సారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి . ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు . అంతలో వారికి ఒక ముని ఎదురయ్యాడు . ఆయన గ్రామస్తులతో " మీరు వెళ్ళేటప్పుడు . ఆ మూలగా ఉన్న గులకరాళ్లలో ఎన్ని తీసుకెళ్లగలిగితే అన్ని తీసుకెళ్లండి . వాటి వలన మీకు భవిష్యత్లో చాలా ప్రయోజనం కలుగుతుంది " అని చెప్పాడు . కొంత మంది " మా బాధల్లో మేం ఉంటే ఈ గులకరాళ్ల గోలేంటి " స్వామీ ? " అని విసుక్కుంటూ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్లిపోయారు . ఇంకొందరు " స్వామి ఎందుకు చెప్తున్నాడో ఏమిటో " అనుకొని కొన్ని గులక రాళ్లను తీసుకుని వెళ్లారు . మరి కొంతమంది గ్రామస్తులు ముని తమ మేలు కోరే గులకరాళ్లను తీసుకెళ్లమంటున్నాడని భావించి వారి శక్తి మేరకు గులకరాళ్లను తీసుకుని వెళ్లారు . వరద నుంచి తప్పించుకుని వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశంలో ఇళ్లను నిర్మించుకొని నివసించటం మొదలు పెట్టారు . కొంత కాలానికి ఒక ఇంట్లో పిల్లలు గులక రాళ్లతో ఆడుకుంటుండగా ఒక గులకరాయి మెరవటం ఆ ఇంటి యజమాని గమనించాడు . అను మానం వచ్చి ఆ రాయికి సాన పెట్టించాడు . అది వజ్రమని అర్థం కాగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు . ఆ విషయం క్షణాల్లోనే ఊరంతా తెలి సిపోయింది . గ్రామస్తులు తాము తెచ్చుకున్న గులకరాళ్లకు సాన పెట్టిం చారు . వాటన్నింటినీ వజ్రాలుగా మార్చుకున్నారు . వాటిని అమ్మి ధనవం తులయ్యారు . గులకరాళ్లను ఒక్కటి కూడా తీసుకెళ్లని వారు చాలా దుఃఖిం చారు కొన్నింటిని మాత్రమే తీసుకెళ్లిన వారు మరి కొన్ని తెచ్చుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు . ఎక్కువ రాళ్లను తీసుకెళ్లిన వారి ఆనందానికి అవధులు లేవు . ముని చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన వారు ఎక్కువుగా బాగు పడ్డారు . సగం నమ్మిన వారు ఆ మేరకు బాగుపడ్డారు . అసలు నమ్మని వారు బాధపడ్డారు . వారు ముని చెప్పినా పట్టించుకోనందుకు పశ్చాత్తాపం చెందారు.
 నీతిః పిల్లల భవిష్యత్ కోసం పెద్దలు తమ అనుభవంతో చెప్పే మంచి విషయాలు మామూలు మాటలుగా అనిపించినా చేయకుండా సరిగ్గా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

గాడిద-గుర్రం 🐎 నీతి కథ

రామయ్య  అనే వ్యాపారి   సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగూరు వెళుతున్నాడు , కొంత సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది , గుర్రం అది నా బాధ్యతకాదు , బరువులు మోయటానికి నువ్వు , సుఖంగా జీవించడానికి నేను అన్నది , బరువు మోయలేని గాడిద నడుము విరిగి క్రిందపడింది , వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదలి , ఆ బరువు మొత్తాన్ని గుర్రం పై వేసి తనూ ఎక్కి ప్రయాణం సాగించాడు . ఆ కొంచం బరువును ముందే స్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది 
నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.

కాకి - పాము

 అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో రాజ మందిరం ఉండేది . దానికి కొంచెం చెట్టుపైన కాకి గూడు నిర్మించుకుని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది . కాకి తన పిల్లలకు ఆహరం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టు పైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది . దీంతో కాకి ఏమి చెయ్యాలో తెలియక తెగ బాధపడుతుండేది . ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది . ఉపాయం వచ్చిందే తడువుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణీ గారి నగను తన నోట కరుచుకుని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళ సాగింది . రాజ భటులు ఆ కాకి వెంట పడ్డారు . తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోనికి జార విడిచింది.
 దీంతో రాజభటుటు గునపములు , పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజ భటులపై కోపంతో బుస కొట్టింది . దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపి వేసి ఆ నగను తమతో తీసుకు వెళ్ళి రాణి గారికి అప్పగించారు . ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడయ్యుందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది . 
నీతి - ఉపాయముతో ఎంతటి అపాయమునుండైనా బయట పడవచ్చు.

ఆవు పులి నీతి కథ

 అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహరం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది . ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహరం దొరికిందని ఆ ఆవును దగ్గర కి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది .. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు . ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో భాదపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మద్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది . అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది . నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చిరావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయ పడింది . ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ది వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను . వెళ్ళి త్వరగా రా .. అని చెప్పింది . తనకు అవకాశమిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపునిండా పాలిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాద్యతను తోటిపశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది . ఆవు నిజాయుతీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయుతీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలి పెడుతున్నాను . వెళ్ళి నీ బిడ్డతో హాయుగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది . ' పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయు తన బిడతో హాయిగా జీవించసాగింది. 
నీతి : మన నిజాయుతీనే మనల్ని కాపాడుతుంది .

Wednesday, January 12, 2022


📚 Mandal Development Plan 2022-23 ,School/College Development Plan, Habitation Development Plan

మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము ఇందులో 

👉 మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక(Mandal Development Plan)ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలె. 

👉 రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక(School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలె


👉  మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan) 

ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి. 


ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో  మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే  త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి. 




1) APSS - AWP&B 2022-23 - Google Form for Mandal Development Plan -to be filled by MEOs 




 Mandal development plan form. 



https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link



-----------------------------------------------------------

2) *School Development Plan* 

link:  https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform?usp=sf_link


to be filled by All Government Schools HMs

-------------------------------------------

 

3) Habitation Development Plan

link:  https://docs.google.com/forms/d/e/1FAIpQLScbRjm443MgmSsIrieFNJnVU7k0MysnCLFQT0vFzlnZKC4U5w/viewform?usp=sf_link


to be filled by Habitation Schools primary HMs only along with their school plan