Thursday, January 13, 2022

🛖🏕️పెద్దల మాట✍️

🏕️🏕️⛺🛖 అనగనగా రాజుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది . అది లోతట్టులో ఉన్న గ్రామం . గోదావరి సమీపంలో ఉండటంతో భారీ వర్షాలు వచ్చినప్పు డల్లా మునిగి పోతుండేది . ఒక సారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి . ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు . అంతలో వారికి ఒక ముని ఎదురయ్యాడు . ఆయన గ్రామస్తులతో " మీరు వెళ్ళేటప్పుడు . ఆ మూలగా ఉన్న గులకరాళ్లలో ఎన్ని తీసుకెళ్లగలిగితే అన్ని తీసుకెళ్లండి . వాటి వలన మీకు భవిష్యత్లో చాలా ప్రయోజనం కలుగుతుంది " అని చెప్పాడు . కొంత మంది " మా బాధల్లో మేం ఉంటే ఈ గులకరాళ్ల గోలేంటి " స్వామీ ? " అని విసుక్కుంటూ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్లిపోయారు . ఇంకొందరు " స్వామి ఎందుకు చెప్తున్నాడో ఏమిటో " అనుకొని కొన్ని గులక రాళ్లను తీసుకుని వెళ్లారు . మరి కొంతమంది గ్రామస్తులు ముని తమ మేలు కోరే గులకరాళ్లను తీసుకెళ్లమంటున్నాడని భావించి వారి శక్తి మేరకు గులకరాళ్లను తీసుకుని వెళ్లారు . వరద నుంచి తప్పించుకుని వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశంలో ఇళ్లను నిర్మించుకొని నివసించటం మొదలు పెట్టారు . కొంత కాలానికి ఒక ఇంట్లో పిల్లలు గులక రాళ్లతో ఆడుకుంటుండగా ఒక గులకరాయి మెరవటం ఆ ఇంటి యజమాని గమనించాడు . అను మానం వచ్చి ఆ రాయికి సాన పెట్టించాడు . అది వజ్రమని అర్థం కాగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు . ఆ విషయం క్షణాల్లోనే ఊరంతా తెలి సిపోయింది . గ్రామస్తులు తాము తెచ్చుకున్న గులకరాళ్లకు సాన పెట్టిం చారు . వాటన్నింటినీ వజ్రాలుగా మార్చుకున్నారు . వాటిని అమ్మి ధనవం తులయ్యారు . గులకరాళ్లను ఒక్కటి కూడా తీసుకెళ్లని వారు చాలా దుఃఖిం చారు కొన్నింటిని మాత్రమే తీసుకెళ్లిన వారు మరి కొన్ని తెచ్చుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు . ఎక్కువ రాళ్లను తీసుకెళ్లిన వారి ఆనందానికి అవధులు లేవు . ముని చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన వారు ఎక్కువుగా బాగు పడ్డారు . సగం నమ్మిన వారు ఆ మేరకు బాగుపడ్డారు . అసలు నమ్మని వారు బాధపడ్డారు . వారు ముని చెప్పినా పట్టించుకోనందుకు పశ్చాత్తాపం చెందారు.
 నీతిః పిల్లల భవిష్యత్ కోసం పెద్దలు తమ అనుభవంతో చెప్పే మంచి విషయాలు మామూలు మాటలుగా అనిపించినా చేయకుండా సరిగ్గా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

0 comments:

Post a Comment