💐🌷ప్రముఖ రచయిత్రి,
సామాజిక కార్యకర్త
మహా శ్వేతాదేవి గారి జయంతి 🌷💐
✍️సాహిత్యకారుల కుటుంబంలో జన్మించిన మహా శ్వేతాదేవి
సాహిత్యంతో పాటు సామాజిక అంశాలపై పనిచేయడం ప్రారంభించారు. గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. తాను చూసిన జీవితాలను పుస్తకాల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. అక్షరాలతో చైతన్యం తీసుకువచ్చారు. ఆమే మహాశ్వేతాదేవి. చివరివరకు సాహిత్యవనంలో సేదతీరిన మహారచయిత్రి. ఆమె సుప్రసిద్ధ నవలా రచయిత అంతకు మించి సామాజిక కార్యకర్త.
✍️బాల్యం-తొలి జీవితం:
ఆమె 1926 జనవరి14న ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది.ఆమె తండ్రి మనిష్ ఘటక్ కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త. తల్లిదండ్రుల బాటలోనే ఆమె పయనించారు. విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్య్రం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు వచ్చింది. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వ విద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేశారు. ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజన్ భట్టాచార్య ను ఆమె వివాహం చేసుకున్నారు.
✍️ఉద్యోగం:
1964లో కోల్‌కతా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బిజోరుగఢ్ కాలేజిలో ప్రొఫెసర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన సామాజిక అంశాలపై అధ్యయనం చేశారు.
✍️సాహిత్యం:
దేవి 100కి పైగా నవలలు మరియు 20కి పైగా చిన్న కథల సంకలనాలను రాశారు. ప్రాథమికంగా బెంగాలీలో వ్రాయబడింది కానీ తరచుగా ఇతర భాషలకు అనువ దించబడింది.ఝాన్సీ రాణి జీవిత చరిత్ర ఆధారంగా ఆమె మొదటి నవల ఝాన్సీ రాణి 1956లో ప్రచురించబడింది. నవల కోసం స్థానిక ప్రజల నుండి సమాచారం మరియు జానపద పాటలను రికార్డ్ చేయడానికి ఆమె ఝాన్సీ ప్రాంతంలో పర్యటించింది.
✍️మహాశ్వేతా దేవి ప్రత్యేకత ఆదివాసీ, దళిత మరియు అట్టడుగు పౌరుల స్త్రీలపై దృష్టి సారించి వారి అధ్యయనాలలో ఉంది. బ్రిటీష్ వలసవాదం , మహాజనాలు మరియు ఉన్నత తరగతి అవినీతి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా వారు నిరసనకారులుగా సంబంధం కలిగి ఉన్నారు . ఆమె కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గ్రామాల్లో వారితో స్నేహం చేస్తూ, వారి నుంచి నేర్చుకుంటూ ఉండేది. ఆమె వారి పోరాటాలు మరియు త్యాగాలను తన మాటలలో మరియు పాత్రలలో పొందుపరిచింది. తన కథలు తన సృష్టి కాదని, అవి తన దేశ ప్రజల కథలని ఆమె పేర్కొంది. ఆమె రచన " చోట్టి ముండి ఎబాంగ్ టార్ తిర్ " అటువంటి ఉదాహరణ.
✍️బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల్లో చైతన్యం కోసం ఆమె ఉద్యమించారు. ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్నది ఇతివృత్తంగా తీసుకుని ఆమె రాసిన నవల ఎంతో పాఠకాదరణ పొందింది.
✍️సాధించాడన్న విషయంపై ‘ఎతోవా పోరాటం గెలిచాడు’. అనే నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి గారిచే అనువదించబడింది. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలతో రూపొందించారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటిని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు
✍️ఆమె సాహిత్య సంపదలో ఎన్నో ఆణిముత్యాలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. హజార్ చౌరాసిర్ మా, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, డస్ట్ ఆన్ ద రోడ్, అవర్ నాన్‌వెజ్ కౌ, టిటు మిర్, ద్రౌపది, ఓల్డ్ వుమెన్, డకతేరు కహానీ, టిల్ డెత్ డు అజ్ పార్ట్ తదితరాలన్నీ మహాశ్వేతా దేవి సాహిత్య సంపదలోవే. మహాశ్వేతా దేవి రచనల ఆధారంగా బాలీవుడ్‌లో రుడాలి, హజార్ చౌరాసీ కీ మా, మాటీ మారు, గంగోర్ వంటి సినిమాలు కూడా వచ్చాయి.
✍️ప్రధాన రచనలు:
*ఝాన్సీ రాణి (1956, జీవిత చరిత్ర)
*హజర్ చురాషిర్ మా
(1974, నవల, మదర్ ఆఫ్ 1084 )
*అరణ్యర్ అధికార్ (1979, రైట్ టు ది ఫారెస్ట్ )
*అగ్నిగర్భ (1978, చిన్న కథల సంకలనం)
*మూర్తి (1979, చిన్న కథల సంకలనం)
*నీరేతే మేఘ్ (1979, చిన్న కథల సంకలనం)
*స్టాన్యదాయని (1980, చిన్న కథల సంకలనం)
*చోట్టి ముండా ఎబాంగ్ *తార్ తిర్ (1980, చిన్న కథల సంకలనం)
✍️అవార్డులు:
*2006లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
*2004లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం లభించింది.
*1997లో రామన్ మెగ్సేసే అవార్డు స్వీకరించింది.
*1996లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు లభించింది.
90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28న తుది శ్వాస విడిచారు.
🙏🙏🌷🌹🌸🙏🙏
0 comments:
Post a Comment