Thursday, January 13, 2022

కాకి - పాము

 అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో రాజ మందిరం ఉండేది . దానికి కొంచెం చెట్టుపైన కాకి గూడు నిర్మించుకుని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది . కాకి తన పిల్లలకు ఆహరం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టు పైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది . దీంతో కాకి ఏమి చెయ్యాలో తెలియక తెగ బాధపడుతుండేది . ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది . ఉపాయం వచ్చిందే తడువుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణీ గారి నగను తన నోట కరుచుకుని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళ సాగింది . రాజ భటులు ఆ కాకి వెంట పడ్డారు . తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోనికి జార విడిచింది.
 దీంతో రాజభటుటు గునపములు , పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజ భటులపై కోపంతో బుస కొట్టింది . దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపి వేసి ఆ నగను తమతో తీసుకు వెళ్ళి రాణి గారికి అప్పగించారు . ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడయ్యుందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది . 
నీతి - ఉపాయముతో ఎంతటి అపాయమునుండైనా బయట పడవచ్చు.

0 comments:

Post a Comment