A homepage subtitle here And an awesome description here!

Monday, January 30, 2023

మహాత్మా గాంధీజీ వర్థంతి, జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం,

🌷🙏నీ అడుగులు.. ప్రపంచ శాంతికి మార్గాలు.....
గాంధీజీ.. వర్థంతి  సందర్భంగా🙏🌷

【జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి】




 
#మానవులు జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు.

సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా మరంగా ఉంటాయి.
మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే.
కత్తులు, కఠారులు,బాంబులు, తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళలో పోసిన త్యాగశీలి, అమరవీరులు మన బాపూజీ.
ఆయన జగతిలో అందరికీ ఆదర్శప్రాయులు.
అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తి అయినా తలవంచక తప్పదు. హింసకు సరైన సమాధానం అహింస మాత్రమే అని గాంధీజీ నొక్కి వక్కాణించేవారు.
1948 జనవరి 30 భారత జాతికే దుర్దినం.ఆరోజు సాయంకాలం 4 గంటలకు అహింసా సిద్ధాంత ప్రవక్త , మన జాతిపిత, పూజ్య బాపూజీ నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవియై నేలకొరిగారు. స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము.
***     ***    ***

*#మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట..... శ్రీ #మహాత్మా గాంధీ గారు...

#ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

అనేక సందర్భములలో, అనేక ప్రవచనములలో పూజ్య గురుదేవులు భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవితములోని అనేక ఆదర్శప్రాయమైన విషయములు, ఆయన శీల వైభవముల గురించి ప్రవచించిన అనేక విశేషములు, గాంధీ గారి వర్థంతి సందర్భముగా...

గాంధీగారు తన జీవితచరిత్రలో ఒక విషయము వ్రాసుకున్నారు. ఒకసారి ఆయన చెయ్యరాని పొరపాటు చెయ్యడానికి అంగుళము దూరము దాకా వెళ్ళారు. గీత దాటకూడనటువంటి స్థితిలో, ఆయన ఇక కొద్ది క్షణాల్లో గీత దాటుతారు అనగా, వేశ్యా లంపటంలో పడిపోతారు అనగా ఆయనను ఆ లంపటంలో పడకుండా కాపాడినది అమ్మకిచ్చిన మాట, అమ్మ ముఖం. గాంధీ మహాత్ముడు చదువుకోవడానికి  ఓడలో విదేశాలకు  వెళ్ళిపోతున్నప్పుడు  తల్లి పిలిచి పరస్త్రీ సంగమము ఎప్పుడూ చెయ్యనని ప్రమాణము చేయించుకున్నది. అమ్మ చెప్పిన మాట, అమ్మ వద్ద చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకమునకు వచ్చి వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ కారణానికి తరవాత కాలములో మహాత్మ అయ్యి, , జాతిపిత అయ్యి మన అందరి చేత తండ్రి అనిపించుకోగలిగిన వ్యక్తి అయ్యారు. దానికి కారణము ఆయన తల్లి, ఆయనకు తన తల్లికి ఇచ్చిన మాట పట్ల ఉన్న గురి. ధర్మము వైక్లబ్యము నందు వస్తున్నప్పుడు ఎవరు ఆయనని దిద్దారు అంటే, ఆయన తల్లి రూపములో పరమేశ్వరుడే దిద్దాడు అని చెప్పాలి.

మహాత్మాగాంధీ గారు తన జీవిత చరిత్ర అంతటినీ దేని కొరకు వ్రాసారు అనగా - మహాత్ములు తమ జీవితములో వచ్చిన వైక్లబ్యములను దాచకుండా తమ జీవితచరిత్రలో పొందుపరచి, తదనంతరము వచ్చే తరముల వాళ్ళు అటువంటి తప్పు చెయ్యకుండా సమగ్రతను పొందడము కోసము తమ జీవిత చరిత్రలను ఇస్తారు. గాంధీ గారు తన బాల్యములో చేసిన రెండు తప్పులను ఎత్తి చూపించుకున్నారు. ఒకటి దస్తూరి గురించి శ్రద్ధ తీసుకోలేదు ఆ కారణము చేత పెద్దవాడిని అయినాక కూడా నేను వ్రాసినది ఇతరులు చదవడము కష్టము అయ్యేది. నేను దస్తూరి విలువ తెలుసుకునేప్పటికి బాగా చూచివ్రాత వ్రాసి, దస్తూరి అభివృద్ధి చేసుకునే స్థితి దాటిపోవడము జరిగింది. అందుకని జీవితములో దిద్దుకోలేక పోవడము జరిగింది. రెండవది వ్యాయామము పట్ల చాలా చిన్న చూపు ఉండేది. ఈ పరిగెత్తడము, ఆటలాడడము ఎందుకు? అనిపించి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్న భావన పెంచుకోవడము జరిగింది. దాని వలన ఏమి నష్ట పోయానన్నది పెద్దవాడిని అయ్యాక తెలుసుకున్నాను. చిన్నప్పుడు బాగా ఆటలు ఆడి, వ్యాయామము చేసి ఉంటే బహుశా నాకు ఇంతకన్నా శక్తివంతమైన శరీరము ఉండేది. ఎంత పెద్ద చదువు చదువుకున్నా గట్టిగా కి.మి. దూరము నడవలేక, ఎండగా ఉన్న వాతావరణములో తిరగ లేకపోతే , ఒక గంటసేపు మంచినీళ్ళు లేకుండా మాట్లాడలేకపోతే, మాట్లాడలేక శరీరము సహకరించకపోతే ఎంత పెద్ద చదువు చదువుకున్న వారైనా చెయ్యవలసిన పని నియంత్రింప బడుతుంది. అందరూ చేసే పని చెయ్యలేరు. చెయ్యవలసిన కార్యక్రమములకు శరీరమును సిద్ధముగా ఉంచుకోవాలి. దానికి రెండు ప్రధానమైన లక్షణములు చిన్నతనము నుంచి అలవాటు చేసుకోవాలి.

మహాత్మాగాంధీ గారు 1942లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సుకి లండన్  వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయ్ కూతురు ఆయనని చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి గాంధీజీ ఒంటి మీద పంచె తప్ప (గాంధీజీ కేవలం పంచె మాత్రమే కట్టుకునే వారు) ఏమీ లేకపోవడం చూసి "తాతగారూ! మీకు పైన వస్త్రం లేదు (అక్కడ ఆ సమయంలో విపరీతమైన చలి కూడా). మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి" అంది. ఆ అమ్మాయి మాటలకి గాంధీజీ నవ్వి, "భారతదేశంలో పంచె మాత్రమే కట్టుకుని, వేసుకోవటానికి బట్టలు లేకుండా ఉండిపోయిన కొన్ని కోట్లమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ. వారందరూ పైన బట్టలు వేసుకోగలిగినరోజున గాంధీ కూడా వేసుకుంటాడు. వాళ్ళందరికీ కూడా స్వెట్టర్లిస్తే నాకూ ఇయ్యమ్మా!" అన్నారు.ఈ మాటలు విని ఆ పిల్ల తెల్లబోయింది. ఆయన ఎంతటి మహానుభావుడో చూడండి.

గాంధీగారు ఎప్పుడూ విలువలతో జీవించిన వ్యక్తి. గాంధీగారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇల్లు అద్దెకు తీసుకునేందుకు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరు అని అడిగేవారు. "To which country do you belong?" అని అడిగేవారు.  "I am an Indian" అంటే "We don't give room for you" అనేవారు. "ఎందుకివ్వరు?" అని ఆయన ఎంతో క్లేశపడి అడిగితే కారణం చెప్పేవారు కాదు. ఆఖరుకి ఆయన కష్టపడి ఒక రూమ్ సంపాదించుకున్నారు. తర్వాత Indian అంటే ఎందుకు అద్దెకి ఇవ్వడం లేదు అని ఆరాతీశారు. "Indiansకి శుభ్రత ఉండదు. వాళ్ళు ఇంట్లో వస్తువులు సక్రమంగా పెట్టుకోరు, వాళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. అందుకని వాళ్లకి ఇల్లు ఇవ్వం" అన్నారు. గాంధీగారు చాలా బాధ పడ్డారు. అయ్యో నాదేశం గురించి, నా దేశవాసుల గురించి ఇలా చెప్పుకుంటున్నారు అన్నమాట. మార్పు రావాలి.  Indian అంటే పది రూపాయలు తక్కువైనా సరే మీకు ఇల్లు ఇస్తాం అనే రోజు రావాలి అని దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు. "ఈ అగౌరవం మనకు కలగకూడదు. మనం పరిశుభ్రంగా ఉందాం. మనం ఎక్కడ ఉంటామో అక్కడ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇవ్వాల్టి నుంచి మనం ఏయే ప్రాంతాలలో నివాసం ఉంటున్నామో ఆ ప్రాంతాలన్నీ, ఎవరిమీద ఆధారపడకుండా మనమే శుభ్రం చేసేసుకుందాం. మనవల్ల దేశానికి గౌరవం కలగాలి" అని కోరుకొని అందరినీ ప్రోత్సహించి అందరిలోనూ పరిశుభ్రత మీద ఉత్తేజం తీసుకువచ్చి దక్షిణాఫ్రికాలో ఇల్లు ఇవ్వను అన్నటువంటి వాళ్ళచేతనే భారతీయుడు అంటే చాలు ఇల్లు ఇచ్చేటట్లుగా చేశారు. భారతీయులలో పరిశుభ్రత గురించి అంత ఉద్యమం తీసుకువచ్చారు. అలాగే గాంధీగారు ఒకప్పుడు ఒక బ్రిటీష్ వైస్రాయ్ ఇంటికి అతిథిగా వెళితే ఆయనను "మీకు ఏది కావాలని అడిగితే ఏమడుగుతారు? " అని ఆ వైస్రాయ్ అడిగారు. అక్కడి విలేఖరులు అందరూ ఆయన స్వాతంత్ర్యము కావాలని అడుగుతారని అనుకున్నారు. కాని, ఆయన "దేశమంతటా స్వఛ్ఛత నిలబడాలని కోరుకుంటాను. ఈ పారిశుద్ధ్య పనివారు కూడా సంతోషముగా బ్రతికే రోజు రావాలని కోరుకుంటాను. వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతాను" అన్నారు. మిమ్మల్ని ఇంకొకటి కూడా కోరుకోమంటే అని అడిగితే "ఆ పారిశుద్ధ్య పనివారికి సేవ చేసే అవకాశమిమ్మని అడుగుతాను" అన్నారు గాంధీ గారు. అంటే అంతర్లీనమైన సిధ్ధాంతముల చేత బ్రతికిన దేశం ఈ దేశం. ఒక ఫలితాన్ని సాధించటం కాదు, ఏ మార్గంలో సాధించాము అన్నదానివల్ల గొప్ప. ఏది ఏమైపోనీ...కష్టమే రానీ...సుఖమే రానీ, జీవితానికి విలువలు ప్రధానము.

నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 'మహాత్మ ' అని పిలిపించుకోవడానికి  పరమ అర్హుడైన మహాపురుషుడు గాంధీజీ ఒక్కరే. ఎందుకని ఆయన 'మహాత్మగాంధి' అని పిలిపించుకోవడానికి అర్హుడు? ఎదురుగుండా నిలబడి తుపాకీ గురిపెట్టి గాంధీజీ మీదకి తుపాకీగుళ్ళ వర్షం కురిపిస్తోంటే, ఒక్కొక్క గుండు వచ్చి గుండెల్లో తగులుతోంటే, రక్తం బయటకి చిమ్మెస్తుంటే, ఆయన బుర్రలో ఎన్ని  వ్యాపకాలుండాలి నిజంగా? ఒక చిన్న కుటుంబం ఉన్న మనమే 'అబ్బో ఎన్ని వ్యాపకాలో, ఏదండీ టైము కుదరట్లేదు ' అంటాము. అంతటి మహానుభావుడు, దేశాన్ని ఒక త్రాటిమీద నడిపించిన వాడు అయిన గాంధీజి గుండెల్లో గురి పెట్టి కాలుస్తుంటే ఆయన నోటివెంట వచ్చిన మాట 'హేరాం'. హేరాం, హేరాం, హేరాం అంటూ ఆయన పడిపోయారు. అలా అనాలి అంటే లోపల సంస్కారం ఎంత గట్టిదో చూడండి. అందుకే మహాత్మాగాంధీగారు మరణించారు అని రేడియోలో చెప్తే, రమణమహర్షి అంతటివారు కన్నులనీరు పెట్టుకుని, 'ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు' అన్నారు. దేహమునందు అభిమానమును పొగొట్టుకునే స్థితికి కొందరే వెళ్ళగలరు, అది అందరికీ రాదు.
🙏

Thursday, January 26, 2023

స్వాతంత్య్రోద్యమ కేసరి" లాలాలజపతిరాయ్ గారి జయంతి సందర్భంగా🌹

🌹"స్వాతంత్య్రోద్యమ కేసరి" లాలాలజపతిరాయ్ గారి జయంతి
 సందర్భంగా🌹




(భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య......
లాలాలజపతిరాయ్)

#లాలాలజపతిరాయ్ ,రాజకీయ నాయకుడు,గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య #సమరయోధుడు. లజపతిరాయ్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక పోరాటాలు చేశాడు.అతివాదులుగా పేరుపొందిన (లాల్ )లాలా లలా లజపతిరాయ్ ,(బాల్ ) బాలగంగాధర తిలక్ , (పాల్ ) బిపిన చంద్రపాల్ త్రయం అంటే ,ముగ్గురు.ఈ ముగ్గరిలో లాలా లజపతి రాయ్ ఒకరు. ఈయనకు పంజాబ్ #కేసరి అనే బిరుదుకూడావుంది.కేసరి అంటే  సింహం అని అర్థం.

#అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి.

*##లాలా లజపతిరాయ్ 'పంజాబ్ నేషనల్ బ్యాంకుని స్థాపించారు.ఈనాడు ప్రముఖ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకి ఒకటి.##*

#బాల్యం-తొలి జీవితం:

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చిన లాలా లజపతిరాయ్ 1865 జనవరి 28 న పంజాబ్ రాష్ట్రంలో జాగ్రన్ పట్టణంలో జన్మించారు. అయన తండ్రి లాల్ రాధాకిషన్ ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ, పర్షియన్ భాషల పండితులుగా పనిచేశారు. ఈయన తన కుమారుడు లాలాలజపతిరాయ్ కి చిన్నప్పటి నుండి న్యాయవాద వృత్తిపై ఆసక్తి కలిగేలా చేశారు. తండ్రిలోని ధైర్య, స్టైర్య, వైజ్ఞానికాలు, తల్లిలోని సర్వ సమానత్వం, దీన జనోద్దరణ వంటి లక్షణాలు పుణికి పుచ్చుకుని ప్రజల హృదయాలను చూరగోనె లక్షణం అయన ఆదర్శ నాయకుడు అవడానికి ఎంతో దోహద పడ్డాయి. లాలాలజపతిరాయ్ జగ్రాన్, లూథియానా, అంబాలా, లాహోర్ లలో విద్యాభ్యాసం సాగింది. 1885లో లా పరీక్షలో విజయం సాధించి, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 20 ఏళ్ల వయస్సులోనే న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు.

#లోక్ సేవక్ సంఘ్.....

 పంజాబ్ లోని యువతలో దేశ స్వాతంత్రోద్యమం పట్ల పెద్దగా ఉత్సాహం, ఆసక్తి లేకపోవడాన్ని గమనించిన లాలాలజుపతిరాయ్ వారిలోని నిరాశను తొలగించి వారిని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేయడానికి కృషి చేశారు. అంతేకాక అటువంటి వారికి ఆర్థిక సహాయం అందజేయడం కొరకు లోక్ సేవక్ సంఘ్ అనే సంస్థను ప్రారంభించారు.

#స్వాతంత్ర్య ఉద్యమంలో...

మొదటి ప్రపంచ యుద్దం సమయంలో అమెరికాకు వెళ్లి 1919 సంవత్సరం వరకు అక్కడ ఉన్న లాలాజీ అక్కడి వారి నుండి కూడా ఆదరాభిమానాలు అందుకున్నారు. భారతదేశ ప్రజలు ఆయనను ఎంతగా గౌరవిస్తారో, అంతగా అక్కడి వారూ ఆయనను అభిమానించారు. సహాయ నిరాకరణోద్యమం, 1920లో కాంగ్రెస్ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. సహాయ నిరాకరనొద్యమం సమయంలో 1921- 23 మధ్య రాయ్ జైలు జీవితం గడపవలసి వచ్చింది.  దయానంద సరస్వతి ఆర్య సమాజోద్యమం అనే దానిని ప్రారంభినప్పుడు అయన పిలుపును అందుకుని రాయ్ కూడా ఆ ఉద్యమంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేసారు. 

1897 #ఉత్తరభారత దేశంలో భయంకరమైన కరువు వచ్చిన సమయంలో.....

1897 ఉత్తర భారత దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. పంట చేలు, నూతులు, చెరువులు ఎండి పోయాయి. కరువు తాకిడికి వేలాది సంఖ్యలో పశువులు మరణించాయి. తిండిలేక ప్రజలు అల్లాడి పోయారు. కొందరు ప్రజలు రహదారుల వెంట వెళుతూ మరణించారు. ఆ సమయంలో లాలాలజుపతిరాయ్ మెడకు జోలే తగిలించుకుని కరువు బాధితులకు సహాయం చేయడం కోసం విరాళాలు సేకరించి వారికి సహయపడ్డారు. రాయ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అనేక ఉద్యమాలు నిర్వహించి ఆంగ్లేయులకు పక్కలో బల్లెంలా మారారు. ఆయన పంజాబ్ కేసరి అనే బిరుదును పొందారు.

#రచయితగా కూడా.....

లాలా లజుపతి రాయ్ కి రచయితగా కూడా మంచి పేరుంది. తన నవలలు ది స్టోరీ ఆఫ్ మై దిపోర్షన్ (1908 ), ఆర్య సమాజ్ (1915), ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎ హిందూస్ ఇంప్రెషన్ (1916), అన్ హ్యాపీ ఆఫ్ ఇండియా వంటి అనేక రచనలు చక్కని భావజాలంయో సాహితీ విలులతో కూడినవై అందరి ప్రశంసలు అందుకున్నారు. 
తన అభిమాన హీరోలు జోసెఫ్‌ #మ్యాజినీ, #గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్‌ రాశారు.*
ది పీపుల్ అనే పత్రిక నిర్వహించారు. 

#యంగ్ ఇండియా పత్రిక....
 
వీరు యంగ్ ఇండియా పత్రికను నిర్వహించి గ్రంథ రచన చేశారు. 1920లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు అద్యక్షులు అయ్యారు.
జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసి అనేక మంది యువకులు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనేలా వారిని ఉత్తేజపరచారు.

#బెంగాల్‌ విభజనోద్యమం:

బెంగాల్‌ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్‌ నుంచి అరవింద్‌ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్‌ తిలక్, పంజాబ్‌ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్‌ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్‌ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్‌ చదువుకున్నారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్‌ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్‌ పేట్రియాట్స్‌ అసోసియేషన్‌ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్‌ సింగ్‌. ఈయన భగత్‌సింగ్‌ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్‌ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే.

#సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా....

 పరిచిన లాలా లజుపతి సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దేశ వ్యాప్తంగా సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా పలు సంఘర్షణలు జరిగాయి. లాలా లజుపతి రాయ్ అధ్వర్యంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన జరుగుతున్న సమయంలో పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ జరిపారు. ఆ సమయంలో లజుపతి రాయ్ పై కూడా తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేశారు. రాయ్ తలపై, ఛాతిపై తీవ్రంగా గాయాలు కావడంతో లాలాజీ అనారోగ్యం పాలయ్యారు. ఆ లాఠీ ఛార్జ్ ల గాయాల తీవ్రత కారణంగానే 17 నవంబర్ 1928 న అయన తన తుది శ్వాస విడిచారు.

చనిపోతూ  లజపతి రాయ్
#ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’

ఇందుకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్‌ పి. సాండర్స్‌ అనే మరొక అధికారిని కాల్చి చంపారు.
#లజపతిరాయ్‌  ప్రధానంగా గొప్ప మానవతావాది.   
🙏

Thursday, January 19, 2023

ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన గారి జయంతి

🙏💐ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట..... కాలాతీత కవి... ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన గారి  జయంతి సందర్భంగా...💐🙏

【"కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ"- శ్రీశ్రీ.】




#సమాజంలోని మూఢనమ్మకాలను ఎత్తి చూపి నిజాన్ని మన ముందు ప్రతిబింబించిన హేతువాది, సామాజిక విప్లవకారుడు యోగి వేమన. పండిత లోకానికే పరిమితమైన వేదాంతాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన పదాలతో స్వచ్ఛమైన అచ్చమైన తేనె లాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన.వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త.

#ఆయన యోగమంతా అన్వేషణ, ఆ అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికందిచాడా మహానుభావుడు. ఆయన సూక్తి ఆయన అంతర్యక్తికి అద్దంపట్టిన అభివ్యక్తి ఆయన అంతస్సాధన ఆయనకు ముక్తినిచ్చిందో లేదో కానీ, సూక్తిలోని శక్తి మాత్రం జాతికొకనూత్న వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది' అంటారు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం. వేమన సాధకుడు. సాధనకు భక్తి-విశ్వాసం బలం. కానీ వేమన భక్తి కన్నా వివేకాన్ని నమ్ముకున్నాడు.

 "విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. 

*#మహాకవి యోగి వేమనకు  సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర  ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా   జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను  విడుదల చేసింది.*

వేమన సుమారు (జననం19/1/1632)
1632 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.

#ఇప్పటికీ పండిత, పామర భేదం లేకుండా వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన పద్యాలు జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయాయి. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే. మన వేమన...మంచి కోసం,మార్పు కోసం, మన కోసం ప్రశ్నించి, ప్రతిస్పందించి, ప్రతిధ్వనించాడు. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు.

*#పద్య లక్షణము:*

వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం.

*#విశిష్టత:*

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు.

*మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయనవాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం.*

*#నాడే సాహసోపేత హేతువాది...*

ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా  ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. 

*#పద్య మకుటంపై వాదనలు:*

"విశ్వదాభిరామ వినురవేమ" మకుటానికి భిన్న వాదనలున్నాయి. అవి:

*వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
*విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
*విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభి రాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు,అనే వాదన కూడా ఉంది.

బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

*#వేమన గురించి పరిశోధన:*

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

#వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినవాడు వేమన. వేమనను ప్రజాకవి అంటారు. ఆయన సమాజంలో ఉండే మంచిమంచి విషయాలను గ్రహించి, వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్నచిన్న పదాలతో శతకం రాశాడు. వేమన్న ఆశుకవి. 

తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి కృషి చేశాడు.

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్. గోపి పరిశోధనలు చేశారు. 

*#వేమనకు గుర్తింపు:*

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు. అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

#కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.

*#మహాకవి యోగి వేమన నిజంగానే బట్టలు లేకుండా ఉండేవారా?:*

వేమన గురించి అధ్యాయనం చేసిన సిపి బ్రౌన్ , ఆరుద్ర వంటి మహాకవులు వేమన ఓ దిగంబ‌రుడ‌ని ఎక్కడ పేర్కొన‌లేదు. 1920 ప్రాంతంలో తంజావూర్ లోని స‌ర‌స్వతి మ‌హ‌ల్ లో ఉన్న చిత్రాన్ని ఆధారంగా రెడ్డివాణి ప‌త్రిక‌లో వేమ‌న దిగంబ‌ర బొమ్మ ప్రచురింపబడింది. అయితే వేమన దిగంబరుడు అనే విషయంపై క్లాారిటీ లేదు.

*#స్మరణలు:*

శిలా విగ్రహాలు
హైదరాబాదులో టాంకుబండ్ పై తెలుగుజాతి వెలుగుల విగ్రహాలలో వేమన విగ్రహం ప్రతిష్ఠించారు.

*#మహాకవి పేరిట విశ్వవిద్యాలయం....*

ఆ మహాకవి పేరిట  డాక్టర్‌ వైఎస్ఆర్ కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం.

*#పోస్టు స్టాంపు:*

పోస్టు స్టాంపుపై వేమన
1972 లో భారత తపాలాశాఖ స్టంపు విడుదల చేసింది.

*#పుస్తకాలు:*

 వేమన పద్యాలను వివిధ ప్రచురణ కర్తలు ముద్రించారు. విస్తృతంగా పరిశోధనల పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో కొన్ని.....
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ (1929). వేమన.
వేమన యోగి - వర్ణ వ్యవస్థ : డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2002
వేమన యోగి - అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము :డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2000,
మన వేమన, ఆరుద్ర, 1985.
వేమన జ్ఞానమార్గ: 1958 నాటికి అత్యధికంగా 3002 పద్యముల సంకలనం అక్షరమాలక్రమంలో కూర్పు, కూర్పు: ముత్యాల నారసింహ యోగి, ప్రకాశకులు: సి.వి.కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1958.
దృశ్యశ్రవణ మాధ్యమాలు
యోగివేమన (1947 సినిమా) చిత్తూరు నాగయ్య-వేమన
శ్రీ వేమన చరిత్ర (1986) - సినిమా విజయ చందర్-వేమన
యోగివేమన - ధారావాహిక, నిర్మాత: గుమ్మడి గోపాలకృష్ణ- టివిలో ప్రసారమైంది.

చివరకు  వైఎస్ఆర్ జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్ద మహాసమాధి చెందారు.

#వేమనది వితండవాదం కాదు. మానవతావాదం. మనిషే దైవం మనిషిని సేవించడమే దైవదర్శనం అన్నాడాయన. ఆరుద్ర తన 'వేమన్న వేదం' లో చెప్పిన వ్యాఖ్యానం గమనించదగ్గది. 'శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గంథకోటిఖి:/పరోపకర; పుణ్యాయ పాపయ పరపీడనం 'కోటి గ్రంథాల్లో చెప్పిన దాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్తాను. పరులకు ఉపకారం చేయ్యడమే పుణ్యం. పరపీడనమే పాపం అనే శ్లోకార్ధం వేమన జీవిత సందేశం. వేమన భాష స్వచ్ఛమైనది. వాడిగలది. శైలి సరళం సాటిలేనిది. ఆయన ఉపమలు, పోలికలు సహజంగా సరికొత్తగా, గంభీరంగా, వియత్తలాన్నంతా వెలిగించే మెరు తీగల్లాగా ఉంటాయి. కొన్ని విషయాలను గూర్చి ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు నాటి కాలానికే కాదు... ఆధునిక కాలానికి కూడా వర్తించేటట్లుగా ఉంటాయి. 'తెలుగు ప్రజలు వేమన కవిత్వాన్ని అధికంగా అభిమానిస్తారన్న డా. పోప్‌ వ్యాఖ్యానం అక్షరసత్యం. తెలుగు భాష వేమనకు రుణపడి ఉంది.


Wednesday, January 4, 2023

సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త సర్ ఐజాక్ న్యూటన్ జయంతి

💐💐సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త  సర్ ఐజాక్ న్యూటన్ జయంతి సందర్భంగా...💐💐






【##వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!!!##】

#విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.మూడు వందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు మాధమేటిక్ , ఫిజిక్స్ విభాగాలకు #ఆద్యుడు న్యూటన్. ఆప్లిక్స్ కాలుక్యులస్ ఆయన సృష్టించినవే ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీపడడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్. న్యూటన్ పేరు తెలియకుండా పాటశాల విద్య ముగియదు. సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయన్న న్యూటన్ సూత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసినపుడల్లా గుర్తుకు వచ్చి తీరుతుంది. న్యూటన్ ఒక అపూర్వ మేధావి. మాధమేటిక్స్ ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, మత శాస్త్రాలన్నింటిని అధ్యయనం చేసిన వాడు. 17వ శతాబ్దపు విజ్ఞాన విప్లవంలో కీలక పాత్ర పోషించారు సర్ ఐజాక్ న్యూటన్.

#మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. 

#ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను "సైన్సు పితామహుడు"గా కీర్తించింది. 

#బాల్యం:

జనవరి 4, 1643వ సంవత్సరంలో నెలలు నిండకుండానే జన్మించాడు ఓ చిన్నారి. ఆ చిన్నారే పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారే సర్ ఐజాక్ న్యూటన్. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలం జన్మించాడు. తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.

న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో #చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

#ఉన్నత విద్య-గురుత్వాకర్షణ సిద్ధాంతం:

1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై #గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, ఉన్నత విద్య నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ "ప్రిన్సిపియా మేథమేటికా" అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా "దృశాశాస్త్రం" పుట్టింది.

#మూడు గమన నియమాలు:

#ఐజాక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు, మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు. 
అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉందే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజక్ న్యూటన్ అన్న మనిషి ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

#మొదటి సూత్రము:

"బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది". ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.

#రెండవ సూత్రము: 

"ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
ప్రచోదనం 
ఒక ప్రచోదనం j, ఒక బలం f, ఒక సమయం Δt లో ఒక వస్తువుపై పనిచేస్తే కలుగుతుంది

#న్యూటన్ మూడవ నియమం:

ఇది అసలైనది
న్యూటన్ సూత్రాన్ని దృష్టాంతం చేయడానికి ఇద్దరు స్కేటర్లు వ్యతిరేఖ దశలో ఒకరిని ఒకరు గెంటుకొనుచున్నారు.ఎడమవైపు మొదటి స్కేటర్ 12 కుడి వైపు దిక్కునకు, మరియు రెండవ స్కేటర్ N21 ఎడమ వైపు దిక్కునకు బలాన్ని ప్రయోగిస్తున్నారు.ఇద్దరి బలాలు సమానం కానీ న్యూటన్స్ మూడవ సూత్రం ప్రకారం వ్యతిరేఖ దశలో ప్రయోగించబడ్డాయి.
అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది.
చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.
F (A) =-F (B)
(-గుర్తు వ్యతిరేకతను సూచిస్తుంది)
ఉదాహరణ: రాకెట్

#ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం "సర్‌" అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు.

 ఆ తరువాత కూడా ఎన్నో #మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్లిపోయారు

 ##వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!!!##

వాషింగ్టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం
ఆ కథనం ప్రకారం.. గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించిన ఐజాక్ న్యూటన్ ఇరవయ్యో పడిలో ఉన్నప్పుడు లండన్‌ను గ్రేట్ ప్లేగ్ అనే వ్యాధి కుదిపేసిందట. అప్పుడు న్యూటన్ ట్రినిటీ కాలేజీలో చదువుకుంటున్నారు. కాగా.. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం మనం చూస్తున్న జాగ్రత్తలే అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాలేజీలు సెలవులు ప్రకటించాయి. న్యూటన్ చదువుకుంటున్న ట్రినిటీ కాలేజీ కూడా విద్యార్థులను ఇంటికి పంపించింది. అలా ఇంటికే పరిమితమైన న్యూటన్.. క్యాలిక్యులస్ వంటి కొత్త గణిత విధానాలకు రూపకల్పన చేశారట. అంతే కాదు... గురుత్వాకర్షణ సిద్ధాంతానికి కూడా అప్పుడే బీజం పడిందట. సో అదండీ.. వర్క్ ఫ్రమ్ హోంకు ఆసక్తికర నేపథ్యo.

అంధుల అక్షరశిల్పి...... లూయి బ్రెయిలీ జయంతి

🌷💐అంధుల అక్షరశిల్పి...... లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా💐🌷





      (ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం)

#అమావాస్య చీకట్లో అంధకార #జీవితాన్ని గడుపుతున్న   అంధుల పాలిట పున్నమి #వెన్నెలల వెలుగు ప్రదాత........ అతను పట్టుదలకు మారుపేరు. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వన్నెలద్దినవాడు. వైకల్యాన్ని జయించి .. అనుకున్న పనిని సాధించిన మహనీయుడు... ఆయనే అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ.
అంధులకు ఆపద్భాంధవుడు లూయీ బ్రెయిలీ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

#బ్రెయిలీ దినోత్సం:

జనవరి 4 1809లో లూయీ బ్రెయిలీ జన్మించారు. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ పుట్టిన రోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సంగా రూపొందింది. అంధుల కళ్లల్లోను..జీవితాల్లోను  వెలుగులు నింపిన మహనీయుడు లూయీ బ్రెయిలీ. చీకటిని జయించిన తిమిర వీరుడు..లూయీ బ్రెయిలీ.

#బాల్యం-విద్య:

లూయీ బ్రెయిలీ పారిస్‌లోని క్రూవే గ్రామంలో 1809 జనవరి 4న తల్లిదండ్రులు మోనిక్‌ బ్రెయిలీ,సైమన్‌ రెనె బ్రెయిలీ లకు జన్మించారు.

మనిషికి ముఖ్యమైనవి కళ్ళు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలన్నారు. జ్ఞానానికి నిజమైన వాకిళ్ళు కళ్ళు. లూయీ బ్రెయిలీ అందరిలాగే పుట్టాడు. మూడేళ్ళ వరకూ బాగానే ఉన్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారు చేస్తున్న దగ్గరకెళ్ళి ఆడు కుంటుండేవాడు.కత్తి మొన కన్నుకి తగిలింది. అలా ఒక కన్ను పోయింది. తర్వాత రెండవ కన్ను కూడా పోయింది.

బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. లూయీ కి మంచి ధారణ, గ్రహణశక్తి ఉండటం వల్ల పాఠశాల్లో ఉపాధ్యాయుల మన్ననల్ని పొందేవాడు. పదవ ఏట పారిస్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లెండ్‌ లో స్కాలర్‌షిప్పుకి ఎంపికయ్యాడు.

#ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు....

బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించారు. ఆనాడు అమలులో ఉన్న ”లైన్‌ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు.

#అంధుల లిపిని రూపొందించడానికి అనేకమంది అంధులు కృషి.....

అంధులకు చదువు చెప్పాలంటే వారికి ప్రత్యేకమైన పుస్తకాలు కావాలి. వారికి ప్రింటింగు పద్ధతిని కాకుండా ఎత్తుగా, ఉబ్బినట్లుగా ఉండినట్లుగా ఉండే అక్షరాల అవసరం ఉంది. స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బిగా వుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు. 
అంధులకు చదువుకోవాలంటే పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువగా కృషి చేసింది అంధులే. ఎందుకంటే అంధుల కష్టం అంధులకే తెలుస్తుంది. ఎన్నో ప్రయోగాలు అనంతరం చాలాకాలానికి  అంధుల లిపిని రూపొందించడానికి అనేకమంది అంధులు కృషి చేశారు. వారు చెక్కబోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నించారు. అయితే మొట్టమొదటి సారిగా పారదస్‌ అనే అంధుడు..అతని స్నేహితుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందించారు. 

#అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూయీ బ్రెయిలీ కనిపెట్టాడు.......

1784లో ఇది కనుగొన్న ఘనత లూయి బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతోమంది దీన్ని పరిశోధన చేశారు. అయితే అవి అంధులు చదువు నేర్చుకొనడానికి అంత సులభంగా వుండేవికావు.
తేలికైన పద్ధతిలో ఆరు అక్షరాల్లో అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూయీ బ్రెయిలీ కనిపెట్టాడు.ఆధునిక యుగంలో అంధుల పుస్తకాలన్నీ బ్రెయిల్‌ పద్ధతిలో ఉండటం ఎంతో గర్వకారణం. దీనిని కనుగొన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పులను సాధించి అంధుల పాలిట అక్షర శిల్పి అయ్యారు.

#ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించడం....

అంధులు సులువుగా చదువుకోవడం కోసం ఏదైనా చేయాలని పరితపించారు బ్రెయిలీ. పగలు ప్రెఫెసర్ గా పనిచేస్తూ..రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషిచేశాడు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కులుగా ఉండాలని లూయీ భావించాడు. 1821లో చార్లెస్‌ బార్బియర్‌ అనే సైనిక అధికారి చీకట్లోనూ తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 చుక్కల సంకేత లిపిని తయారుచేసాడని తెలుసుకున్న లూయిస్‌ 12 చుక్కలను ఆరు చుక్కలకు కుదించి అవసరమైన రీతిలో అక్షరాలను, పదాలను, సంగీత గుర్తులను చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించాడు. 

#పుస్తకాలు ప్రచురణ:

ఈయన కృషిలో భాగంగా లెక్కల్ని అభ్యసించడానికి, సంగీతాన్ని నేర్చుకోవడానికీ ఈ లిపి ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. 1829 లో ‘మెథడ్‌ ఆఫ్‌ రైటింగ్‌, మ్యూజిక్‌ అండ్‌ ప్లైన్‌ సాంగ్స్‌ బై మీన్స్‌ ఆఫ్‌ డాట్స్‌ ఫర్‌ యూస్‌బె ది బ్లెండ్‌ అండ్‌ ఎరేంజ్‌డ్‌ ఫర్‌ దెమ్‌’ అనే పుస్తకాన్ని లూయీ బ్రెయిలీ ప్రచురించాడు. 1839లో డాట్స్‌తో ముద్రణ చేసే విధానం గురించి కూడా పుస్తకాల్ని ప్రచురించాడు.

ఇలా ఈ నిరంతరంగా శ్రమించారు. దీంతో క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. 
#అంధులంతా ఆయనకు స్మరించుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన అంధులందరీకీ వెలుగు ప్రదాత కావడమే.లూయీ బ్రెయిలీ మరణించినా..అంధుల అక్షరాలలో జీవించే ఉన్నారు. వారి ప్రతిభా పాటవాలలో లూయీ బ్రెయిలీ #చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. భాష ఏదైనా..దేశం ఏదైనా  ప్రపంచంలోని అంధులకు ఆయనే 
‘#అక్షర శిల్పి.
🙏💐🌷🌺🌹💐🙏

Tuesday, January 3, 2023

🇮🇳నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా🇮🇳💐

💐🇮🇳నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా🇮🇳💐






(జాతీయ యువజన  దినోత్సవం)

##"ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం"-స్వామి వివేకానంద.##

#స్వామి వివేకానంద  జీవితములోని ప్రతిరోజూ లోకహితమే లక్ష్యంగా ఆర్తితో గడిపారు. స్వామీజీ ఉపన్యాస తరంగిణుల సందేశం ఖండాంతరాలలో మారుమ్రోగింది. ఆధునిక యువతరం వారి సందేశాలను అర్థం చేసుకొని ఆచరించితే భారతదేశంలో, ప్రపంచంలోకూడా స్వర్ణయుగం స్థాపించినవారవుతారు.

#నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియశిష్యులు, వేదాంత, తత్త్వ శాస్త్రములతో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఆధ్యాత్మిక నాయకుడు.

నీ #ధర్మం ఏదైనా కావచ్చు. కాని దాని పట్ల సత్యవర్తనతో మెలుగు’ అని బోధించినవాడు వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింప చేయడంలో ఆయన దాదాపు ఒక ప్రవక్త వలే కృషి చేశాడు. ముఖ్యంగా యువశక్తిని చైతన్యపరచాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఆలోచన అవసరమన్నాడు. సంకుచితాల సరిహద్దులను, క్రతువులను నిరసించాడు.

తన #ఉపన్యాసాల ద్వారా భారతదేశాన్ని జాగృతము చేయటమే కాకుండా, పాశ్చాత్య దేశాలలో కూడా హిందూ మత గొప్పతనాన్ని గురించి ఉపన్యాసాలు చేసారు. "హిందూత్వం అంటే మతం కాదని అది జీవన విధానం అని చెప్పిన జ్ఞాని శ్రీ వివేకానంద.

#బాల్యం-తొలి జీవితం:

స్వామివివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచి ధైర్యసాహసాలు ఎక్కువ. ఒకసారి చెట్టుమీద దెయ్యముందని కిందకు దిగాలని, లేకపోతే దెయ్యం తినేస్తుందని చెబితే గట్టిగా నవ్వాడు. దెయ్యం ఉంటే ఎప్పుడు నన్ను తినేసేది కదా అని బదులిచ్చాడు. కాలేజీలో చదువుతుండగా తండ్రి మరణించారు. దీంతో ఆధ్యాత్మిక చింతన అధికం కావడంతో రామకృష్ణ పరమహంసను కలుసుకున్నాడు. అనతికాలంలోనే రామకృష్ణుడి ప్రియు శిష్యుడయ్యాడు. ఈ క్రమంలో 1886లో గురువు పరమహంస నిర్యాణం చెందారు. వివేకానందుడు గురువు ప్రభావంతో ప్రసంగాలిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

#చికాగో పర్యటన:

వివేకానందుడి జీవితంలో చికాగో పర్యటన ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. 1893 సెప్టెంబర్ 11న అమెరికా, చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడేముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకుని ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు మూడు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారు.

#మరుసటి రోజు పత్రికలన్నీ వివేకానందుడి ప్రతిభను గొప్పగా కీర్తించాయి.హైందవ ధర్మాన్ని సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను హిందు మతాన్ని ప్రపంచ మత మహాసభలలో అవిష్కరించాడు. దీనితో అంతర్జాతీయ స్థాయి లో వివేకానందుడికి గుర్తింపు లభించింది.

#జనం తండోప తండాలు వచ్చేవారు....

#వివేకానందుడి చేసిన కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడకు వెళ్ళినా అక్కడకు జనం తండోప తండాలు వచ్చేవారు. ఆయన కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

#ఎంతో మందికి ఆదర్శంగా....

##సుభాష్ చంద్రబోస్, అరబిందో, మహాత్మా గాంధీ, రాజగోపాల చారి, అరవింద ఘోష్ లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు స్వామి వివేకానంద.రవీంద్రనాథ్ టాగూర్ మాటల్లో చెప్పాలంటే భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని అధ్యయనం చేయాలి.##

#హైదరాబాద్‌తో విడదీయరాని బంధం:

దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం. వివేకానంద పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం. కానీ అంతకుముందే సికింద్రాబాద్‌ మెహబూబియా కళాశాల వేదికగా 1893, ఫిబ్రవరి 13న ప్రసంగమే ఆయన తొలి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.

#రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటు:

నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ భారతదేశానికి తిరిగివచ్చారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.1897లో మే 1న రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటు చేసి బేళూరులో తొలి మఠాన్ని ప్రారంభించారు. దేశవిదేశాలలో ప్రస్తుతం 205 కేంద్రాలకు వాటి సంఖ్య పెరిగింది.అయితే విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అతిపిన్న వయసులో కేవలం 39 ఏళ్లకే (1902 జూలై 4న) వివేకానందుడు కాలం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎంతోమంది ఆయన సూక్తులు, ప్రభావితం చేసే వ్యాఖ్యలతో స్ఫూర్తి పొంది నేటికి తమ లక్ష్యాలను నేరవేర్చుకుంటున్నారు.

#జాతీయ యువజన దినోత్సవం:

భారత ప్రభుత్వం వివేకానందుడి సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’ గా 1984లో ప్రకటించింది.
జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.



Monday, January 2, 2023

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలె జయంతి*🌹

🌹 *మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలె జయంతి*🌹





🌺 *జనవరి 3వ తేది*🌺
 
ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతీరావు ఫూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా "నా విధిని నేను నిర్వహిస్తున్నాను" అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది.  పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 

ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.

🌻 *ఉపాధ్యాయురాలిగా*🌻
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతు గృహ బహిష్కారానికి గురిచేశారు.

 🌻 *సామాజిక విప్లవకారిణిగా*🌻
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.

 🌷 *భర్త మరణం* 🌷
జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.
🌷 *మరణం* 🌷
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది[3]. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.


వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) శుభాకాంక్షలు*

*వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) శుభాకాంక్షలు*






                
శ్లో!! వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ! 
ఉత్తర ద్వార గమనే దేవస్య మధు విద్విషః! దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం!!

శ్లో!! జన్మరాహిత్య మమలం ప్రాప్నోతి సువినిశ్చితమ్! గరుఢారూఢ విష్ణోస్తు సేవా మోక్షఫల ప్రదా !!

శ్లో!! ఉత్తర ద్వార మాసీనం ఖగస్థం వేంకటనాయకం! యః పశ్యతి సభక్తాదౌ యాతివై పరమాం  గతిమ్!!

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి...

 సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే 👉 ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు... 

సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య  ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది.... 

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.... 

ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది..... 
  
పెరియాళ్వార్ కి పరమాత్మ గరుడవాహనారూఢుడై దర్శనమిచ్చినరోజు ఈవైకుంఠ ఏకాదశి... 

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు.... 

ముక్కోటి ఏకాదశి నాడే జగన్మోహినీ అవతారంతో పరమాత్మ  అమృతం పంచిన రోజుగా దేవాలయాలలో ముక్కోటి ముందురోజు  జగన్మోహినీ అలంకారము చేసి ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహిస్తారు..... 
            
మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది... 
గీతా జయంతి కూడా ఇదే రోజు ఆచరిస్తారు..... 

ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం, జాగరణ... అటు తర్వాత జపం, ధ్యానం. ఆచరించాలి.... 

మధు కైటభులనే రాక్షసులకు మహావిష్ణువు  తన వైకుంఠ ద్వారాలను తెరిచి  వైకుంఠ ప్రాప్తి కలిగించినరోజు వైకుంఠ ఏకాదశి రోజునే.... 

వారు వైకుంఠ ప్రాప్తి పొందటమే కాకుండా ఆరోజున  ఉత్తర ద్వారం కుండావిష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు పరమాత్మని కోరారు.. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు..... 

తిరుమలలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు..... 

పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి..... 
                
ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు.... 

అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది..... అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు..... ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.... 

ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.... 

వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు.... ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవైమూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణ వాక్యం.... 

ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక.... వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది.... వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం..... ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు...... ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది..... 

గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పారాయణ చేయటం వినటం విశేషఫలం....


వైకుంఠ_ఏకాదశి

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి... వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం..... ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది... 

చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠః" (వైకుంఠుడు) అయ్యాడు..... అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు - అని అర్ధాలున్నాయి.... 
       

పండగ ఆచరించు విధానం....👇

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు.... ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు.... ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు.... 

ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం... ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం.... ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం... 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే.....

ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. ....పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి....


ఏకాదశి వ్రతం నియమాలు....👇

దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి....ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి... అసత్య మాడరాదు. ...చెడ్డ పనులు, దుష్టఆలోచనలు చేయకూడదు.... ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి....అన్నదానం చేయాలి....

ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది....

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.... ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.....

ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది....

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.... 

ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి...

                
శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవైఒక్కరోజులు జరుగుతాయి..... దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు..... విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు..... ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారు.....

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు.....ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు..... పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు....ఏటా రెండు రోజులూ తెరచే ద్వారం ఈసంవత్సరం నుండి భక్తుల కోసం పదిరోజులు తెరచి  శ్రీవారి దర్శనం  ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో అందిస్తున్నారు..... 
 
ఇన్ని రకాలుగా ప్రసిద్ధి వహించిందీ ఏకాదశి ! 

ఉత్తర ద్వార ప్రవేశంతో స్వర్గవాసం దక్కాలన్న ఆకాంక్ష భక్తుల్లో ఉంటుంది..... 

అందుకే తెల్లవారకముందే బారులు తీరుతుంటారు.... 

'ముక్కోటి’ దేవతలు ‘వైకుంఠ’స్వామి దర్శనానికి.... ఆరాటపడే ‘స్వర్గద్వార’ ఏకాదశి అత్యంత పుణ్యప్రద సందర్భం!!!

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Sunday, January 1, 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు దాని విశిష్టత💐💐💐

💐💐నూతన సంవత్సర శుభాకాంక్షలు💐



మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తు,
గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
ఈ కొత్త సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ
 శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
  ***  ***  ***
#న్యూ ఇయర్ అంటే కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభమయ్యే సమయం లేదా రోజు మరియు క్యాలెండర్ సంవత్సర గణన ఒకటి పెరుగుతుంది. అనేక సంస్కృతులు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా జరుపుకుంటాయి, మరియు జనవరి 1 వ రోజు తరచుగా జాతీయ సెలవుదినంగా గుర్తించబడుతుంది. ఈ రోజు ఎక్కువగా ఉపయోగించే క్యాలెండర్ వ్యవస్థ గ్రెగోరియన్ క్యాలెండర్‌లో, న్యూ ఇయర్ జనవరి 1 (న్యూ ఇయర్ డే) లో జరుగుతుంది. అసలు జూలియన్ క్యాలెండర్ మరియు రోమన్ క్యాలెండర్ (క్రీ.పూ. 153 తరువాత) లో ఇది సంవత్సరంలో మొదటి రోజు.

#రోమన్ గాడ్ అయిన జానస్ పేరును ఈ నెలకు పెట్టడం జరిగింది. అందువలన సంవత్సరంలో మొదటి నెలకు జనవరి అని పేరు వచ్చింది. ఈ న్యూయర్ డే సెలబ్రేషన్స్ అనేవి ఎన్నో ఏళ్ళగా జనవరి 1వతేదీని న్యూఇయర్ డే గా జరుగుతుంది.మొట్ట మొదట రోమన్లు ఆరంభించారని కొంతమంది వాదన. కానీ కొందరి చరిత్రకారుల ప్రకారం చైనీయులు ఈ సంప్రదాయాన్ని ఆరంభించారని చెప్తారు.డిసెంబరు 31వతేది రాత్రినుంచి ఈ సంబరాలు మొదలు అవుతాయి. ఆ రోజున స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకుని విందు వినోదాలు, ఆటపాటలతో కాలం గడుపుతారు.రాత్రి 12 గంటలకు ఒకరికొకరు నూతన సంవత్సర శుభా కాంక్షలు చెప్పుకుంటారు.

#పశ్చిమ ఐరోపాలో మధ్య యుగాలలో, జూలియన్ క్యాలెండర్ ఇప్పటికీ వాడుకలో ఉన్నప్పుడు, అధికారులు లొకేల్‌ను బట్టి నూతన సంవత్సర దినోత్సవాన్ని మార్చి 1, మార్చి 25, ఈస్టర్, సెప్టెంబర్ 1 మరియు డిసెంబర్ 25 తో సహా అనేక ఇతర రోజులలో ఒకదానికి మార్చారు. 1582 నుండి, గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క స్వీకరణలు అంటే, పాశ్చాత్య ప్రపంచంలో మరియు అంతకు మించిన అనేక జాతీయ లేదా స్థానిక తేదీలు జనవరి 1, నూతన సంవత్సర దినోత్సవం కోసం ఒక నిర్ణీత తేదీని ఉపయోగించటానికి మార్చబడ్డాయి.

#ఇతర సంస్కృతులు వారి సాంప్రదాయ లేదా మతపరమైన నూతన సంవత్సర దినోత్సవాన్ని వారి స్వంత ఆచారాల ప్రకారం, కొన్నిసార్లు (గ్రెగోరియన్) పౌర క్యాలెండర్‌తో పాటు జరుపుకుంటాయి. చైనీస్ న్యూ ఇయర్, ఇస్లామిక్ న్యూ ఇయర్ మరియు యూదుల నూతన సంవత్సరం మరింత ప్రసిద్ధ ఉదాహరణలు. భారతదేశం మరియు ఇతర దేశాలు వేర్వేరు తేదీలలో నూతన సంవత్సర వేడుకలను కొనసాగిస్తున్నాయి.

##నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు...##