🙏💐మహిళా స్ఫూర్తిప్రదాత,
సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త
"దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారి వర్థంతి సందర్భంగా💐🙏
తన #జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా #స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి #దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా... తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ఘ్ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు.
మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయకోవిదురాలుగా, #మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. #బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా కీర్తి సాధించారు దుర్గాబాయి గారు.
#చాచాజీనే నిలదీసేంత తెగువ..!
దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ నెహ్రూగారిని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు...
#బాల్యం-విద్య:
1909 వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యంనుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో #పాండిత్యాన్ని సంపాదించి, హిందీ #పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసారు.
బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్‌లో), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీసు ప్రారంభిస్తుంది
న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు. 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ నెహ్రూగారిని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు. తదనంతరం టికెట్ కొన్నాకనే లోనికి పంపించారు.తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది.
#స్వాతంత్య్ర సమరంలో:
#గాంధీజీగారి పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి... ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. తన చేతులకు ఉన్న #బంగారు గాజులను కూడా #విరాళంగా ఇస్తుంది.ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు.#స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు.
#మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది.
#వివిధ హోదాలలో:
తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమీషన్ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్‌వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషిచేశారు.
స్త్రీ #అభ్యున్నతి:
ఆనాటి ఆర్థికమంత్రి మరియు రిజర్వ్‌బ్యాంకు గవర్నరుగా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్‌ముఖ్‌ను దుర్గాబాయి వివాహం చేసుకొన్నారు. అణగారిన, వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్నతికి ఈమె ఆంధ్ర మహిళా సభను 1937లో స్థాపించారు. ఇందులోని రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.
#మాస పత్రిక-రచనలు:
1943 లో దుర్గాబాయి ఆంధ్రమహిళ అనే పేరుతో ఒక మాస పత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దానిపేరు ‘విజయదుర్గ’గా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ప్రచురించారు. ‘లక్ష్మి’ అనే నవల సీరియల్‌గా ప్రచురించారు. చిన్నతనం నుంచీ శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్‌చంద్ కథలను తెలుగులోకి అనువదించారు.
#స్టోన్స్ దట్ స్పీక్:
ఆమె అనుభవాలతో ‘స్టోన్స్ దట్ స్పీక్’ పేరిట (‘మాట్లాడే రాళ్ళు’ అని) ఒక పుస్తకం రాసారు.పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ – ‘‘ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థ చేసుకోగలిగిన వ్యక్తి, ప్రణాళికా బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి.. ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకాలనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకు రాగలడేమో కానీ, కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకు రాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు’’–అన్నారు.
#సామాజిక సర్వీస్ మదర్:
ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.
#అవార్డులు:
ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1971లోనే ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికిగానూ "నెహ్రూ లిటరరీ అవార్డు"ను అందుకున్నారు. అవే గాకుండా.. ప్రపంచశాంతి బహుమతినీ, పాల్.జి. హోస్‌మ్యాన్ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కాగా... #పద్మవిభూషణ్ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డులకెక్కారు.
*ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.
&ఈమె జ్ఙాపకార్థం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహంను స్థాపించారు. *కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. *ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.
*ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
#ఆడసింహం:
బ్రిటిషు అధికారులచే ‘ఆడసింహం’గా అభివర్ణించబడ్డ ధీరవనితగా, తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడింది.
#దేశంలో ప్రముఖ సంఘ సేవకురాలిగా, ఉదాత్త వనితగా పేరు తెచ్చుకున్న
దుర్గాబాయి... 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచిఉంటారు.
0 comments:
Post a Comment