A homepage subtitle here And an awesome description here!

Sunday, January 30, 2022

గాంధీజీ.....వర్థంతి

🌷🙏నీ అడుగులు.. ప్రపంచ శాంతికి మార్గాలు.....
గాంధీజీ.....వర్థంతి  సందర్భంగా🙏🌷





జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి.

 
#మానవులుజన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు. #సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా మరంగా ఉంటాయి.

మనకు తెలిసిన మనుషుల్లో #మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే.
కత్తులు, కఠారులు,బాంబులు, తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళలో పోసిన త్యాగశీలి, అమరవీరులు మన బాపూజీ.
ఆయన జగతిలో అందరికీ ఆదర్శప్రాయులు.

#అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తి అయినా తలవంచక తప్పదు. హింసకు సరైన సమాధానం అహింస మాత్రమే అని గాంధీజీ నొక్కి వక్కాణించేవారు.
1948 జనవరి 30 భారత జాతికే దుర్దినం.ఆరోజు సాయంకాలం 4 గంటలకు అహింసా సిద్ధాంత ప్రవక్త , మన జాతిపిత, పూజ్య బాపూజీ నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవియై నేలకొరిగారు. 

#స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు #అమరవీరుల సంస్మరణ #దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము.

#గాంధీజీ.. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి భారతావనికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాపురుషుడు. ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మార్గదర్శి బాపుజీ. సత్యాగ్రహ్రాన్ని ఆయుధంగా మలిచి.. పోరాటం చేసిన మహాత్ముడు గాంధీజీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ.. మహాత్ముడిగా మారిన తీరు.. ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాదు.. హింసతో సాధించేది ఏం లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని చెప్పి.. ఆ మాటలను నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం.#

#గాంధీజీ బాల్యం, విద్య....

మహాత్ముడి పూర్తిపేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబరు 2, 1869లో గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్లో ఒక సామాన్య కుటుంబములో జన్మించాడు. జన్మించారు.
ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారి కుటుంబం ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. బాల్యం నుంచి గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు.13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌లలో ఆయన విద్యనభ్యసించారు. 1888 లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు.

#దక్షిణాఫ్రికాలో గాంధీ....

న్యాయవాద విద్యను అభ్యసించిన గాంధీ.. 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. ఒక సంవత్సరము అనుకుని వెళ్ళిన గాంధీ.. ఏకంగా దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. దీంతో జాతి వివక్షపై ఆయన పోరాటం ప్రారంభించాడు. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు. ఆ తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఆ తర్వాత పలుచోట్ల పర్యటించిన గాంధీ 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో భారతదేశంలో స్వాతంత్య్రోద్యమ పోరాటం ఉప్పెనలా చిగురిస్తోంది.

#దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో…..

దేశ స్వాతంత్ర్యం ఉద్యమ సమయంలో గాంధీ భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆయన 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు.

#బాపు అని పిలిచిందెప్పుడు అంటే....

సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీని అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు” అనీ, “మహాత్ముడు” అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి.

#సహాయ నిరాకరణోద్యమం...

1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మారణకాండతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు కట్టలుతెంచుకున్నాయి. బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు నిరసనగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ వస్తువులే వాడాలని, విద్యాసంస్థలను, న్యాయస్థానాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో సహాయ నిరాకరణోద్యమం విజయవంతమైంది. 1922 ఫిబ్రవరిలో ముగ్గురు నిరసనకారులను పోలీసులు చంపేశారు. దీంతో ఆగ్రహోదక్తులైన ఆందోళనకారులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 22 మందిని చంపేశారు. దీంతో ఈ ఘటన మరింత హింసకు దారి తీస్తుందనే భయంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు.

#దండి యాత్ర....

భారతీయులు ఉప్పు సాగు చేయకుండా, విక్రయించకుండా బ్రిటిషర్లు చట్టం తెచ్చి.. ఉప్పుపై భారీగా పన్ను విధించారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ.. గాంధీజీ దండి యాత్రను చేపట్టారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు.. అహ్మదాబాద్ నుంచి దండి వరకు 388 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. వేలాది మంది ప్రజలు దండి యాత్రలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో 80 వేల మంది భారతీయులను జైలుకు పంపారు. దండి యాత్ర యావత్ ప్రపంచాన్ని ఆకర్షించడంతో.. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలనే వాదనకు బలం చేకూరింది.

#క్విట్ ఇండియా..

1942 ఆగష్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు ఇక చరమగీతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డూ ఆర్ డై అని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. గాంధీ చేస్తున్న ప్రసంగాలు జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపింది. దేశమంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు. దీంతో లక్షల మందిని బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే ఈ ఉద్యమంతో ఇక భారత్‌లో ఉండటం కుదరదన్న భావనకు బ్రిటీష్ ప్రభుత్వాధికారులు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉందనగా భారత్‌కు స్వాతంత్య్రం ఇస్తామనే సంకేతాలిచ్చారు. దీంతో గాంధీజీ తన పిలుపును వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం అరెస్ట్ చేసిన లక్ష మందిని విడుదల చేసింది. 1947 ఆగష్టు 15న భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కానీ బ్రిటిషర్లు దేశాన్ని భారత్, పాకిస్థాన్‌గా విభజించారు.

#గాంధీ హత్య…

1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చి చంపారని ఆయన తెలిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో.. గాంధీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Friday, January 28, 2022

లాలాలజపతిరాయ్ గారి జయంతి


🌹"స్వాతంత్య్రోద్యమ కేసరి" లాలాలజపతిరాయ్ గారి జయంతి సందర్భంగా🌹




(భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య......
లాలాలజపతిరాయ్)

✍️లాలాలజపతిరాయ్ ,రాజకీయ నాయకుడు,గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. లజపతిరాయ్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక పోరాటాలు చేశాడు.అతివాదులుగా పేరుపొందిన (లాల్ )లాలా లలా లజపతిరాయ్ ,(బాల్ ) బాలగంగాధర తిలక్ , (పాల్ ) బిపిన చంద్రపాల్ త్రయం అంటే ,ముగ్గురు.ఈ ముగ్గరిలో లాలా లజపతి రాయ్ ఒకరు. ఈయనకు పంజాబ్ కేసరి అనే బిరుదుకూడావుంది.కేసరి అంటే  సింహం అని అర్థం.




👫అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి.

*🏦లాలా లజపతిరాయ్ 'పంజాబ్ నేషనల్ బ్యాంకుని స్థాపించారు.ఈనాడు ప్రముఖ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకి ఒకటి.

🧔బాల్యం-తొలి జీవితం:

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చిన లాలా లజపతిరాయ్ 1865 జనవరి 28 న పంజాబ్ రాష్ట్రంలో జాగ్రన్ పట్టణంలో జన్మించారు. అయన తండ్రి లాల్ రాధాకిషన్ ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ, పర్షియన్ భాషల పండితులుగా పనిచేశారు. ఈయన తన కుమారుడు లాలాలజపతిరాయ్ కి చిన్నప్పటి నుండి న్యాయవాద వృత్తిపై ఆసక్తి కలిగేలా చేశారు. తండ్రిలోని ధైర్య, స్టైర్య, వైజ్ఞానికాలు, తల్లిలోని సర్వ సమానత్వం, దీన జనోద్దరణ వంటి లక్షణాలు పుణికి పుచ్చుకుని ప్రజల హృదయాలను చూరగోనె లక్షణం అయన ఆదర్శ నాయకుడు అవడానికి ఎంతో దోహద పడ్డాయి. లాలాలజపతిరాయ్ జగ్రాన్, లూథియానా, అంబాలా, లాహోర్ లలో విద్యాభ్యాసం సాగింది. 1885లో లా పరీక్షలో విజయం సాధించి, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 20 ఏళ్ల వయస్సులోనే న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు.

✍️లోక్ సేవక్ సంఘ్.....

 పంజాబ్ లోని యువతలో దేశ స్వాతంత్రోద్యమం పట్ల పెద్దగా ఉత్సాహం, ఆసక్తి లేకపోవడాన్ని గమనించిన లాలాలజుపతిరాయ్ వారిలోని నిరాశను తొలగించి వారిని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేయడానికి కృషి చేశారు. అంతేకాక అటువంటి వారికి ఆర్థిక సహాయం అందజేయడం కొరకు లోక్ సేవక్ సంఘ్ అనే సంస్థను ప్రారంభించారు.

🇮🇳స్వాతంత్ర్య ఉద్యమంలో...

మొదటి ప్రపంచ యుద్దం సమయంలో అమెరికాకు వెళ్లి 1919 సంవత్సరం వరకు అక్కడ ఉన్న లాలాజీ అక్కడి వారి నుండి కూడా ఆదరాభిమానాలు అందుకున్నారు. భారతదేశ ప్రజలు ఆయనను ఎంతగా గౌరవిస్తారో, అంతగా అక్కడి వారూ ఆయనను అభిమానించారు. సహాయ నిరాకరణోద్యమం, 1920లో కాంగ్రెస్ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. సహాయ నిరాకరనొద్యమం సమయంలో 1921- 23 మధ్య రాయ్ జైలు జీవితం గడపవలసి వచ్చింది.  దయానంద సరస్వతి ఆర్య సమాజోద్యమం అనే దానిని ప్రారంభినప్పుడు అయన పిలుపును అందుకుని రాయ్ కూడా ఆ ఉద్యమంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేసారు. 

1897 💥ఉత్తరభారత దేశంలో భయంకరమైన కరువు వచ్చిన సమయంలో.....

1897 ఉత్తర భారత దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. పంట చేలు, నూతులు, చెరువులు ఎండి పోయాయి. కరువు తాకిడికి వేలాది సంఖ్యలో పశువులు మరణించాయి. తిండిలేక ప్రజలు అల్లాడి పోయారు. కొందరు ప్రజలు రహదారుల వెంట వెళుతూ మరణించారు. ఆ సమయంలో లాలాలజుపతిరాయ్ మెడకు జోలే తగిలించుకుని కరువు బాధితులకు సహాయం చేయడం కోసం విరాళాలు సేకరించి వారికి సహయపడ్డారు. రాయ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అనేక ఉద్యమాలు నిర్వహించి ఆంగ్లేయులకు పక్కలో బల్లెంలా మారారు. ఆయన పంజాబ్ కేసరి అనే బిరుదును పొందారు.

✍️రచయితగా కూడా.....

లాలా లజుపతి రాయ్ కి రచయితగా కూడా మంచి పేరుంది. తన నవలలు ది స్టోరీ ఆఫ్ మై దిపోర్షన్ (1908 ), ఆర్య సమాజ్ (1915), ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎ హిందూస్ ఇంప్రెషన్ (1916), అన్ హ్యాపీ ఆఫ్ ఇండియా వంటి అనేక రచనలు చక్కని భావజాలంయో సాహితీ విలులతో కూడినవై అందరి ప్రశంసలు అందుకున్నారు. 
తన అభిమాన హీరోలు జోసెఫ్‌ మ్యాజినీ, గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్‌ రాశారు.*
ది పీపుల్ అనే పత్రిక నిర్వహించారు. 

✍️యంగ్ ఇండియా పత్రిక....
 
వీరు యంగ్ ఇండియా పత్రికను నిర్వహించి గ్రంథ రచన చేశారు. 1920లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు అద్యక్షులు అయ్యారు.
జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసి అనేక మంది యువకులు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనేలా వారిని ఉత్తేజపరచారు.

✍️బెంగాల్‌ విభజనోద్యమం:

బెంగాల్‌ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్‌ నుంచి అరవింద్‌ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్‌ తిలక్, పంజాబ్‌ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్‌ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్‌ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్‌ చదువుకున్నారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్‌ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్‌ పేట్రియాట్స్‌ అసోసియేషన్‌ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్‌ సింగ్‌. ఈయన భగత్‌సింగ్‌ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్‌ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే.

✍️సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా....

 పరిచిన లాలా లజుపతి సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దేశ వ్యాప్తంగా సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా పలు సంఘర్షణలు జరిగాయి. లాలా లజుపతి రాయ్ అధ్వర్యంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన జరుగుతున్న సమయంలో పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ జరిపారు. ఆ సమయంలో లజుపతి రాయ్ పై కూడా తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేశారు. రాయ్ తలపై, ఛాతిపై తీవ్రంగా గాయాలు కావడంతో లాలాజీ అనారోగ్యం పాలయ్యారు. ఆ లాఠీ ఛార్జ్ ల గాయాల తీవ్రత కారణంగానే 17 నవంబర్ 1928 న అయన తన తుది శ్వాస విడిచారు.

✍️చనిపోతూ  లజపతి రాయ్
ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’

ఇందుకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్‌ పి. సాండర్స్‌ అనే మరొక అధికారిని కాల్చి చంపారు.
👏లజపతిరాయ్‌  ప్రధానంగా గొప్ప మానవతావాది👏 

Thursday, January 27, 2022

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు

*క్రొత్త జిల్లాలు : AP*

1) *జిల్లా : శ్రీకాకుళం*

ముఖ్య పట్టణం: శ్రీకాకుళం

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు

2) *జిల్లా పేరు: విజయనగరం*

జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మొత్తం మండలాలు 26
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు

3) *జిల్లా పేరు: మన్యం*

జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10) మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

4) *జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు*              

జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

5) *జిల్లా పేరు: విశాఖపట్నం*

జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు

6) *జిల్లా పేరు: అనకాపల్లి*

జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

7) *జిల్లా పేరు: తూర్పుగోదావరి*

జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

8) *జిల్లా పేరు: కోనసీమ*

జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

9) *జిల్లా పేరు: రాజమహేంద్రవరం*

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

10) *జిల్లా పేరు: నరసాపురం*

జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11) *జిల్లా పేరు:పశ్చిమగోదావరి*

జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

12) *జిల్లా పేరు: కృష్ణాజిల్లా*                               

కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

13) *జిల్లా పేరు: ఎన్టీఆర్‌* 

జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

14) *జిల్లా పేరు: గుంటూరు*

జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

15) *జిల్లా పేరు: బాపట్ల*

జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

16) *జిల్లా పేరు: పల్నాడు*

జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17) *జిల్లా పేరు: ప్రకాశం*

జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

18) *జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు* 

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19) *జిల్లా పేరు: కర్నూలు* 

జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

20) *జిల్లా పేరు: నంద్యాల*

జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

21) *జిల్లా పేరు: అనంతపురం*

జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22) *జిల్లా పేరు: శ్రీసత్యసాయి*

జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23) *జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప*

జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24) *జిల్లా పేరు: అన్నమయ్య*

జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25) *జిల్లా పేరు: చిత్తూరు*

జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26) *జిల్లా పేరు: శ్రీ బాలాజీ*

జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

Wednesday, January 26, 2022

భారత గణతంత్ర దినోత్సవం చరిత్ర

✍️భారతదేశంలో దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26నభారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. 







✍️భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
✍️జనవరి  నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణస్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
✍️1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు ,  నాయకులు ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు.
✍️దేశరాజధాని న్యూఢిల్లీలో  జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు.


🇮🇳🇮🇳 మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు ఎన్ని  ఉన్నాయి?

✍️ఎవరు సలహాతో జాతీయ జెండా మధ్యలో తెల్లరంగును జోడించారు?

భారతదేశం ప్రపంచానికి నాగరికత నేర్పిన అతి గొప్పదేశం. అటువంటి చరిత్ర గలిగిన దేశం బ్రిటీష్ వారి పాలనలో 200ల సంవ్సరాలు మగ్గిపోయింది. ఎంతోమంద్రి త్యాగాల ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలో స్వతంత్రానంతరం భారతదేశ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం ఆవిషృతమైన రోజు జనవరి 26,1950వ సంవత్సరం.  భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. అదే గణతంత్ర దినోత్సవం.  

గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.

భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.

*భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది*
*ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు*

భారత జాతీయ జెండా డిజైన్:


✍️భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య డిజైన్ చేశారు. పింగళి మొదట డిజైన్ చేసిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి. ఆయన ఈ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బెజవాడ సెషన్‌లో గాంధీజీ సమక్షంలో అందించారు. తర్వాత గాంధీ సలహాతో జెండా మధ్యలో తెల్లరంగును జోడించారు. ఆ తర్వాత చరఖా ప్రాంతంలో రాష్ట్రీయ చిహ్నం హోదాలో అశోక చక్రానికి చోటు లభించింది. భారత జాతీయ జెండా ప్రస్తుత స్వరూపాన్ని 1947 జులై 22న నిర్వహించిన భారత రాజ్యాంగ సభ సమావేశం సందర్భంగా స్వీకరించారు. భారత్‌లో 'త్రివర్ణం' అంటే భారత జాతీయ జెండా అని అర్థం.

🇮🇳అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? 

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది... కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు.అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. 
నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

✍️మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి*

✍️✍️బీటింగ్ రిట్రీట్' అనే వేడుక ఎక్కడ జరుగుతుంది?🇮🇳🇮🇳

*బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్‌లో రాష్ట్రపతి భవనం ఎదుట జరుగుతుంది. దానికి రాష్ట్రపతి ముఖ్య అతిథి. బీటింగ్ రిట్రీట్ వేడుకను గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా చెబుతారు. ఇది గణతంత్ర దినోత్సవం జరిగిన మూడో రోజు అంటే జనవరి 29న సాయంత్రం నిర్వహిస్తారు. బీటింగ్ రిట్రీట్‌లో పదాతి దళం, వైమానిక దళం, నావికా దళాల బ్యాండ్ సంప్రదాయ సంగీతం వినిపిస్తూ మార్చ్ చేస్తాయి.
✍️జాతీయ సాహస పురస్కారాలు ఎప్పుడు ప్రదానం చేస్తారు?

జాతీయ సాహస పురస్కారాలను భారత్ ప్రతి ఏటా జనవరి 26 సందర్భంగా ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు ఇస్తారు. ఈ అవార్డులను 1957 నుంచి ప్రారంభించారు. పురస్కారంలో భాగంగా ఒక పతకం, ధ్రువ పత్రం, నగదు బహుమతి అందిస్తారు. స్కూల్ విద్య పూర్తి చేసేవరకూ పిల్లలందరికీ ఆర్థిక సాయం కూడా అందిస్తారు.

గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది?

గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ దగ్గర ముగుస్తుంది.


🌅ముఖ్యమైన దినోత్సవములు💐💐💐

✍️దినోత్సవములు

✍️జనవరి నెలలో

1: రహదారి భద్రతా దినోత్సవం
2: ప్రపంచ శాంతి దినోత్సవం
3: మహిళా టీచర్స్ డే
4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5: సైనిక దినోత్సవం
9: ప్రవాస భారతీయ దివస్
10: ప్రపంచ నవ్వుల దినోత్సవం
11: జాతీయ విద్యాదినోత్సవం
12: జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
21: మణిపూర్, మేఘాలయ,
త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
23: సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
25: ఇండియా టూరిజం దినోత్సవం,
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
26: భారత గణతంత్ర దినోత్సవం,
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
30: అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.

✍️ఫిబ్రవరి నెలలో

1: భారత తీర రక్షక దళ దినోత్సవం
2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
4: వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
11: ప్రపంచ వివాహ దినోత్సవం
12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం,
గులాబీల దినోత్సవం.
14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం
20: మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం, కవలల దినోత్సవం
24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
25: జాతీయ సైన్స్ దినోత్సవం.

✍️మార్చి నెలలో          

4: జాతీయ భద్రతా దినోత్సవం
5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
ప్రపంచ బధిరుల దినం
8: అంతర్జాతీయ మహిళా దినం
9: వరల్డ్ కిడ్నీ డే
10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
15: ప్రపంచ పౌర హక్కుల దినం
18: మానవ హక్కుల దినం
20: సాంఘిక సాధికారత స్మారక దినం
21: ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం
22: ప్రపంచ జల దినోత్సవం
23: ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం
24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
27: అంతర్జాతీయ నాటక దినోత్సవం
28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం

✍️ఏప్రిల్ నెలలో

1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2: పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5: నేషనల్ మారిటైమ్ డే
7: ప్రపంచ ఆరోగ్య దినం
8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10: ప్రపంచ హోమియోపతి డే
12: ప్రపంచ రోదసీ దినోత్సవం
13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం
14: అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, 
మహిళా పొదుపు దినోత్సవం
15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16: తెలుగు రంగస్థల దినోత్సవం
17: ప్రపంచ హిమోఫిలియా దినం
18: ప్రపంచ సాంస్కృతిక దినం
21: జాతీయ సమాచార హక్కుల దినం,
జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25: ప్రపంచ మలేరియా దినం
26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం,
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28: ప్రపంచ భద్రతా దినోత్సవం,
ప్రపంచ పశుచికిత్సా దినం
29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.

✍️మే నెలలో

1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం
3: ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
4: బొగ్గు గని కార్మిక దినోత్సవం
5: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
7: ఠాగూర్ జయంతి, నవ్వుల దినోత్సవం
8: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
11: జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం,
అంతర్జాతీయ వలస పక్షుల దినం
13: మాతృ దినోత్సవం
15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
18: ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
21: తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
24: కామనె్వల్త్ దినోత్సవం
27: నెహ్రూ వర్థంతి
29: వౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
30: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.

✍️జూన్ నెలలో

1: అంతర్జాతీయ బాలల దినోత్సవం,
ప్రపంచ పాల దినోత్సవం
4: అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం
5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8: ప్రపంచ సముద్ర దినోత్సవం
12: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
14: పతాక దినోత్సవం
18: గోవా స్వాతంత్య్ర దినోత్సవం
20: తండ్రుల దినోత్సవం, మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21: ప్రపంచ సంగీత దినోత్సవం
23: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
25: ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
26: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
28: పేదల దినోత్సవం
29: గణాంక దినోత్సవం.

✍️జూలై నెలలో           

1: వైద్యుల దినోత్సవం, వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
11: ప్రపంచ జనాభా దినోత్సవం
12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
17: పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26: కార్గిల్ విజయోత్సవ దినం
29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే

✍️ఆగస్టు నెలలో

1: తల్లిపాల దినోత్సవం
2: ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
6: హిరోషిమా దినోత్సవం
8: క్విట్ ఇండియా దినోత్సవం
9: నాగసాకి దినోత్సవం
10: డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
12: లైబ్రేరియన్స్ డే
13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే
15: స్వాతంత్య్ర దినోత్సవం,
పశ్చిమ బెంగాల్ దినోత్సవం
18: అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
20: సద్భావన దినం (రాజీవ్ గాంధీ జయంతి)
మలేరియా నివారణ దినం
24: సంస్కృత దినోత్సవం
29: తెలుగు భాష దినోత్సవం, జాతీయక్రీడా దినోత్సవం

✍️సెప్టెంబర్ నెలలో

1: పోషక పదార్థాల వారోత్సవం
2: కొబ్బరికాయల దినోత్సవం
4: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ
దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
5: ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్ జన్మదినం
8: ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
9: వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
10: హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
14: హిందీ దినోత్సవం
15: ఇంజినీర్స్ దినోత్సవం, సంచాయక దినోత్సవం
16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
17: మహిళల మైత్రీ దినోత్సవం
20: రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
21: బయోస్ఫియర్ దినం,
అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం,
ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
22: క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, గులాబీల దినోత్సవం
24: ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం, ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
26: చెవిటి వారి దినోత్సవం
27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినం, గన్నర్స్ డే, వరల్డ్ హార్ట్ డే,
ప్రపంచ నదుల దినోత్సవం.
సెప్టెంబర్ 4వ ఆదివారం- కూతుళ్ల దినోత్సవం.

✍️అక్టోబర్ నెలలో        

1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, 
వన్యప్రాణి వారోత్సవాలు,
జాతీయ తపాలా దినోత్సవం, 
స్వచ్ఛంద రక్తదాన దినం, 
అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
2: మానవ హక్కుల పరిరక్షణ దినం, గాంధీ జయంతి, గ్రామ్‌స్వరాజ్ డే,
ఖైదీల దినోత్సవం.
ప్రపంచ జంతువుల దినోత్సవం
4: ప్రపంచ జంతు సంక్షేమ దినం
5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
6: వరల్డ్ స్మైల్ డే,
ప్రపంచ గృహవసతి దినం
8: భారత వాయుసేన దినోత్సవం
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం
9: ప్రపంచ పోస్ట్ఫాస్ దినోత్సవం,
న్యాయ సేవా దినం,
జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
12: ప్రపంచ దృష్టి దినోత్సవం
13: ప్రపంచ గుడ్డు దినోత్సవం
14: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15: అంతర్జాతీయ అంధుల ఆసరా దినం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ కవిత్వ దినం.
16: ప్రపంచ ఆహార దినం
17: అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన దినోత్సవం
21: పోలీస్ సంస్మరణ దినం
23: అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ దినోత్సవం
24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల
అవతరణ దినోత్సవం
27: పదాతిదళ దినోత్సవం, శిశుదినోత్సవం
28: అత్తవార్ల దినోత్సవం
30: ప్రపంచ పొదుపు దినోత్సవం
31: జాతీయ సమైక్యత దినోత్సవం,
జాతీయ పునరంకిత దినం,
ఇందిరాగాంధీ వర్ధంతి.

✍️నవంబర్ నెలలో

1: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం
7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం
8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
9: లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం
10: రవాణా దినం
11: వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం
14: ప్రపంచ మధుమేహ దినోత్సవం,
ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
19: ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం
20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.
25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.
26: జాతీయ న్యాయ దినోత్సవం,
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.

✍️డిసెంబర్ నెలలో

1: ప్రపంచ ఎయిడ్స్ దినం,
నాగాలాండ్ దినోత్సవం,
సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
4: భారత నౌకాదళ దినోత్సవం
5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
6: పౌర రక్షణ దినం
7: సైనికదళాల పతాక దినం,
అంతర్జాతీయ పౌర విమానయానదినోత్సవం
8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం
9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం                    
10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం.
ప్రపంచ జంతువుల హక్కుల దినం
11: యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం
12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
15: ఇంటర్నేషనల్ టీ డే
17: పెన్షనర్స్ డే
18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,
మైనారిటీ హక్కుల దినం (్భరతదేశం)
19: గోవా విముక్తి దినోత్సవం.
22: ప్రపంచ గణిత దినం
23: కిసాన్ దినోత్సవం
24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే
26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
31: వరల్డ్ స్పిరిట్యువల్ డే.

Monday, January 24, 2022

భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ భాభా వర్థంతి

💐💐అణుశక్తిమాన్! భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ భాభా వర్థంతి సందర్భంగా




 ✍️జవహర్‌లాల్ నెహ్రూకు భాభా అత్యంత సన్నిహితుడు. భాభాను నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు


✍️ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా.
 ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘#కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. #జగద్విజేత!

అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు.
 పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు.

1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో,   ✍️అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో!  
దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా!
 
నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్‌ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి.

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు.

అది 1974 మే 18. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఓ పరీక్ష నిర్వహించారు. విజయవంతమైన ఆ ప్రయోగం, ప్రపంచంలో న్యూక్లియర్‌ పరిశోధనలు జరిపే దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఆనాటి విజయానికి ఎన్నో ఏళ్ల ముందే బాటలు పరిచిన వ్యక్తిగా, 'భారత #పరమాణు విధానానికి పితామహుడి'గా హోమీ జె. భాభా పేరొందారు. ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది

 
భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని   ✍️సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా.

అణు కార్యక్రమాలకు కావలసిన                 ✍️యూరేనియమ్ అనే ఇంధనం భారతదేంలో అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఆనాడే బాబా రూపకల్పన చేశాడు.
నేడు భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం హోమీ బాబా స్ఫూర్తి అని ఆయనతో కలిసి పనిచేసిన మన మాజీరాష్ట్రపతి కలాం గారి అభిప్రాయం.

✍️ట్రాంబేలోని అణుశక్తి కేంద్రం పేరును అతని గౌరవార్థంగా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ గా మార్చారు.

 ✍️అతని మరణం తరువాత, అతని గౌరవార్థంగా అటామిక్ ఎనర్జీ స్థాపనను భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. భాభా ఎలక్ట్రానిక్స్, అంతరిక్షశాస్త్రం, రేడియా ఖగోళశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్రంలో పరిశోధనను కూడా ప్రోత్సహించాడు. 

    ఊటీ, భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన రేడియా టెలిస్కోప్ అతని సంకల్పమే. ఇది 1970లో వాస్తవంగా ఆరంభించబడింది. భాభా అప్పటి నుంచి "భారతదేశం యెుక్క అణుశక్తి కార్యక్రమమునకు పితామహుడిగా" ఉన్నాడు. హోమీ భాభా ఫెలోషిప్ కౌన్సిల్ 1967 నుండి ఫెలోషిప్ లను అందిస్తోంది, ఇతర గుర్తింపు పొందిన సంస్థలలో డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమీ భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ మరియు హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, ముంబాయి, భారతదేశం ఉన్నాయి.

🇮🇳భారత అణు కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, పుస్తకాలంటే కూడా ఇష్టం.
హోమీ జహంగీర్ భాభా
ఫొటో క్యాప్షన్,
పేరొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచర శాస్త్రవేత్తల్ని ఎక్కువగా పొగిడేవారు కాదు. కానీ, హోమీ భాభాను ఆయన ‘భారత లియోనార్డో డావిన్సీ’ అని పిలిచేవారు.

✍️టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రతి బుధవారం అకడెమిక్ కాంగ్రెస్ జరిగేది. ఏ ఒక్క సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యేవారు కాదు. ఇందులోనే చాలామందిని ఆయన కలుసుకునేవారు. ఏం జరుగుతోంది? ఏం జరగటం లేదు? అనేవి తెలుసుకునేవారు’ అని యశ్‌పాల్ చెప్పారు.

✍️కేవలం ఇద్దర్ని మాత్రమే #నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు. అందులో ఒకరు జయప్రకాశ్ నారాయణ్ కాగా మరొకరు భాభా’ **

✍️టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక గార్డెన్ ఉంది. దాని పేరు అమీబా గార్డెన్. దీన్ని రూపొందించింది, మొత్తం ఇన్‌స్టిట్యూట్ పచ్చగా, అందంగా ఉండేలా చేసిందీ భాభాయే.

**ఈ ప్రపంచంలో నేను కలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో హోమీ భాభా ఒకరు. మిగతా ఇద్దరు జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ‌’ అని భాభాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జేఆర్‌డీ టాటా అన్నారు.

Sunday, January 23, 2022

సుభాష్‌చంద్రబోస్ జయంతి- దేశభక్తి దినోత్సవం🇮🇳

💐🇮🇳సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత. సుబాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా🇮🇳💐
     🇮🇳సుభాష్‌చంద్రబోస్ జయంతి- దేశభక్తి దినోత్సవం🇮🇳





✍️సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆ ఫైలులో, 100 ఏళ్ల వరకు చెప్పరు***

#భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన విప్లవ నేత. అహింసా మార్గంతో విభేధించిన ఆయన రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. రాజీనామా చేశాడు.  ఓ వైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో.. అహింసామార్గంలో పయనిస్తున్నా.. ఈ తరహా ఉద్యమాలతో పనులు జరవని తెగేసి చెప్పిన ధీరుడు.. తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపజేసి.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత. అయనే సుబాష్ చంద్రబోస్.

అహింసను తప్పుబట్టనని చెప్పిన ఆయన ఓ వర్గం అలా చేస్తూన్న క్రమంలోనే మరో వర్గమాత్రం ఎదురుతిరగి అంగ్లేయులకు తిరుగుబాటు రుచిచూపించాలని పిలుపునిచ్చాడు. కేవలం అహింసా మార్గంలోనే పనులు జరుగుతాయని వెళ్లితే.. అందుకు ఫలితం రావాలంటే ఏళ్ల సమయం వేచి చూడాలని అన్నారు. పోరుబాటే తన రూటన్నాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన ధీరుడు బోస్. స్వాతంత్ర్యం ఒకరు మనకిచ్చేదేమిటి.. మనమే తీసుకోవాలని.. అంగ్లేయులను తరమికోట్టాలని పిలుపునిచ్చిన వీరుడు బోస్.

1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారాయన. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుండే వాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ కొట్టాడు బోస్. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్ కు రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించాడు. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

#దేశానికి ఇండిపెండెన్స్ రావాలంటే.. గాంధీజీ అహింసావాదం మాత్రమే సరిపోదు… పోరుబాట కూడా ముఖ్యమని భావించాడు చంద్రబోస్. 1938లో గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా…. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పట్టాభి సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా గాంధీ భావించాడని ఓ వాదన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. 1939లో సెకండ్ వాల్డ్ వార్ వచ్చింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు.. ఇదే కరెక్ట్ టైమని భావించిన బోస్… కూటమి ఏర్పాటు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశాడు చంద్రబోస్. హిట్లర్ ను కూడా కలిశారు.

#నేతాజి స్పురద్రూపి:

ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ బాస్ ను రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్, బోస్ ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకా ఎవరికి లేదు అని జవాబిచ్చాడు.




సెకండ్ వాల్డ్ వార్ తర్వాత… బ్రిటీష్ వాళ్లు దేశానికి వదిలి వెళ్తారని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు భావించారు. చంద్రబోస్ మాత్రం… ఈ యుద్ధంలో ఆంగ్లేయులను అంతంచేయాలని చూశాడు.  కానీ.. బ్రిటీష్ సర్కార్ ఏకపక్షంగా, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఇండియా తరఫున యుద్ధాన్ని ప్రకటించాయి. దీంతో నిరసనకు దిగిన బోస్.. అండ్ టీమ్ ను జైల్లో పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. బయటికొచ్చిన బోస్ ను హౌజ్ అరెస్ట్ చేశారు. మారువేషంలో మేనల్లుడి సహాయంతో   పెషావర్ చేరుకున్నాడు. అట్నుంచి జర్మనీ చేరుకుని అక్కడ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి.. ప్రసారాలు మొదలుపెట్టాడు. 42 వరకు జర్మనీలో ఉన్న బోస్… 1943లో భారత సైన్యంలోకి వచ్చాడు. 1944 జులై 4న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ ఇచ్చిన స్పీచ్ దేశ యువతను ఉత్తేజపరిచింది. మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాను అన్నాడు సుబాష్ చంద్రబోస్.

బోస్ #ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ (Giuseppe Garibaldi) , మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ (Kemal Atatürk) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం

పుట్టుక గురించే తప్ప బోస్ మరణం ఇప్పటికీ  మిస్టరీనే. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కథనం. దీనిపైనా భిన్న వాదనలున్నాయి. అసలు ఆ రోజు ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని.. ఆయన గుమ్నానీ బాబాగా చాలా ఏళ్ల పాటు బతికే ఉన్నారని మరో ప్రచారం కూడా ఉంది. గతేడాది బోస్ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినా… వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు

#అపరిచిత సన్యాసి:

1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు
భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకలేదు.

***#సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆ ఫైలులో, 100 ఏళ్ల వరకు చెప్పరు***

 సుభాష్ చంద్రబోస్ ఎక్కడ, ఎలా మరణించారనే అంశంపై పలు వాదనలు ఉన్నాయి. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిపారు, ఏమయ్యారనే కీలక సమాచారం ఫైలు ఫ్రాన్సులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ చరిత్రకారుడు మోర్‌ ఆ సమాచారం కోరారు.

కానీ ఆ వివరాలు వెల్లడించేందుకు ఫ్రెంచ్‌ నేషనల్‌ ఆర్కైవల్‌ అథారిటీ అంగీకరించలేదు. వందేళ్ల వరకూ ఆ ఫైల్‌ను బహిర్గతం చేయరాదని అధికారులు నిర్ణయించినట్లు మోర్‌ తెలిపారు.

అందరూ భావిస్తున్నట్లు తైపే విమాన ప్రమాదంలో బోస్‌ మరణించి ఉండకపోవచ్చునని, నిజంగా బోస్‌ అక్కడే మరణించినట్లయితే టోక్యోలో ఉంచిన బూడిదకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే వాస్తవమేంటో తెలిసిపోతుందని ఆయన తెలిపారు. కానీ, డీఎన్‌ఏ పరీక్ష చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లు పరిశోధించిన తాను, ఫ్రెంచ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్‌ ప్రాంతంలోని జైలులో బోస్‌ మరణించినట్లు నిర్ధారించే స్థాయికి వచ్చినట్లు చెప్పారు.

#ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, సైగన్‌లో బోస్‌ గడిపిన కాలాన్ని తెలిపే వివరాలున్న ఫైల్‌ను అడిగితే ఫ్రెంచ్‌ అధికారులు ఇవ్వడం లేదన్నారు.

Wednesday, January 19, 2022

💐నందమూరి తారక రామారావు గారి వర్థంతి సందర్భంగా💐

🌷🙏నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు  గారి వర్థంతి సందర్భంగా



నటనలో ప్రఖ్యాతుడు – రాజకీయ విఖ్యాతుడు.💐💐💐💐

✍️కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. ‘నందమూరి తారక రామారావు’.. ఈ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్.

‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. కార్మికుడి కరిగిన కండాలల్లోనుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి’ అంటూ.. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించారు.
ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది.. ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది .. ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్పూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది.చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి.. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను మందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు.

నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు... ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.

✍️బాల్యం-విద్యాభ్యాసం:

1923 మే 28న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. 



పాఠశాల విద్య విజయవాడ మున్సిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.
1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది.

1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.

✍️సినిమా రంగ ప్రవేశం:

మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం.1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. 
1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు. 
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.
రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్‌లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్లంతా అలర్ట్ అయి లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్‌.టి.ఆర్‌ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటి నుంచి మంచినీళ్ల బిందె కూడా వచ్చేది. మంచి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.

✍️రాజకీయ ప్రవేశం:

1982 మార్చి 29 న
తెలుగుదేశం  పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు.ఎన్నికల్లో విజయం సాధించిశఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు.

పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని "అన్న"ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.
1989 ఎన్నికల్లో ఓటమి చెందారు.1994లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.తెలుగు దేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్‌టిఆర్‌  ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత  1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.

✍️బుద్ధుడి విగ్రహాం:

ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని  నెలకొల్పారు.

✍️సమయస్పూర్తి:

ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.
అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా.
దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట..
అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.

✍️ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్!

ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు.
 
✍️జూలై 7, 1988... ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం... ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ నాగభైరవ కోటేశ్వరరావు (పెళ్లికొడుకు తండ్రి)ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు.
అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబో తోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు.
వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. 
"ఆ! మేళగాళ్ళూ కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. 

✍️కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు.సప్తపది, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ పవిత్రను, పరమార్థాన్ని వివరించారు.
✍️ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా విన్నవిస్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.

✍️చిత్రజగతి, చిత్రవిచిత్ర రాజకీయ రణస్థలిలోనూ రాణకెక్కిన రాణ్మౌళి. సరస సమ్మోహన రూపం, నవ నవోన్మేష ప్రతిభా భాస్వంత చైతన్య స్వరూపం నందమూరి తారకరామ నామధేయం. ఆయన జీవితం ధ్యేయానికి  కట్టుబడినఅధ్యాయం.
నటుడు,నిర్మాత,  దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, చిత్రకారుడు. చిత్ర జీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు.

✍️ఎన్టీఆర్‌ ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం శాశ్వతం.

Monday, January 17, 2022

🦁సింహం -పులి🐯 🦁చెలిమి🐯


✍️అనగ అనగా ఒక  అడవిలో ఒక సింహం. పులి ప్రాణ స్నేహితులుగా ఉండేవి. రెండూ వేరు వేరు జాతులకు చెందినవే అయినా  వాటి మధ్య స్నేహమేమటి ? అని సందేహం కలగవచ్చు. 

✍️ అదే మరి విచిత్రం. అవి ఊహ తెలియని వయసు నుంచి అంటే పులి, సింహం అనే తేడాలేవి తెలియని వయసునుంచే స్నేహితులయ్యాయి. కాలం గడిచేకొద్దీ వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. దానికి తోడు అవి నివసించే పర్వత ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉండేది. 

✍️ ఆ సమయంలోనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన సాత్విక, ప్రశాంత వైఖరి పులి, సింహాలపై కూడా ప్రభావం చూపిందని అనుకోవచ్చు. ఇలా ఏ చీకు చింతా లేకుండా కాలం హాయిగా సాగిపోతుండగా ఒక రోజు సింహం, పులి పిచ్చాపాటీ మాట్లాడుకోసాగాయి. 
కబుర్లు అలా అలా సాగి ‘ చలి ’ వైపు మళ్ళాయి. పులి ఇలా అంది ‘‘చలి ఎప్పుడు వస్తుందో తెలుసా, పున్నమి నుంచి చంద్రుడు అమావాస్య దిశగా క్షీణించే కాలంలో చలి పెరుగుతుంది ఇలా చాలామంది అనుకోగా విన్నాను.’’ సింహం అందుకొని ‘ చాల్లే ఆపు నీ అర్థం లేని మాటలు, ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒక దారని సామెత ఉందిలే. అలా ఉంది నువ్వు చెప్పేది. అందరూ అనేది అమావాస్య నుంచి చంద్రుడు పున్నమి దిశగా వృద్ది చెందే దశలో చలి గిలిగింతలు పెడుతుందని నువ్వెక్కడ విన్నావో ఆ లోక విరుద్దమైన మాటలు అంది. అంతే ఆ రెండిటి మధ్య మాటమీద మాట పెరిగి అదొక వివాదంగా ముదిరింది. ఒకరి మాటను మరొకరు అంగీకరించటానికి సిద్దంగా లేరు. చిలికి చిలికి గాలివాన అన్న చందంగా పరిస్థితి మారింది. తామిద్దరూ మంచి మిత్రులు. ఇప్పుడీ గొడవ మొదలైంది ఇక దీనికి పరిష్కారమేమిటి ? అని ఆ రెండూ అనుకున్నాయి.

✍️వాటికి చటుక్కన సన్యాసి గుర్తుకు వచ్చాడు. ‘ ఆ! మహానుభావుడికి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి ఆయననే అడిగితే సరి’ అనుకొని రెండూ సన్యాసి దగ్గరకు వెళ్ళి, గౌరవభావంతో తలవంచి నమస్కరించాయి. ఆ తర్వాత తమ వివాదాన్ని వివరించి ‘‘ఇపుడు మీరు చెప్పండి స్వామీ వాస్తవమేమిటో’’ అన్నాయి. 

✍️అంతా విన్న సన్యాసి కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ‘ అమావాస్య నుంచి పున్నమి లోపల అయినా, పున్నమి నుంచి అమావాస్య లోపల అయినా ఎప్పుడయినా చలి రావచ్చు. కాబట్టి ఈ విధంగా చూస్తే మీ ఇద్దరి మాటలూ సరైనవే, ఎవరూ, ఎవరి చేతిలో ఓడిపోయింది లేదు. వీటన్నింటికంటే ముఖ్య విషయమొకటి మీరు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే తగవులూ లేకుండా కలిసి మెలిసి ఉండటం. ఏ రకంగా చూసినా ఐకమత్యమే ఉత్తమం.’’ సింహం, పులి ఆ మాటల అసలు అర్థాన్ని గ్రహించాయి. తమ స్నేహం చెడిపోనందుకు అవి ఎంతో సంతోషించాయి. 
✍️నీతి : వాతావరణంలో మార్పులు రావచ్చు. కానీ చెలిమి మాత్రం చెక్కు చెదరకుండా నిలుపుకోవాలి.  💐💐💐💐


దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్" భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు గారిజయంతి..💐💐💐🙏🙏🙏

✍️✍️✍️నేడు భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు "దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్" గారి జయంతి..💐💐💐





దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ ( జనవరి 17, 1905— జూలై 4, 1986) తేదీన డహాణు, బొంబాయిలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. సంఖ్యా శాస్త్రములో అనేక ఆసక్తికరమైన ధర్మాలను కనుగొన్నాడు.

కప్రేకర్ చిన్నవయసులోనే తల్లిని కోల్పోయాడు. బాల్యమంతా తండ్రి పెంపకంలోనే పెరిగాడు. విద్యార్థి దశలోనే లెక్కలలో సులభ గణనలు, ప్రహేళికలు (పజిల్స్) సాధన చేయడంలో కుతూహలం ప్రదర్శించేవాడు. మహారాష్ట్ర లోని పూనాలో ఫెర్గూసన్ కళాశాల ద్వారా బి.యస్సీ పూర్తి చేశాడు. 1927 లో చదివేటప్పుడే ఆయన రాసిన థియరీ ఆఫ్ ఎన్వలప్స్ అనే వ్యాసానికి గాను రాంగ్లర్ RP పరంజపే గణిత బహుమతి లభించింది.1929 లో ముంబై విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్స్ డిగ్రీని అందుకున్నాడు. ఆయన పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని తన కెరీర్ లో (1930-1962) తీసుకోలేదు. ఈయన మహారాష్ట్ర లోని నాసిక్ వద్ద పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన ప్రత్యేక లక్షణాలతో పునరావృత దశాంశాలు, మేజిక్ స్క్వేర్స్ (మాయా చదరాలు), పూర్ణాంకాల ధర్మాలను ఆవిష్కరించి ప్రచురించాడు.

✍️బి.యస్సీ పూర్తి అయిన తర్వాత దేవ్‌లాలీలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే తన పరిశోధనలు కొనసాగించాడు. గణిత సమాజం వార్షికోత్సవంలో ప్రతిసారీ తాను కనుగొన్న కొత్త కొత్త ఫలితాలను సభ్యుల సమక్షంలో ప్రదర్శించేవాడు. సంఖ్యల మధ్య సంబంధాలు, వాని విచిత్ర లక్షణాలు, మొదలైన కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించేవాడు. డెమ్లో నంబర్లపై ఆయన చేసిన పరిశోధనకుగాను, బొంబాయి విశ్వవిద్యాలయం వారు మూడేళ్ళపాటు ఆర్థిక సహాయం అందించారు.

✍️రిక్రేయషనల్ మ్యాథ్స్ గురించి ఆయన రాసిన అనేక వ్యాసాలు, స్క్రిప్టా మ్యాథమేటిక్స్, అమెరికన్ మ్యాథమేటిక్స్ లాంటి విదేశీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన ఇంటి ప్రవేశ ద్వారానికి కూడా గణితానంద మండలి అని పేరు పెట్టడం గణితంపై ఆయనకున్న అభిమానానికి నిదర్శనం. మార్టిన్ గార్డినర్ అనే పాత్రికేయుడి ద్వారా తాను కనుగొన్న సెల్ఫ్ నంబర్స్, కప్రేకర్ స్థిరాంకం (6174), జనరేటెడ్ నంబర్లు జగద్విదితమయ్యాయి. తన పరిశోధనల ద్వారా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న కప్రేకర్ భారత ప్రభుత్వం యొక్క ప్రోత్సాహానికి మాత్రం నోచుకోలేదు. చివరి దాకా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగిన కప్రేకర్ జూలై 4, 1986 న కన్నుమూశాడు.

✍️కప్రేకర్ ఒంటరిగా పనిచేస్తూనే సంఖ్యా శాస్త్రంలో సంఖ్యల ధర్మాలు కనుగొనడం లాంటి అనేక ఆవిష్కరణలు చేశాడు.



Sunday, January 16, 2022

🪔 కోడి రామ్మూర్తి నాయుడు గారి వర్థంతి 💐16-01-1942💐

🌹🙏ఇండియన్ హెర్క్యులెస్'  కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ,
ప్రముఖ మల్లయోధుడు, బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు గారి వర్థంతి సందర్భంగా🙏🌹

✍️గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఎగురవేశారు.

✍️మన పురాణాలలో బలానికి మారుపేరు శ్రీ ఆంజనేయాడు,మరియు భీముడు అలాగే గ్రీక్ పురాణాలలో బలానికి పేరుగాంచినవాడు హెర్క్యులస్ కాబట్టి పాశ్చాత్యులు అప్పట్లో ఇండియన్ హెర్క్యులెస్ గా బ్రిటన్ పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ల చే బకింగ్ హమ్  ప్యాలెస్  లో వారితో విందు తీసుకొని బిరుదు పొందిన మహానుభావుడు శ్రీ కోడి రామ్మూర్తి గారు ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈపేరు నేటి యువతకు అంతగా పరిచయము లేని  పేరు ఈయన ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మల్ల యోధులు పురాణాలలో భీముడి గురించి విన్నాము గాని చూసే అదృష్టము లేదు కానీ కలియుగ భీముడిగా ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు.రామ్మూర్తి నాయుడు గారు. 

కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబరు 8న జిల్లాలోని వీరఘట్టంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అప్పలకొండమ్మ, వెంకన్ననాయుడు.
కోడిరామ్మూర్తి తండ్రి పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవారు.

✍️వ్యాయామ ఉపాధ్యాయునిగా:

 రామ్మూర్తినాయుడు వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆయనకు చిన్న వయస్సు నుంచి వ్యాయాంపై ఎక్కువ మక్కువ చూపేవారు. రోజూ వేకువజామున వీరఘట్టం రాతి చెరువు సమీపాన వ్యాయామం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ రహదారిలో వెళ్తున్న ఒక వ్యక్తి కోడి రామ్మూర్తినాయుడు చేస్తున్న వ్యాయామ సాధన చూసి ముగ్ధుడై ఆయనకు యోగా నేర్పించే వారు. అప్పటి నుంచి మరింత సాధన చేసి ప్రావీణ్యం సంపాదించారు. విజయనగరంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న కోడి వెంకట్రావునాయుడు అనే తన బంధువు ఇంట్లో విద్య అభ్యాసం కొనసాగిస్తూ తనకు ప్రీతిపాత్రమైన వ్యాయామ విద్యలో అసాధారణ ప్రతిభ చూపించారు. మరింత మందికి అందించాలని భావించిన రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా విజయనగరంలోని సేవలను అందించారు.

✍️స్నేహితుడి సలహాతో #సర్కస్ కంపెనీ:

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సలహా, సహకారంతో రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంది. 1912లో మద్రాసులో సర్కస్‌ను ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి'' అని ఆయన వివరించారు.
''శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ముక్కలు చేయడం, రెండు కార్లను భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని... వాటిని కదలకుండా చేయడం, ఛాతీపై ఏనుగును ఎక్కించుని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు కోట్ల రూపాయలు సంపాదించారు". 

✍️అనేక అవార్డులు.. 

*అప్పట పూనాలో లోకమాన్య తిలక్‌ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్‌ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్‌ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. 
*హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. 
*అప్పటి వైస్రాయి లార్డ్‌ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. 
*అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్‌ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్‌ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు.   
*లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్‌ హెర్క్యులస్‌’ బిరుదునిచ్చారు. 
*స్పెయిన్‌లోని బుల్‌ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు.  
*జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. 

✍️ఇలా బయటపడింది..  

ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది.  

✍️తిలక్ ప్రోత్సహం:

పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.

✍️బ్రిటన్ రాజు,రాణి ముందు కూడా.....

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.

✍️స్పెయిన్ దేశంలో:

స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ  పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.

✍️హత్యాయత్నాలు:

రామ్మూర్తికి పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువులు కూడా పెరిగారు. బర్మాలో ప్రదర్శన ఇచ్చినప్పుడు కొందరు ఆయన్ను చంపాలనుకున్నారు. విషయం గ్రహించిన రామ్మూర్తి ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. అంతకు ముందు కూడా వేర్వేరు ప్రదర్శనల సందర్భంగా ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు బలహీనమైన చెక్కను ఛాతీపై పెట్టారు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది'' అని వివరించారు.
''మాస్కోలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆయన విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. వరుస హత్యాయత్నాల నేపథ్యంలో విదేశీ ప్రదర్శనలకు రామ్మూర్తి స్వస్తి చెప్పారు. స్వదేశంలోనే వ్యాయామం, మల్లయుద్ధంలో యువకులకు శిక్షణ ఇస్తూ గడిపారు. అప్పటీకే రామ్మూర్తి ఎన్నో కోట్ల ఆస్తి సంపాదించారు. అయితే దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఆయన సంపాదనంతా ఇచ్చేసేవారు.

✍️బ్రహ్మచారి.....

కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. స్వచ్ఛమైన శాకాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి, రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేశాడట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందట

👏బలప్రదర్శన విశేషాలు:

గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.

✍️బిరుదులు:

హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. 
*అప్పటి వైస్రాయి లార్డ్‌ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. 
*అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్‌ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్‌ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు.   
*లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్‌ హెర్క్యులస్‌’ బిరుదునిచ్చారు. 
*జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

✍️పాఠ్యాంశాల్లో చేర్చాలి: 

ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్‌ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కల్పించాలి.

✍️ఆఖరులో......

ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. 
  ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దానాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు.
కోడి రామ్మూర్తినాయుడు పుట్టిన వీరఘట్టంలో, విశాఖ, శ్రీకాకుళం పట్టణాల్లో ఆయన విగ్రహాలు పెట్టారు.




 ఏయూలో జిమ్‌కు, శ్రీకాకుళంలో స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.

🙏💐🌷🌺🌹💐🙏


✍️కనుమ పండుగ విశిష్టత*🐄🐃🐂

✍️కనుమ పండుగ విశిష్టత*
🐄సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు.*

*సంక్రాంతి మూడో రోజు పశువుల ప్రాధాన్యత పండుగ కనుమ పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటి కొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.*

*పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు.*

*వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు.*🐄🐂🐃🐏🐑🐐

*ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలనీ ఓ ఆచారం.*

*కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.*

*కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసితినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగుతాయి.*

*అందుకే తెలుగు వారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప ఆ మాట దాటకూడదనీ, ఒకవేళ కాదూ కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు అంటూ ఉంటారు.*

Saturday, January 15, 2022


Friday, January 14, 2022

🛕మకర సంక్రాంతి పండగ ప్రాముఖ్యత🌅

🌅 మకర సంక్రాంతి పండగ ప్రాముఖ్యత🛕

✍️ తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేదిల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ , పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు.

ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ , నేపాల్ , థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందునుండే పండగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు , గొబ్బమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు , కోడి పందాలు , ఎడ్ల పందాల   మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో
ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. పిండివంటల తయారికి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. అరిసెలు , పాకుండలు , సకినాలు , మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికోస్తుంది. దీనితో ఎ పడుగకైన ఖర్చుకు వెనుకాడుతరేమో కాని ఈ పండుగకు మాత్రం సందేహించారు. ఇంట్లో వున్నా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుంటారు. అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం. అందుకే దీనిని
*గాలిపటాల పండుగ* అని కూడా అంటారు.

సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేచి తలంటు స్థానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే. పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు. సేమ్య పాయసం , గారెలు , బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి , రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండివంటల రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. పితృ దేవతలకు ఈ రోజున పితృ తర్పనాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒకెత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి , కనుమ.  ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం.

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజున అందరూ కుడా వేకువజామున నిద్ర లేచి ఇంట్లో వున్నా పాత సామాను , ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలవు ఏర్పాటు చేస్తాం. చంటి పిల్లలున్న వారు రేగి పండ్లు పోసి..ముత్తైదువులందరికి వాటిని పంచుతారు. వీటినే భోగి పండ్లు అంటాం.

ఇక కనుమ  పండుగ సంక్రాంతి తరువాతి రోజు వస్తుంది. ఈ రోజు పశువులకు పూజ చేస్తారు. గంగిరెద్దు మేలంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు.  అమ్మ వారికీ దందం పెట్టు అంటూ.  సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరేద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం , మినుప గారెలు వండుకుంటారు. ముక్యంగా ఈ ముచ్చటైన మూడురోజుల పండుగకు తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి. ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏