Friday, January 14, 2022

🛕మకర సంక్రాంతి పండగ ప్రాముఖ్యత🌅

🌅 మకర సంక్రాంతి పండగ ప్రాముఖ్యత🛕

✍️ తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేదిల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ , పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు.

ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ , నేపాల్ , థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందునుండే పండగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు , గొబ్బమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు , కోడి పందాలు , ఎడ్ల పందాల   మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో
ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. పిండివంటల తయారికి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. అరిసెలు , పాకుండలు , సకినాలు , మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికోస్తుంది. దీనితో ఎ పడుగకైన ఖర్చుకు వెనుకాడుతరేమో కాని ఈ పండుగకు మాత్రం సందేహించారు. ఇంట్లో వున్నా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుంటారు. అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం. అందుకే దీనిని
*గాలిపటాల పండుగ* అని కూడా అంటారు.

సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేచి తలంటు స్థానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే. పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు. సేమ్య పాయసం , గారెలు , బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి , రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండివంటల రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. పితృ దేవతలకు ఈ రోజున పితృ తర్పనాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒకెత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి , కనుమ.  ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం.

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజున అందరూ కుడా వేకువజామున నిద్ర లేచి ఇంట్లో వున్నా పాత సామాను , ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలవు ఏర్పాటు చేస్తాం. చంటి పిల్లలున్న వారు రేగి పండ్లు పోసి..ముత్తైదువులందరికి వాటిని పంచుతారు. వీటినే భోగి పండ్లు అంటాం.

ఇక కనుమ  పండుగ సంక్రాంతి తరువాతి రోజు వస్తుంది. ఈ రోజు పశువులకు పూజ చేస్తారు. గంగిరెద్దు మేలంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు.  అమ్మ వారికీ దందం పెట్టు అంటూ.  సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరేద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం , మినుప గారెలు వండుకుంటారు. ముక్యంగా ఈ ముచ్చటైన మూడురోజుల పండుగకు తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి. ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

0 comments:

Post a Comment