Wednesday, January 26, 2022

భారత గణతంత్ర దినోత్సవం చరిత్ర

✍️భారతదేశంలో దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26నభారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. 







✍️భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
✍️జనవరి  నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణస్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
✍️1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు ,  నాయకులు ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు.
✍️దేశరాజధాని న్యూఢిల్లీలో  జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు.


🇮🇳🇮🇳 మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు ఎన్ని  ఉన్నాయి?

✍️ఎవరు సలహాతో జాతీయ జెండా మధ్యలో తెల్లరంగును జోడించారు?

భారతదేశం ప్రపంచానికి నాగరికత నేర్పిన అతి గొప్పదేశం. అటువంటి చరిత్ర గలిగిన దేశం బ్రిటీష్ వారి పాలనలో 200ల సంవ్సరాలు మగ్గిపోయింది. ఎంతోమంద్రి త్యాగాల ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలో స్వతంత్రానంతరం భారతదేశ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం ఆవిషృతమైన రోజు జనవరి 26,1950వ సంవత్సరం.  భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. అదే గణతంత్ర దినోత్సవం.  

గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.

భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.

*భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది*
*ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు*

భారత జాతీయ జెండా డిజైన్:


✍️భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య డిజైన్ చేశారు. పింగళి మొదట డిజైన్ చేసిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి. ఆయన ఈ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బెజవాడ సెషన్‌లో గాంధీజీ సమక్షంలో అందించారు. తర్వాత గాంధీ సలహాతో జెండా మధ్యలో తెల్లరంగును జోడించారు. ఆ తర్వాత చరఖా ప్రాంతంలో రాష్ట్రీయ చిహ్నం హోదాలో అశోక చక్రానికి చోటు లభించింది. భారత జాతీయ జెండా ప్రస్తుత స్వరూపాన్ని 1947 జులై 22న నిర్వహించిన భారత రాజ్యాంగ సభ సమావేశం సందర్భంగా స్వీకరించారు. భారత్‌లో 'త్రివర్ణం' అంటే భారత జాతీయ జెండా అని అర్థం.

🇮🇳అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? 

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది... కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు.అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. 
నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

✍️మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి*

✍️✍️బీటింగ్ రిట్రీట్' అనే వేడుక ఎక్కడ జరుగుతుంది?🇮🇳🇮🇳

*బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్‌లో రాష్ట్రపతి భవనం ఎదుట జరుగుతుంది. దానికి రాష్ట్రపతి ముఖ్య అతిథి. బీటింగ్ రిట్రీట్ వేడుకను గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా చెబుతారు. ఇది గణతంత్ర దినోత్సవం జరిగిన మూడో రోజు అంటే జనవరి 29న సాయంత్రం నిర్వహిస్తారు. బీటింగ్ రిట్రీట్‌లో పదాతి దళం, వైమానిక దళం, నావికా దళాల బ్యాండ్ సంప్రదాయ సంగీతం వినిపిస్తూ మార్చ్ చేస్తాయి.
✍️జాతీయ సాహస పురస్కారాలు ఎప్పుడు ప్రదానం చేస్తారు?

జాతీయ సాహస పురస్కారాలను భారత్ ప్రతి ఏటా జనవరి 26 సందర్భంగా ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు ఇస్తారు. ఈ అవార్డులను 1957 నుంచి ప్రారంభించారు. పురస్కారంలో భాగంగా ఒక పతకం, ధ్రువ పత్రం, నగదు బహుమతి అందిస్తారు. స్కూల్ విద్య పూర్తి చేసేవరకూ పిల్లలందరికీ ఆర్థిక సాయం కూడా అందిస్తారు.

గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది?

గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ దగ్గర ముగుస్తుంది.


0 comments:

Post a Comment