Sunday, January 23, 2022

సుభాష్‌చంద్రబోస్ జయంతి- దేశభక్తి దినోత్సవం🇮🇳

💐🇮🇳సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత. సుబాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా🇮🇳💐
     🇮🇳సుభాష్‌చంద్రబోస్ జయంతి- దేశభక్తి దినోత్సవం🇮🇳





✍️సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆ ఫైలులో, 100 ఏళ్ల వరకు చెప్పరు***

#భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన విప్లవ నేత. అహింసా మార్గంతో విభేధించిన ఆయన రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. రాజీనామా చేశాడు.  ఓ వైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో.. అహింసామార్గంలో పయనిస్తున్నా.. ఈ తరహా ఉద్యమాలతో పనులు జరవని తెగేసి చెప్పిన ధీరుడు.. తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపజేసి.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత. అయనే సుబాష్ చంద్రబోస్.

అహింసను తప్పుబట్టనని చెప్పిన ఆయన ఓ వర్గం అలా చేస్తూన్న క్రమంలోనే మరో వర్గమాత్రం ఎదురుతిరగి అంగ్లేయులకు తిరుగుబాటు రుచిచూపించాలని పిలుపునిచ్చాడు. కేవలం అహింసా మార్గంలోనే పనులు జరుగుతాయని వెళ్లితే.. అందుకు ఫలితం రావాలంటే ఏళ్ల సమయం వేచి చూడాలని అన్నారు. పోరుబాటే తన రూటన్నాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన ధీరుడు బోస్. స్వాతంత్ర్యం ఒకరు మనకిచ్చేదేమిటి.. మనమే తీసుకోవాలని.. అంగ్లేయులను తరమికోట్టాలని పిలుపునిచ్చిన వీరుడు బోస్.

1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారాయన. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుండే వాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ కొట్టాడు బోస్. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్ కు రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించాడు. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

#దేశానికి ఇండిపెండెన్స్ రావాలంటే.. గాంధీజీ అహింసావాదం మాత్రమే సరిపోదు… పోరుబాట కూడా ముఖ్యమని భావించాడు చంద్రబోస్. 1938లో గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా…. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పట్టాభి సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా గాంధీ భావించాడని ఓ వాదన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. 1939లో సెకండ్ వాల్డ్ వార్ వచ్చింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు.. ఇదే కరెక్ట్ టైమని భావించిన బోస్… కూటమి ఏర్పాటు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశాడు చంద్రబోస్. హిట్లర్ ను కూడా కలిశారు.

#నేతాజి స్పురద్రూపి:

ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ బాస్ ను రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్, బోస్ ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకా ఎవరికి లేదు అని జవాబిచ్చాడు.




సెకండ్ వాల్డ్ వార్ తర్వాత… బ్రిటీష్ వాళ్లు దేశానికి వదిలి వెళ్తారని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు భావించారు. చంద్రబోస్ మాత్రం… ఈ యుద్ధంలో ఆంగ్లేయులను అంతంచేయాలని చూశాడు.  కానీ.. బ్రిటీష్ సర్కార్ ఏకపక్షంగా, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఇండియా తరఫున యుద్ధాన్ని ప్రకటించాయి. దీంతో నిరసనకు దిగిన బోస్.. అండ్ టీమ్ ను జైల్లో పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. బయటికొచ్చిన బోస్ ను హౌజ్ అరెస్ట్ చేశారు. మారువేషంలో మేనల్లుడి సహాయంతో   పెషావర్ చేరుకున్నాడు. అట్నుంచి జర్మనీ చేరుకుని అక్కడ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి.. ప్రసారాలు మొదలుపెట్టాడు. 42 వరకు జర్మనీలో ఉన్న బోస్… 1943లో భారత సైన్యంలోకి వచ్చాడు. 1944 జులై 4న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ ఇచ్చిన స్పీచ్ దేశ యువతను ఉత్తేజపరిచింది. మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాను అన్నాడు సుబాష్ చంద్రబోస్.

బోస్ #ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ (Giuseppe Garibaldi) , మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ (Kemal Atatürk) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం

పుట్టుక గురించే తప్ప బోస్ మరణం ఇప్పటికీ  మిస్టరీనే. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కథనం. దీనిపైనా భిన్న వాదనలున్నాయి. అసలు ఆ రోజు ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని.. ఆయన గుమ్నానీ బాబాగా చాలా ఏళ్ల పాటు బతికే ఉన్నారని మరో ప్రచారం కూడా ఉంది. గతేడాది బోస్ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినా… వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు

#అపరిచిత సన్యాసి:

1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు
భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకలేదు.

***#సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆ ఫైలులో, 100 ఏళ్ల వరకు చెప్పరు***

 సుభాష్ చంద్రబోస్ ఎక్కడ, ఎలా మరణించారనే అంశంపై పలు వాదనలు ఉన్నాయి. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిపారు, ఏమయ్యారనే కీలక సమాచారం ఫైలు ఫ్రాన్సులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ చరిత్రకారుడు మోర్‌ ఆ సమాచారం కోరారు.

కానీ ఆ వివరాలు వెల్లడించేందుకు ఫ్రెంచ్‌ నేషనల్‌ ఆర్కైవల్‌ అథారిటీ అంగీకరించలేదు. వందేళ్ల వరకూ ఆ ఫైల్‌ను బహిర్గతం చేయరాదని అధికారులు నిర్ణయించినట్లు మోర్‌ తెలిపారు.

అందరూ భావిస్తున్నట్లు తైపే విమాన ప్రమాదంలో బోస్‌ మరణించి ఉండకపోవచ్చునని, నిజంగా బోస్‌ అక్కడే మరణించినట్లయితే టోక్యోలో ఉంచిన బూడిదకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే వాస్తవమేంటో తెలిసిపోతుందని ఆయన తెలిపారు. కానీ, డీఎన్‌ఏ పరీక్ష చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లు పరిశోధించిన తాను, ఫ్రెంచ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్‌ ప్రాంతంలోని జైలులో బోస్‌ మరణించినట్లు నిర్ధారించే స్థాయికి వచ్చినట్లు చెప్పారు.

#ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, సైగన్‌లో బోస్‌ గడిపిన కాలాన్ని తెలిపే వివరాలున్న ఫైల్‌ను అడిగితే ఫ్రెంచ్‌ అధికారులు ఇవ్వడం లేదన్నారు.

0 comments:

Post a Comment