A homepage subtitle here And an awesome description here!

Friday, December 30, 2022


Wednesday, December 28, 2022

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా.....

💐💐కరుణ..ఉదాత్తతకు,నిరాడంబరతకు మారుపేరు వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా.....




✍️డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు డిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  
కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన_టాటా.  '' సార్ , మీరు ? '' '' అవును ,  మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని౹౹ కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 
            ***        ***        ***
టాటా గ్రూప్  ఎందుకు ఆ స్థాయికి #ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !

#భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి.. #నిరాడంబరతకు మారు పేరు.. జంతువులంటే చచ్చేంత ప్రేమ.. ఒత్తిడిని అవలీలగా అధిగమించడం.. క్లిష్ట సమయాల్లో 'కీ'లక పాత్ర పోషించడం వంటి పాత్రలు పోషించడం వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే దక్కుతుంది. ఏదైనా కంపెనీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా... నష్టాల్లో ఉన్నా.. ఆయన అడుగు పెడితే చాలు అవి అన్నీ లాభాల పట్టాల్సిందే.రతన్ టాటా యువతకు #ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, సింప్లిసిటీతో ఆయన ముందుకుసాగుతున్నారు.

అది ఆయన #గొప్పతనం. అంతేకాదు తమ కంపెనీ నుండి వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం #ధానధర్మాలు చేయడం ఆయన స్వభావం. ఇప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉంటూ #సింపుల్ గా ఉంటాడు  రతన్ టాటా.

రతన్  టాటా  28 డిసెంబర్ 1937 సూరత్ లో జన్మించాడు.భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు టాటా సన్స్ మాజీ చైర్మన్. అతను టాటా గ్రూప్ చైర్మన్, 1990 నుండి 2012 వరకు, మరియు మళ్ళీ, తాత్కాలిక ఛైర్మన్ గా, అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు, మరియు దాని ఛారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో రెండు, పద్మ విభూషణ్ (2008) మరియు పద్మ భూషణ్ (2000) గ్రహీత.  అతను తన వ్యాపార నీతి మరియు దాతృత్వానికి ప్రసిద్ది చెందాడు. 

#పుట్టుకతోనే నాయకుడిగా....

దాదాపు రూ.10,000 కోట్ల టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిద్దిన ఘనత రతన్‌ది. గ్రూప్‌ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు.. దేశ పారిశ్రామిక, వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన గురించి బాగా తెల్సినవాళ్లు. 'నాకు #అలసటగా ఉంది. ఈ పని రేపు చేద్దాం' అన్న మాటలు రతన్‌ నోట #విన్నవారు లేరు.

రతన్ నావల్ టాటా చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సూని టాటా రతన్ కు ఏడు సంవత్సరాలు ఉన్న సమయంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషేడ్ జీ టాటాను దత్తత తీసుకున్నారు. అప్పటినుండి రతన్ తన అమ్మమ్మ నవాజీబాయ్ వద్ద పెరిగారు.

ఆ #ఆఫర్ ను వదులుకొని..

రతన్ టాటా యుఎస్ లోని కార్నెల్ యూనివర్సిటీలో బిఎస్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. అలాగే హర్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంటు కోర్సును కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఆయనకు ఐబిఎం సంస్థ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఎంతో మంది ఆ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. టాటా మాత్రం తిరిగి భారత్ కు వచ్చాడు. అంతేకాదు టాటా గ్రూపులో చేరాడు.

#నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి....

1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కు డైరెక్టర్ నియమితులయ్యారు. అప్పటికే ఆ సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. కానీ రతన్ టాటా ఆ కంపెనీ దశనే మార్చేశారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్లో 25 శాతం వాటా దక్కించుకుని లాభాల బాట పట్టింది.

#టాటా గ్రూప్ వారసుడిగా...

ఆ తర్వాత 1981లో టాటా గ్రూప్ వారసుడిగా రతన్ పేరును జెఆర్ డి టాటా ప్రకటించారు. అయితే ఆయన వయసు చాలా తక్కువగా ఉండటం.. ఆయనకు అంత పెద్ద బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. అయినా అవేవీ లెక్క చేయకుండా రతన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కంపెనీనీ ఎంతో విస్తరింపజేశారు. అలా ఆయన రిటైర్ అయ్యేసరికి టాటా గ్రూపు లాభాలు 50 రెట్లు పెరిగాయి.

#ధానధర్మాలు అధికమే.....

రతన్ టాటా ఎంత నిరాండంబరగా జీవిస్తారంటే.. ఆయన సాధించిన లాభాల్లో దాదాపు 65 శాతం టాటా ట్రస్టులకే విరాళం ఇచ్చేస్తారు. అలాగే ఆయన విమానాల్లో కూడా ఎకానమీ క్లాసులోనే ప్రయాణిస్తారు.

*#నిరాడంబరత:

ఒకసారి బాలీవుడ్ స్టార్ #వినోద్_ఖన్నా 
తాను రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చి క్యాన్సిల్ అవ్వడంతో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సి వచ్చింది...లగ్జరీ ఫ్లైట్ మిస్ అయింది.ఎకానమీ ఫ్లైట్ లో వెళ్లడం వినోద్ ఖన్నా కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అధికారులతో గొడవపడి వాళ్ళని తిట్టుకుంటూ.. షూటింగ్ ఉండడం వల్ల తప్పనిసరై ఎకానమీ ఫ్లైట్ ఎక్కాడు...

ఆ ఫ్లైట్ లోని ప్రయాణికులు వినోద్ ఖన్నా ని చూడగానే సంబరపడిపోయి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. ఎంతైనా ఒక సినిమా హీరో తమతో పాటూ ప్రయాణిస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. 
మొత్తానికి వినోద్ ఖన్నా చిరాకు తగ్గి తన సీట్లో కూర్చున్నాడు. పక్క సీట్లో ఒక #సాధారణమైన మధ్యతరగతి ప్రయాణికుడు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు.

అతడు #వినోద్ ఖన్నా ని కన్నెత్తి కూడా చూడలేదు. పేపర్ లో లీనమై పోయాడు. వినోద్ ఖన్నా కొంచెం ఆశ్చర్యపోయి తానే పలకరించాడు.
అతడు చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్ చదువు కోసాగాడు. వినోద్ ఖన్నా కి కొంచెం కోపం వచ్చింది. ఒక బాలీవుడ్ స్టార్ పక్కన ఉన్నాడన్న ఏ ఫీలింగూ లేదేంటి.. అనుకుంటూ మళ్ళీ అడిగాడు.. “మీరు సినిమాలు చూడరా..?” అని అడిగాడు. 

“పెద్దగా చూడనండి..”అని చెప్పాడతడు. మిడిల్ క్లాస్ వాళ్లకి సినిమాలొక్కటే కదా వినోదం.. చూడకపోవడం ఏంటి అనుకుంటూ .. “ఓహో.. అందుకే మీకు నేనెవరో తెలియలేదు.నేను బాలీవుడ్ హీరోని. నా పేరు వినోద్ ఖన్నా” అని చివరకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. 

" ఓ. ఐసీ. గుడ్ జాబ్. " అని చెప్పి అతను కూల్ గా పేపర్ మూసేసి ఏదో బిజినెస్ జర్నల్ తీసి చదువుకోసాగాడు.
వినోద్ ఖన్నాకు చాలా అసహనంగా 
ఉంది. నేనెవరో చెప్పినా కూడా ఆటోగ్రాఫ్ అడగడేంటి.. ఒక మాములు సిటిజన్ కి ఇంత పొగరా.. ఒక బాలీవుడ్ స్టార్ ని నేనే మాట్లాడుతుంటే కనీసం ఆటోగ్రాఫ్ అడగడా.. అనుకొని "మీరేం చేస్తుంటారు?" అని అడిగాడు.

"నేను బిజినెస్ మ్యాన్ ని. నా పేరు #రతన్_టాటా." అని చెప్పేసరికి వినోద్ ఖన్నా బుర్ర తిరిగిపోయింది.

ఇతను గ్రేట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్ టాటా నా.. అందుకా ఇంత హుందాగా కూర్చున్నారు. అనుకుంటూ" అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంత సాధారణమైన వస్త్రధారణలో , ఎకానమీ క్లాస్ లో ఎందుకు .. ??"
“నేనెప్పుడూ ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తాను వినోద్ గారూ. అందులో తప్పేముంది. నాకు మొదటినుండీ సామాన్యంగా జీవించడం అలవాటు.. “
అని చెప్పగా వినోద్ ఖన్నా అతని గొప్పతనానికి ఆశ్చర్యపోయి తానే అతని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు. 
గొప్పవాళ్ళ జీవనం ఎప్పుడూ నిరాడంబరంగానే
ఉంటుంది.

#పాకిస్థాన్ ను పక్కనపెట్టేశారు..

రతన్ టాటాకు దేశ భక్తి చాలా ఎక్కువే. 2011లో ముంబైలో తాజ్ హోటల్ పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దానిని బాగు చేయించేందుకు టెండర్లు పిలిచారు. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన వారికి అపాయిట్ మెంట్ ఇవ్వాలని కోరగా, వారిని అక్కడి నుండే తిట్టి పంపిచేశాడు. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం సుమోల కోసం పెట్టిన ఆర్డర్ ను సైతం పక్కన పెట్టేశారు. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేసేది లేదని తేల్చి చెప్పేశారు.

#యువతకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం...

రతన్ టాటా యువతను కూడా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. తాను టాటా కంపెనీల నుండి వైదొలిగినా కూడా తన వద్ద ఉన్న సంపదతో వివిధ స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడి పెడుతూ యువతను ప్రోత్సహిస్తాడు. ఇటీవలే ఓ కుర్రాడిని తన అసిస్టెంటుగా కూడా నియమించుకున్నాడు. ఆ కుర్రాడు చేసిన చిన్నపని తనను అంతలా మెప్పించింది అని తానే స్వయంగా చెప్పాడు.

#చవకైన నానో కారు:

కొన్నేళ్ల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ 'నానో' కారుకు నాంది. ఓ కుటుంబం స్కూటరుపై వెళ్తోంది. తండ్రి డ్రైవ్‌ చేస్తూంటే.. కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య.. ఆమె ఒళ్లో ఓ చిన్నారి.. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. ఇలాంటి చిన్న కుటుంబాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కారులో వెళ్లాలంటే.. వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా..? అదే నా ప్రశ్న. రానురాను నాలో అది బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు తేవాలనుకున్నా.. అదే ప్రకటించా.. చాలామంది నన్ను గేలి చేశారు. ఈ కల నెరవేరదని నిరుత్సాహపరిచారు. కొంతమంది అయితే రెండు స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎకసెక్కాలు ఆడారు. అయినా నేను లక్ష్యపెట్టలేదు. ఈవేళ నా కలల కారు.. ప్రజల కారు.. రూ.లక్ష కారు..

#కరోనాపై యుద్ధానికి రూ.1,000 కోట్ల భారీ విరాళం.:

టాటా వారి పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా రూ.1,500 కోట్ల మేర నిధులను కరోనా కోసం వినియోగిస్తామని తెలిపారు.

జేఆర్డీ టాటా తర్వాత సంస్థకు ఐదో #చైర్మన్​గా రతన్ టాటా ఎంపికయ్యారు.

#టాటా చైర్మన్ అయ్యాక.....

 రతన్ టాటా ఎంతో విజయవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం టాటా గ్రూప్స్ 96 వ్యాపారాల్లో ఉంది. 28 కంపెనీలు స్టాక్ ఎక్చేంజీలో ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సంస్థలు రతన్ టాటా ఉన్నప్పుడు నెలకొల్పివే.
ఖాళీ సమయాల్లో తన #ఫెరారీ కాలిఫోర్నియా కారును నడిపేందుకు రతన్ టాటా ఇష్టపడతారు.
#జేఆర్​డీ టాటా లాగే విమానయాన రంగం అంటే రతన్​కు కూడా ఎంతో ఇష్టం. ఆయనకు పైలెట్ లైసెన్సు కూడా ఉంది. ఆయన అప్పుడప్పుడూ సంస్థ విమానాన్ని నడుపుతుంటారు.

#రతన్ టాటాకు అనేక అవార్డులు....

రతన్ టాటాకు మన దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. యూకే గవర్నమెంట్ కూడా టాటాకు గౌరవ నైట్ హుడ్ ను ఆయనకు  బహుమానంగా ఇచ్చింది. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటానే.


Tuesday, December 27, 2022


Monday, December 26, 2022

స్వాతంత్ర సమరశీలి, యువతకు మార్గదర్శకుడు,ధైర్యానికి మారుపేరు ఉద్దమ్ సింగ్ గారి జయంతి సందర్భంగా🌹💐

💐🌹స్వాతంత్ర సమరశీలి, యువతకు మార్గదర్శకుడు,ధైర్యానికి మారుపేరు ఉద్దమ్ సింగ్ గారి జయంతి సందర్భంగా🌹💐





ఆరోజు 1940 జూలై 13....
 ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపా దించాడు.

ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు..అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు 
ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...
అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి.

రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు...కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు...

ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 

ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...

నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమ య్యేందుకు లేచాడు. 

అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి ,అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు....భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు.

వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆతను జనరల్ ఓడయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 

ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగి పోయాడాయువకుడు.
ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా?
 ఉద్దమ్ సింగ్ ....

 1919 ఏఫ్రెల్ 13 #పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ ..... అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.
ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో  ఏ హెచ్చరిక లేకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరపడం జరిగింది.  దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు....... అతడే
#ఉద్దమ్ సింగ్.

#ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని  గర్వంగా ప్రకటించాడు.  బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్.

#భారత స్వతంత్ర ఉద్యమంలో నిజానికి భగత్ సింగ్‌ తెలిసినంతగా.. ఉద్దమ్ సింగ్ గురించి చాలామందికి తెలియదు. భారత స్వతంత్ర్య సంగ్రామం గురించి మాట్లాడుకున్నప్పుడు కచ్చితంగా ఉద్దమ్ సింగ్‌ గురించి చెప్పుకోవాలి. అంతటి గొప్ప సాహస వంతుడు ఉద్ధమ్ సింగ్.

ఉద్దమ్‌ సింగ్ పంజాబ్‌లోని  సంగ్రూర్ జిల్లా‌లోని సునం తెహసీల్‌కు చెందిన కలన్ గ్రామంలో జన్మించాడు. 1899 డిసెంబర్ 26న ఓ పేద ఇంట్లో ఉద్దమ్ సింగ్ పుట్టాడు. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్ సింగ్. ఉద్ధమ్ సింగ్ ఓ దళితుడు.
అతని తల్లీ పేరు నారాయణ్ కౌర్ చిన్నప్పుడే చనిపోగా.. తండ్రి పేరు తెహాల్ సింగ్ కూడా 1907లో మరణించారు.
తర్వాత ఉద్దమ్ సింగ్  తన అన్న ముక్తా సింగ్‌తో కలసి అనాథశ్రమంలో చేరాడు.
                                                           అప్పుడే  షేర్‌ సింగ్‌కు #ఉద్దమ్ సింగ్‌గా పేరు మార్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఉద్దమ్ సింగ్ అన్నయ్య కూడా చనిపోయాడు. దీంతో  ఉద్దమ్ అనాథయ్యాడు.
టీనేజ్‌లోనే ఉద్దమ్ సింగ్‌కు దేశభక్తి అమితంగా ఉండేది. 
ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు.

14 ఏళ్ల వయస్సు వెయ్యి మందికిపైగా బలైన జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఉద్దమ్ సింగ్ నెత్తురును మండించింది. 1919  సంవత్సరంలో అమృతసర్‌లో జరిగిన ఈ సభకు అనాథ శరణాలయం నుంచి హాజరైన ఉద్దమ్ సింగ్ నేలమీద పడుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.
అక్కడ శవాల గుట్టలను చూసి రగలిపోయాడు.. ఆ నెత్తుటి ధారను చూసి చలించిపోయాడు. అప్పుడే ఆ రక్తమంటిన మట్టిని చేతబట్టుకుని ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిని చంపేదాక తను చావనని వాగ్దానం  చేశాడు.
అప్పటి నుంచి #జలియన్ వాలాబాగ్‌కు కారణమైన #డయ్యర్స్‌ను వెతుక్కుంటూ ఉద్దమ్ సింగ్ ముందుకు సాగాడు. అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తుపాకీ కాల్చడం కూడా నేర్చుకున్నాడు. ఉద్దమ్ సింగ్ 1940 మార్చి 13న  లండన్ కాక్స్‌టన్‌ హాల్లో  మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు. దీనికోసం ఉద్దమ్ సింగ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. పేరు మార్చుకున్నాడు.
మారువేషాలు వేశాడు. ఎట్టకేలకు డయ్యర్ ఆ కాన్ఫరెన్స్‌కు హాజరవుతాడని తెలుసుకుని.. లండన్ చేరుకుని, ఎంట్రీ పాస్ సంపాదించి.. పిస్టల్‌ను పుస్తకంలో పెట్టుకుని 
వెళ్లి.. డయ్యర్‌పై గుళ్ల వర్షం కురిపించాడు.
అనంతరం నా దేశ ప్రజల ఆత్మను భంగపరిచాడని, అందుకే వాడిని చంపానని కోర్టులో వెల్లడించాడు. అతనిని చంపాడానికి 21 సంవత్సరాలు  వేచి చూశానని అన్నాడు. తను చంపేంత తప్పు చేశాడని ప్రకటించాడు. తాను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నానని, నా దేశం కోసం మరణిస్తున్నానని అది నా బాధ్యత అని వెల్లడించాడు.తర్వాత 1940 జూలై 31న  #ఉద్ధమ్ సింగ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది.


Sunday, December 25, 2022

దేశ ఉత్తమ ప్రధానిగా..: అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా💐🌷

🌷💐మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి దేశ ఉత్తమ ప్రధానిగా..: అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా💐🌷
(Good governance day)




అటల్ బీహారి వాజ్ పేయి అందరిలా మామూలు రాజకీయ నేత కాదు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప లీడర్. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి... తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు.

1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో వాజ్ పేయి జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణదేవి, కృష్ణ బీహారి వాజ్ పేయి. తండ్రి హైస్కూల్ హెడ్ మాస్టర్. దీంతో వాజ్ పేయి ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశుమందిరంలోనే గడిచింది. అనంతరం అక్కడే విక్టోరియా కాలేజ్ లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1944 నుంచి ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్తాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన వాజ్ పేయి విభజన అల్లర్లు కారణంగా చదువకు స్వస్తి చెప్పి యూపీలో కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో వాజ్ పేయి కొంతమంది ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లారు.

1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.చైనాతో భారత్ సంబంధాలను మెరుగపర్చటానికి ప్రయత్ననం చేశాడు.

1980 ఏప్రెల్ 6న వాజ్ పేయి, ఎ‌ల్ కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆయనే.. ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. తొలి నాళ్లలో రెండు సీట్లకే పరిమితం అయిన పార్టీని 1996 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయి, అద్వానీలదే. అప్పట్లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్ పేయి
లోక్ సభలో పూర్తి మెజారిటీ రాకపోవడంతో 13 రోజులకే పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1998లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఏడీఎంకే బయటకురావడంతో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.  దీంతో 13 నెలలకే ప్రధాని పదవి నుంచి వాజ్ పేయి దిగిపోయారు. తర్వాత 1999 నుండి 2004వరకు 
ప్రధాని గా ఉన్నాడు.

దాయాది దేశం పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు మెరుగు పడేలా దౌత్య చర్యలు ప్రారంభించారు. 1999లో వాజ్ పేయి హయాంలోనే ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్ సర్వీస్ ను కూడా ప్రారంభించారు. దీంతో ఇరుదేశాల మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే కార్గిల్ వార్ కూడా వాజ్ పేయి టైంలోనే జరిగింది. 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో... కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైనికులు... భారత్ ఆర్మీ మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఇరుదేశాలకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఇరు పక్షాలు.. తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు

1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్‌తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వాజపేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్థాన్ తో నూతన శాంతి ఒప్పందంకోసం పాకిస్థాన్ ను ఆహ్వానించాడు.

వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టాడు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాడు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాడు.గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యు.పి.ఏ ప్రభుత్వం 2013, జూలై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది

"నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు", "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన" వాజపేయి అభిమాన ప్రాజెక్టులు.

2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 యేళ్లలో భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు ముందు రెండు సంవతర్సాల క్రితమే భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ఉండటం, సంవత్సరం ముందే కార్గిల్ యుద్ధం జరిగి ఉండటం, తదనంతరం పాకిస్తాన్ సైనికపాలనలోకి వెళ్ళటం వంటి సంఘటనల పూర్వరంగంతో జరిగిన ఈ పర్యటన, ప్రఛ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న పెనుమార్పులను ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల ప్రధాన ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాల అభివృద్ధికి అవలంబించవలసిన మార్గంపై, ప్రధాని వాజపేయి, అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసారు.
ఇలా ఒకటేంటి రాసుకుంటూ... చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ నుంచి వచ్చినా... బీజేపీ లీడర్ గా ఎదిగినా.. అన్నివర్గాల ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి అటల్ బీహారీ వాజ్ పేయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఎన్డీయే కూటమికి సెక్యూలర్ ఫేస్ ఇవ్వడానికి ఎంతగానో కృషిచేశారాయన. విధానాల్లో తేడా వస్తే... ఎంతటి నాయకుడ్ని అయినా.. నిలదీసే నైజం ఆయనది. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు చేయడంలోనే కాదు.. హాస్యం పండిచండంలోనూ ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల్లో... చట్ట సభల్లో మధ్యమధ్యలో కవిత్వాన్ని కలగలిపి అందరితో శెభాష్ అనిపించుకున్నారు. ఆయన వాగ్ధాటి ఎలాంటిదంటే.. భారత ప్రధానిగా ఉన్న నెహ్రూనే ఓ సందర్భంలో.. అటల్ జీ దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

వాజ్ పేయిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది బీజేపీ. *2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ వాజ్ పేయికి సముచిత గౌరవాన్ని అందించింది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది*
అంతేకాదు.. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలకు గానే.. 2015లో భారతరత్నతో సత్కరించింది. ఈ ప్రతి ష్టాత్మక పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి... వాజ్ పేయి నివాసానికి వెళ్లి మరీ అందించారు. అలాంటి మహోన్నత నేత 2009లో అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అనారోగ్య కారణాలతో అటల్ జీ 2018 ఆగష్టు 16న ఆశేష అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన ఆశయాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి.


Saturday, December 24, 2022

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి 🙏🌷

🌷🙏బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి  సందర్భంగా🙏🌷





#భానుమతి గారు పరిచయం అక్కరలేని ప్రసిద్ధ నట #శిఖామణి. ఒక్క మాటలో చెప్పాలంటే " తెలుగు సినిమా లో మహిళా #అష్టావధాని ". అవును భానుమతి గారు ఒక్క సినిమా నటి మాత్రమే కాదు, గాయని, నిర్మాత, భరణి స్టూడియో ఓనర్ , రచయిత ,సినిమా డైరెక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ .
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు.
నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

#నటిగానే కాదు... గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో మల్లెల మాలలు ఊగించింది… వెన్నెల డోలల్లో తేలించింది… భానుమతి గాత్రంలో జాలువారిన గానం వింటూ ఉంటే ఎంత హాయి!… వయసు మీద పడినా, భానుమతి గాత్రంలో ఏ మాత్రం తొణుకు బెణుకూ కనిపించలేదు… తరాలు మారినా, తన గానంలోని మాధుర్యం ఏమీ తరగలేదని నిరూపిస్తూ భానుమతి నటిగా, గాయనిగా సాగారు… మాతృభాష తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా, అభినయంతో పాటు గానంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ  సాగారు భానుమతి… నవతరం నటీమణులతో పోటీ పడి నటించడంలోనే కాదు, గాయనీమణులకూ దీటుగా గళం విప్పేవారు.

మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో #భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.

#తెలుగు వెలుగులు" శీర్షికలో.......
 
" చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు" - ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో "తెలుగు వెలుగులు" శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.

#విభిన్న కోణాలను......

కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి.

 ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో.

#బాల్యం-తొలి జీవితం:

1925 వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.

#సీనీరంగం:

1939 సంవత్సరంలో తొలిసారిగా "వర విక్రయం" అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన "కృష్ణప్రేమ", "స్వర్గసీమ" చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.

#మిస్సమ్మ సినిమాలో...

విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.

#దటీజ్‌ భానుమతి!

ఎన్టీఆర్‌ గానీ, ఏఎన్నార్‌గానీ.. సినిమాలో ఆ రోజు షూట్‌ చేస్తున్న సీన్లో భానుమతిని టచ్‌ చేయాలంటే… ముందుగా అనుమతి తీసుకునేవారు.
షూటింగ్‌ ప్రారంభం కాకముందే వెళ్లి నెమ్మదిగా "మేడమ్‌! డైరెక్టర్‌ గారు ఈ రోజు షూట్‌లో మీ భుజం మీద చేయి వేయమని అంటున్నారు.. " అని నసిగేవారట.
"అలాగా!" అంటూ భానుమతి డైరెక్టర్‌ కేసి తిరిగి, "ఏమయ్యా? చెయ్యి వేయాలన్నావుట? ఏం కాస్త దగ్గరగా నిలుచుంటే సరిపోదా? " అనేది.
డైరెక్టర్‌ కాస్త బెదురుగా… "అంటే .. అమ్మా! ఈ పాత్రలు… బావామరదళ్లు కదా? వాళ్ల మధ్య కాస్త చనువు ఉంటుంది కాబట్టి.. భుజం మీద చేయి వేస్తే.. బాగుంటుందని.. " అని నసిగేవాడు.
"'సరే. అయితే! " అనేదావిడ.
అయినా షూటింగ్ సవ్యంగా పూర్తయ్యేవరకూ ఇద్దరు మహానటులకీ టెన్షనే! తేడా వస్తే అక్కడే కొడుతుంది మరి.

#కొందరు దర్శకులయితే భానుమతి తమ చిత్రంలో నటిస్తే చాలు అని అభిలషించేవారు… అలాంటి వారు పనికట్టుకొని మరీ ఆమె కోసం కొన్ని పాత్రలు సృష్టించేవారు.

#కుటుంబం:

1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.

#అవార్డులు:

అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే... ఇప్పటిదాకా భానుమతిగారు మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు.

#దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేసిన భానుమతిగారు...  "మంగమ్మగారి మనవడు" చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను కూడా పోషించారు. రచయితగా ఆమె రాసిన "అత్తగారి కథలు" ఆంధ్రలో విశేష ప్రాచుర్యం సంపాదించాయి. ఆ కథలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.

*****   *****
(అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు.
ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు.
ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు.
అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ  ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు.
అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ.
బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం.
జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది.
"సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది.
నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు కోడలు గురించిన రచనలలో భానుమతి సృష్టి పరాకాష్ఠ.)
****       ****

#సాహిత్యం:

అంతేగాకుండా... భానుమతిగారు చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు "పద్మశ్రీ" బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు "కళాప్రపూర్ణ" బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఆమె ‘నాలోనేను’ అనే స్వీయ నవలను కూడా రచించారు. అత్తగారి కథలు, నాలో నేను,
అత్తగారూ, నక్సలైట్లూ
భానుమతి కథానికలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.

తన #బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆ రకంగా మహానటి శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయినా.. ఆమె గళం నుంచి జాలువారిన "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" గీతాలు మాత్రం ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి.
#తెలుగు చిత్ర‌సీమ‌లోనే కాదు యావ‌ద్భార‌తంలోనే భానుమ‌తి వంటి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన న‌టి మ‌రొక‌రు కాన‌రారు…. చిత్ర‌సీమ‌లో ఆమె ఖ్యాతి నిరంతరం వెలుగులు పంచుతూనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు… భానుమతి మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం…
💐🏵️

భారతీయ గాయకుడు ముహమ్మద్ రఫీ జయంతి 💐🌸

🌸💐భారతీయ గాయకుడు
ముహమ్మద్ రఫీ
జయంతి సందర్భంగా💐🌸




మహమ్మద్ రఫీ  (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980) 
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.

హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ, లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్, షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు. రఫీ, ముకేష్, మన్నాడే, కిషోర్ కుమార్, మహేంద్ర కపూర్ ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.

  ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్ బలోచ్లో జీనత్ బేగం తోడుగా పాడనిచ్చాడు.

రఫీతో జగ్గయ్య తొలి సారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు (నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపథ్యగానం చేశారు. ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు. (భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.

సోను నిగం, మహేంద్ర కపూర్, షబ్బీర్ కుమార్, మహ్మద్ అజీజ్ మరియు ఉదిత్ నారాయణ్ వంటి గాయకులు రఫీ యొక్క గానం శైలిని ప్రభావితం చేశారు. అన్వర్ (గాయకుడు) కూడా రఫీ గొంతును అనుకరించాడు.

22 సెప్టెంబర్ 2007 న, కళాకారుడు తసవర్ బషీర్ రూపొందించిన రఫీకి ఒక మందిరం UK లోని బర్మింగ్‌హామ్‌లోని ఫాజెలీ వీధిలో ఆవిష్కరించబడింది. ఫలితంగా రఫీ సాధువు అవుతాడని బషీర్ ఆశిస్తున్నాడు. ముంబై మరియు పూణే బాంద్రా శివారులోని పద్మశ్రీ మొహమ్మద్ రఫీ చౌక్ (ఎంజి రోడ్ విస్తరించి) రఫీ పేరు పెట్టారు.

2008 వేసవిలో, సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సింఫనీ ఆర్కెస్ట్రా రఫీ పునరుత్థానం అనే డబుల్ సిడిని విడుదల చేసింది, ఇందులో రఫీ 16 పాటలు ఉన్నాయి. బాలీవుడ్ ప్లేబ్యాక్ గాయకుడు సోను నిగమ్ ఈ ప్రాజెక్ట్ కోసం గాత్రాన్ని అందించారు .

జూన్ 2010 లో ట్‌లుక్ మ్యాగజైన్ నిర్వహించిన  ట్‌లుక్ మ్యూజిక్ పోల్‌లో లతా మంగేష్కర్‌తో కలిసి రఫీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ గాయకుడిగా ఎంపికయ్యారు.

గాయకుడిని మరణానంతరం భారత్ రత్న (భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం) తో గౌరవించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళాయి.

నిర్మాత-దర్శకుడు మన్మోహన్ దేశాయ్ (రఫీకి పెద్ద అభిమాని) మరియు అతన్ని అనేక విజయవంతమైన చిత్రాలలో ఉపయోగించినప్పుడు, రఫీ యొక్క స్వరాన్ని వివరించమని అడిగినప్పుడు, "ఎవరికైనా దేవుని స్వరం ఉంటే అది మొహమ్మద్ రఫీ" అని వ్యాఖ్యానించారు.

ఈ రోజు రఫీ యొక్క ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా అతని భారీ అభిమానులలో ప్రతిబింబిస్తుంది.

నేడు, రఫీ యొక్క ప్రసిద్ధ పాటలు రీమిక్స్ లేదా పున సృష్టి కొనసాగుతున్నాయి.

100 సంవత్సరాల హిందీ సినిమా జ్ఞాపకార్థం బిబిసి ఆసియా నెట్‌వర్క్ పోల్‌లో రఫీ యొక్క బహరోన్ ఫూల్ బార్సావో అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటగా ఎంపికైంది.

2001 లో, హీరో హోండా మరియు స్టార్‌డస్ట్ మ్యాగజైన్ రాఫీని "మిలీనియం యొక్క ఉత్తమ గాయకుడు" గా పేర్కొంది.

గాయకుడు మరణించిన 30 వ వార్షికోత్సవం సందర్భంగా మొహమ్మద్ రఫీ అకాడమీ 31 జూలై 2010 న ముంబైలో ప్రారంభించబడింది, భారతీయ శాస్త్రీయ మరియు సమకాలీన సంగీతంలో శిక్షణ ఇవ్వడానికి అతని కుమారుడు షాహిద్ రఫీ ప్రారంభించారు. 

అతని మరణం తరువాత, అనేక హిందీ సినిమాలు రఫీకి అంకితం చేయబడ్డాయి, వీటిలో: అల్లాహ్ రాఖా, మార్డ్, కూలీ, దేశ్-ప్రీమీ, నసీబ్, ఆస్-పాస్ మరియు హీరలాల్-పన్నాలాల్. 

నటుడు అమితాబ్ బచ్చన్‌పై చిత్రీకరించిన మరియు గాయకుడు మొహమ్మద్ అజీజ్ పాడిన 1990 హిందీ చిత్రం క్రోద్ "నా ఫంకర్ తుజ్సా" లోని పాట కూడా రఫీ జ్ఞాపకార్థం అంకితం చేయబడింది.

కార్నర్‌షాప్ రాసిన 1997 హిట్ బ్రిటిష్ ప్రత్యామ్నాయ రాక్ సాంగ్ "బ్రిమ్ఫుల్ ఆఫ్ ఆశా" లో పేర్కొన్న రికార్డింగ్ కళాకారులలో రఫీ ఒకరు.

రఫీని తన 93 వ జయంతి సందర్భంగా సెర్చ్ ఇంజన్ గూగుల్ జ్ఞాపకార్థం 24 డిసెంబర్ 2017 న తన ఇండియన్ హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను చూపించింది.

గౌరవాలు
1948 - స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ చేతుల ద్వారా ప్రదానం చేయబడింది.
1967 - భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయబడింది.
2001 - హీరో హోండా, స్టార్ డస్ట్ మేగజైన్ లద్వారా "బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం గౌరవ ప్రదానం.
2013 - CNN-IBN పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమాగా ఎన్నికయ్యాడు
🙏🌹

Friday, December 23, 2022

అపర చాణిక్యుడు, నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు శ్రీ పి.వి. నరసింహారావు గారి వర్థంతి.

💐🇮🇳అపర చాణిక్యుడు, నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు శ్రీ పి.వి. నరసింహారావు గారి వర్థంతి  సందర్భంగా🇮🇳💐





#ఆర్థికవ్యవస్థ దివాళా అంచున ఉన్న సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన #తెలుగు #కీర్తి శిఖరం. అనేక సవాళ్లను ఒంటిచేత్తో ఎదుర్కొన్న అపర చాణక్యుడు  భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 
భారతదేశ ప్రధానమంత్రిగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921న జన్మించారు. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం వీరి స్వగ్రామం. పి.వి.గా అందరికి సుపరిచితులైన వీరు 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు క్రితం రాష్ట్ర మంత్రివర్గంలో న్యాయ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1991-96 కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈ పదవి చేపట్టిన తొలి దక్షిణాది వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పలు భాషలలో నిష్ణాతులైన పి.వి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ది ఇన్‌సైడర్ పేరుతో స్వీయచరిత్రను కూడా రచించారు. రాజకీయాలలో అపర చాణుక్యుడిగ్ ఫేరుగాంచిన పి.వి. డిసెంబరు 23, 2004న మరణించారు.

#బాల్యం, విద్యాభ్యాసం:

పి.వి.నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురయ్యారు. నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రం అభ్యసించారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.

#రాజకీయ జీవితం:

1957లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి రాష్ట్రమంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

#ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా:

ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు.

#కేంద్ర రాజకీయాలలో:
లోకసభ సభ్యుడిగా పి.వి. తొలిసారి హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుంచే ఎన్నిక కాగా, మూడవసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. తొమ్మిదో లోక్‌సభకు మళ్ళీ రాంటెక్ నుంచే ఎన్నికయ్యారు. 1980-1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

#ప్రధానమంత్రిగా:

1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేనట్టయింది. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించారు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోకసభలో అడుగుపెట్టారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితిలో కూడా  తన సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవంతో ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. ఐదేళ్ళ పూర్తి పాలనా కాలాన్నినిర్వహించడం నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన భారత రాజకియాలలో అపర చాణక్యుడుగా పరిగణించబడతారు.

#సాహితీవేత్తగా:

#బహుభాషా కోవిదుడైన పీవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన "వేయిపడగలు"ను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ఈ పుస్తక అనువాదంకై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇన్‌సైడర్ రచన ఆయన ఆత్మకథ.

#అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ  పుస్తకానికి తెలుగు అనువాదం.
ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో "విస్మృత కథ" సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది.
ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. తన ఆత్మకథ రెండో భాగం వ్ర్రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే  పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

పీవీ తెలుగుతో సహా 17 #భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉండేది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచారు.
#బహుభాషా కోవిదుడిగా వాసికెక్కినా, అరవయ్యో పడిలో కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకొన్న పీవీ జిజ్ఞాస నేటి తరానికి #ఆదర్శప్రాయం.

రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కీలక పదవులు చేపట్టి, రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా లోకసభకు ఎన్నికై సాహితీరంగంలో కూడా ప్రతిభ చూపిన పీవి నరసింహరావు  2004 డిసెంబర్ 23న మరణించారు. హైదరాబాదులో నిర్మించిన అతిపొడవైన ఫైఓవర్‌కు ఆయన పేరుపెట్టబడింది.
దేశ పథగమనాన్నే అనుశాసించిన పీవీ- తెలుగు జాతి అనర్ఘరత్నం,   ఆయన ఖ్యాతి అజరామరం.
🙏

జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) సం【భారతదేశపు రైతుల విజేత' చరణ్ సింగ్ గారి జయంతి】

🔹🌴🌾జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) సందర్భంగా🌾🌴🔹
【భారతదేశపు రైతుల విజేత' చరణ్ సింగ్ గారి జయంతి】




#భారత భాగ్య విధాతా! #జీవన సౌభాగ్య ప్రధాతా! ఓ రైతన్నా నీకు మా నెనరులు! ఈ లోకాన్నీ నడిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడైతే ఆ సూర్యుని నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుని లోకంలోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించే పరోక్ష దైవాలు రైతులు. నేల తల్లిని నమ్ముకొని, పలు రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు #వ్యవసాయదారులు. 

దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న ల పరిస్థితి అతివృష్టి, అనావృష్టిల ధాటికి నేడు అతలాకుతలం అవుతోంది.. దేశానికి రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్య త ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారతవనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. 

#అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్‌ 17 నజరుపుతారు. అయితే మనదేశం తమకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో  చరణ్‌సింగ్‌ జన్మదినోత్సవాన్ని అందుకు ఎంచుకున్నారు.  చరణ్‌సింగ్‌ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. మరికొందరు నాయకుల ఆలోచనల నుంచి #భూసంస్కరణలొచ్చాయి. పేదలకు భూముల పంపిణీ జరిగింది. వ్యవసాయదారులకు అనుకూలమైన పలురకాల విధానాలను రూపొందించడం జరిగింది. రైతులను వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విడిపించి వారికి బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టేలా చేయడం వెనుక చరణ్‌సింగ్‌ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కషిచేసిన చరణ్‌ సింగ్‌ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనందపడింది.

#రైతు కుటుంబము నుంచి వచ్చి ప్రధాని పదవిని అలంకరించి,భారతదేశపు రైతుల విజేత "గా చెప్పుకునే చరణసింగ్‌ జన్మదినమైన డిశంబరు 23ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవంగా (కిసాన్‌ దివస్‌) జరుపుకుంటోంది భారతదేశం.

1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ #భారతదేశ 5వ #ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు.

#కార్యక్రమాలు:

రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

#రైతు సమస్యలపై అవగాహన:

కిసాన్ దివస్‌ను జరుపుకోవటంలో ప్రధాన ఆంతర్యం ఏడాదిలో ఒక్కరోజైనా అన్నదాతల కష్ట సుఖాలు, బాగోగులపై చర్చ జరిగి, వాటిపై సామాన్యులకు అవగాహన కల్పించటమే. రోజంతా శ్రమించే రైతన్నల గురించి కిసాన్ దివస్ రోజు అవగాహన కల్పిస్తారు. రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈరోజు దృష్టిసారించేలా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

#రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి " చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం"గా నామకరణం చేసారు. మీరట్ లోని విశ్వవిద్యాలయానికి "చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం"గా పేరు పెట్టారు. ఎటావా జిల్లాలోని కళాశాలకు " చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల"గా నామకరణం చేసారు. బులంద్‌షహర్ జిల్లాలో ఒక ఆసుపత్రికి అతని పేరు పెట్టారు.

#ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం:

గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం రోజైన జులై 08 ను రాష్ట్ర రైతు దినోత్సవంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 లో ప్రకటించింది.

#వివిధ దేశాలలో రైతు దినోత్సవాలు:

Pakistan - December 18
America - 12 October
Ghana - First Friday of December
India - December 23
Zambia - First Monday Of August.

మన #భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
🙏🔹🌾🌴🔹🙏

Thursday, December 22, 2022

ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి.

💐💐అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టలను  ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా💐💐




(నేడు #జాతీయ #గణితశాస్త్ర దినోత్సవం)

#అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టలను  ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్.
20వ శతాబ్దపు గణిత మేధావుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు
 ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వినియోగించగా.. మనదేశం నుంచి అటువంటి గొప్ప గుర్తింపు పోందిన వ్యక్తి రామానుజన్. 

 శ్రీనివాస #రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.

ఒకసారి ఓ #ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుందని చెబితే– ఈ నియమం సున్నాకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే డిగ్రీ స్థాయి గణిత పుస్తకాల్లోని త్రికోణమితి, ఆయిలర్‌ సూత్రా ల్లో నిక్లిష్ట సమస్యలను సులువుగా సాధించేవాడు.

#గణిత శాస్త్రజ్ఞులచే గుర్తింపు:

         అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తు చేసుకున్నాడు.

“ ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమాన పరచలేను ”
తరువాత రామస్వామి రామానుజన్‌కు కొన్ని పరిచయ లేఖలు ఇచ్చి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్ది మంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడ్డాడు. అసలు అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి, అతని రచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.

దేశం #గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్ జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు.

కుంభకోణంలోని #ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్‌ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు.

1909లో జానకి అమ్మాళ్‌ను అనే మహిళను రామానుజన్ వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశాడు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన #కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

మహా #మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼ గా లెక్కించారు.  

#మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33 వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.

వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. 
 భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా #హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు: నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య; రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని దాన్ని ఈ విధంగా విశదీకరించారు 1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీక్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం.

#శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం విశేషం.

#రామానుజన్ పై ఇతర గణిత శాస్త్రవేత్తల అభిప్రాయాలు:

        రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గౌస్, జకోబి మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం..

#రామానుజన్ నిధి:
తన ప్రారంభ మరియు అకాల మరణం తరువాత, రామానుజన్ భూమిపై అతిపెద్ద వజ్రం కంటే అమూల్యమైన నిధిని విడిచిపెట్టాడు --- అతని మూడు నోట్బుక్లు మరియు కొన్ని కాగితపు స్క్రాప్లు 3900 సమీకరణాలు, సారాంశాలు మరియు ఫలితాలను కలిగి ఉన్నాయి. అయితే, వారితో ఎటువంటి రుజువు లేదు. ఇప్పుడు కూడా, దాదాపు 100 సంవత్సరాల తరువాత, శాస్త్రవేత్తలు మరియు పండితులు ఆయన రచనల ఆధారంగా పరిశోధనా పత్రాలపై పనిచేస్తున్నారు.

సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక #తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను #జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 22 ఐ.టి దినోత్సవంగా జరుపుతున్నారు.

#మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర  కొనసాగుతుంది.
🙏

Sunday, December 18, 2022

💐💐నిజాయితీకి, నిర్భీతికి మారుపేరు "గరిమెళ్ళ సత్యనారాయణ" గారి వర్థంతి 💐💐

💐💐తెల్లదొరలను వణికించిన 
తెలుగు పాట...............
నిజాయితీకి, నిర్భీతికి మారుపేరు "గరిమెళ్ళ సత్యనారాయణ" గారి వర్థంతి సందర్భంగా💐💐






" మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి.

దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మేగేది. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడిపెట్టిన మేటి కవి గరిమెళ్ళ జన్మదినం నేడే. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కానేరదు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.

ఆ తరువాత... జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ "మా కొద్దీ తెల్లదొరతనం" పాటను రాశారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా, ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట.

గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. అయితే, ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు.

‘‘పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి...
ఉప్పు ముట్టుకుంటే దోషమండి
నోట మట్టి కొట్టి పోతాడండి
అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి...’’
అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు. జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు.

 కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రెండు సంవత్సరాల జైలు శిక్షపడటంతో జైల్లో ఉండగా 1923లో ఆయన తండ్రి మరణించారు. అయితే గరిమెళ్ళ క్షమాపణ చెబితే, తండ్రిని చూసేందుకు వదిలిపెడతామని అన్నారట బ్రిటీష్ అధికారులు. అయితే దేశభక్తి జీర్ణించుకుపోయిన గరిమెళ్ళ క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు.

జైలునుంచి విడుదలయ్యాక చాలాచోట్ల ప్రజల సన్మానాలందుకున్న గరిమెళ్ళ, వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. భార్య మరణంతో రెండో వివాహం, అప్పులు, ఆస్తుల అమ్మకం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆపై ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ, శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి 18 పుస్తకాలు అచ్చు వేయించారు.

1921 లో గరిమెళ్ళ "స్వరాజ్య గీతములు" పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నా ఆయన తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు.

జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్న గరిమెళ్ళ , గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా చేరారు కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో, ఆనందవాణిలో, మరికొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు.

‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అనే జాషువా గారి మాట గరిమెళ్ల సత్యనారాయణ గారికి అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. 

చివరిదశలో పేదరికం బారిన పడ్డ గరిమెళ్ళకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి.

ఒక కన్ను పోగొట్టుకుని, పక్షపాతం బారిన పడ్డ ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలం యాచన మీద కూడా బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి గరిమెళ్ళ చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవిస్తూ... 1952 డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు.


Friday, December 16, 2022

స్వాతంత్ర్య సమరయోధులు చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తి రాజు గారి జయంతి సందర్భంగా

🌷🙏1800 ఎకరాలు దానం చేసిన దాత,68 విద్యాసంస్థలను స్థాపించిన విద్యా దాత,ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు, విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, కొల్లేరు రాజుగా గుర్తింపు పొందిన, స్వాతంత్ర్య సమరయోధులు
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు గారి  జయంతి  సందర్భంగా.....🙏🌷






#చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రముఖ #గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు.
1800 #ఎకరాలు దానం చేసిన దాత-సర్వోదయ ఉద్యమానికి చేయూత-ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక-ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు-నిడమర్రు, విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు.పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు.ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు

ఈయన పశ్చిమగోదావరి జిల్లా చిననిండ్రకొలను గ్రామంలో 1919 డిసెంబర్ 16న బాపిరాజు మరియు సూరయ్యమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ మూర్తిరాజు గారి ధర్మపత్ని సత్యవతి దేవి గారు. వీరి పుట్టినిల్లు మొగల్తూరు. నారాయణపురంలో ప్రాథమిక విద్య, తణుకులో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు.

సర్దార్ దండు నారాయణరాజు గారి దేశ భక్తి, సమాజసేవా భావాలు మూర్తిరాజులో బలంగా నాటుకున్నాయి. తణుకు స్కూలులో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థికార్యదర్శిగా ఉండి స్వదేశీ దుస్తులు ధరించి, ఖద్దరు టోపీ ధరించి స్కూలుకి వెళ్ళేవారు. కర్రసాము విద్యను అభ్యసించిన వీరు దినచర్యలో కూడా ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ వంటి నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితులై చైతన్యబాటను ఎన్నుకొన్నారు.

1942 లో #క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉద్యమ కార్యకర్తలకు చేదోడు వాదోడై నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా బోర్డు సభ్యునిగా పోటీలేకుండా ఎన్నికైయ్యారు. ఇదే మూర్తిరాజుకి మచ్చలేని రాజకీయ జీవితానికి రంగప్రవేశం అయ్యింది. 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 1955 లో  వీరు తిరిగి 1955 లో విజయాన్ని అందుకున్నారు. 1961 లో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ, ఆర్యనాయకం చౌదరి, శంకర్ రావ్ దేవ్ వంటి నాయకులు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

#హరిజనులకోసం కాలనీలను, పేదలకోసం ఇళ్లను, బాటసారుల కోసం విశ్రాంతి గృహాలను, భూదాన యజ్ఞానికి అనేక ఎకరాలను, అనేక విద్యాసంస్థలకు స్థల భవనాలను దానం చేసిన అపర కర్ణుడు.

**#మూర్తిరాజు తన తండ్రిగారి పేరిట చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థను స్థాపించి ఉన్నత ఓరియంటల్, ప్రాథమిక, #జూనియర్, డిగ్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 68 విద్యాసంస్థలను స్థాపించారు. భారతీయ కళా పరిషత్తును స్థాపించి #కళాత్మకమైన సేవలను అందించారు **

#కొల్లేరు ప్రాంత రైతంగానికి సేవలందించారు.
జీవితం.. #ప్రజాసేవకే అంకితం: 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మూర్తిరాజు తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ ప్రభావం ఆయనపై పడింది. చివరి వరకు ఆయన నిజమైన గాంధేయవాదిగానే ఉన్నారు. మహాత్మాగాంధీ దేశ పర్యటనలో భాగంగా 1929లో జిల్లాకు వచ్చినప్పుడు చేబ్రోలు రైల్వేస్టేషనులో ఆయనను చూశారు. అప్పటి నుంచి గాంధీ మార్గంలోనే నడిచారు. 
గాంధేయవాదిగా ముద్ర వేసుకొని సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. 1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు.

#విద్యారంగంపై తిరుగులేని ముద్ర:

 విద్యారంగంలో మూర్తిరాజు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. 

#మానవత్వం పరిమళించే గొప్ప దాతృత్వం కలిగిన మూర్తిరాజ గారు  81 పాఠశాలల్లో 61 పాఠశాలకు తన సేవాసంస్థ ద్వారా ఖర్చుపెట్టి ఆయన యావాదాస్తిని దారబోసారు. 
రాజకీయాల్లో ఉన్నా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి, తప్పు చేస్తే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా ప్రశ్నించేవాడు.

#తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరూ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.. నేడు సినీరంగంలో ప్రముఖ హాస్య నటునిగా కొనసాగుతున్న ఎంఎస్‌ నారాయణ, పురాణ వ్యాఖ్యాత మైలవరపు శ్రీనివాసరావు ఆయన నెలకొల్పిన పాఠశాలల విద్యార్థులే. ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ ఆయన స్థాపించిన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. మాజీ మంత్రులు దండు శివరామరాజు, మరో మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజులు ఆయన శిష్యులే.

#గాంధేయవాది అయిన వీరు చిననిండ్రకొలనులో గాంధీజీ స్మారక భవనాన్ని నిర్మించారు. 1964 లో ఫిన్ లాండ్ ప్రపంచ శాంతి మహాసభలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు. 1971 లో మార్కెటింగ్ శాఖామాత్యులుగా, 1972 లో దేవాదాయ శాఖామంత్రిగా,  వైద్య శాఖా మంత్రిగా సేవలందించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన శ్రీ బుద్ధరాజు వరహాలరాజు గారు తన 'శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము' లో ఈయన గురించి వ్యాసము రచించారు. ఈయన 2012 నవంబర్ 12 న కాలం  చేశారు.


Thursday, December 15, 2022

ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గారి వర్థంతి

💐💐ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గారి వర్థంతి సందర్భంగా....💐💐




      

46 మంది #దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు. అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు

#భోజన విరామ సమయంలో, న్యాయమూర్తి అతనిని "స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది" అని అడిగారు. న్యాయవాది "నా భార్య చనిపోయింది" అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు "అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు ".         న్యాయవాది అన్నారు…. "నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను". ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయవాది మరెవరో కాదు,  సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
***  ***  ***    ***  ***

#ప్రపంచానికి విజ్ఞానం పరిచయం చేసిన "వేద భూమి" దుష్టుల పాలనలో విభజింపబడి 'వేదన'కు గురైతే భరతమాత ముద్దుబిడ్డ సర్ధార్ వల్లభాయ్ పటేల్ అకుంటిక కార్యదక్షతతో 550 సంస్థానాలను ఒక్క తాటిపై నిలిపి భారతదేశ ఐకమత్యం ప్రపంచానికి చాటారు.

గుజరాత్‌ రాష్ట్రంలోని ‘నడియాడ్‌లో 1875 అక్టోబర్‌ 31వ తేదీన జవేరాబాయి పటేల్‌, లాడ్‌బాయి దంపతులకు, నాలుగవ సంతానంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మించాడు. పటేల్‌ తన 6వ ఏటనే కరమ్‌సాద్‌లోని ఒక గుజరాతీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభమయింది. కానీ ఆయనకు ఆంగ్ల విద్యనభ్యసించాలనే ఉబలాటం ఉంది. ఆ పరిస్థితిలో అదృష్టం అతని ఇంటి తలుపు తట్టినట్టయింది. తన ఊరిలోనే ఒక ప్రైవేటు ఆంగ్ల పాఠశాల స్థాపించబడింది. మూడు సంవత్సరాలు ఆ పాఠశాలలో విద్యార్జన చేసాడు. పిదప పెట్లాడ్‌ గ్రామంలో పటేల్‌ తన ఊరివారైన ఆరుగురు విద్యార్థులతో ఒక వసతి గృహాన్ని ఏర్పరుచుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించడం, అందుకోసం ఎంతటివారితోనైనా తలపడటం పటేల్‌కు చిన్ననాటి నుండి ఉన్న గుణం.

కేవలం #తిరుగుబాటుతత్వమే గాక అవసరమైనప్పుడు తోడ్పడే సుగుణం కూడా పటేల్‌లో ఉంది. పటేల్‌కు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్‌ పూర్తయింది. న్యాయవాదిగా జీవితం సాగించాలనే కాంక్ష ఉందిగానీ యల్‌.యల్‌.బి. పూర్తి చేయాలంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. అంతటి తీరికగాని ఆర్థిక స్థోమతగానీ తనకు లేదు. పుస్తకాలను స్థానిక న్యాయవాదుల వద్ద అడిగి తెచ్చుకొని 3 సంవత్సరాలు నిర్విరామ కృషి సల్పి ప్లీడర్‌ పరీక్ష పాసయ్యాడు. వకీలుగా ఆయన గోద్రాలో రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేసారు. కొద్ది రోజులలోనే ఆయన క్రిమినల్‌ లాయర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.

#పోలీస్‌లు తెచ్చే కేసులలో ఆయన ముద్దాయిల తరఫున వాదించేవారు. వారు తెచ్చే దొంగ సాక్షులను తన ప్రశ్నల పంరపరతో తికమక పెట్టి ముద్దాయిలను విడుదల చేయించేవారు. స్వాతంత్య్రం వచ్చేసరికి దేశం రెండు ప్రాదేశికాలుగా చీలిపోయింది. అందులో ఒకటి బ్రిటిష్‌ సామ్రాజ్యం ఆధీనంలో ఉండగా సంస్థానాధీశుల ఏలుబడిలో ఉంది. సంస్థానాధీశులలో చాలా మంది దేశభక్తులు జాతీయవాదులు ఉన్నప్పటికీ, వారిలో ఎదురు తిరిగినవారు కూడా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పుదుచ్చేరి, యానాం, కరైకాల్‌, డయ్యూ, డామన్‌ వంటి ప్రాంతాలు పరాయి ప్రాంతాలు పరాయి దేశాల పాలనలో ఉండేవి. ముఖ్యంగా శతాబ్దాల నుండి అనువంశిక పాలనలో ఉన్న సంస్థానాలను భారత్‌ యూనియన్‌లో విలీనయమ్యేటట్లు చేయడంలో పటేల్‌ సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు అమోఘం.

 #భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి #ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.

దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో #హోంమంత్రిగాను, ఉప #ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

స్వాతంత్య్రం వచ్చిన(1947) తొమ్మిదేళ్లకుగానీ రాష్ట్రాల పునర్వవస్థీకరణ జరగలేదు. బ్రిటిష్‌ పాలనలో మద్రాస్‌ కలకత్తా బొంబాయి ప్రావిన్స్‌లు ఉండేవి. మన రాష్ట్రానికి చెందిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు, ప్రావిన్సులను తెలంగాణా ప్రాంతం నైజాం పాల నలో ఉండేవి. అమర జీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో మద్రాసు ప్రావిన్సు నుంచి ‘కర్నూలు రాజ ధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంకోసం స్వాతంత్య్ర సమరంలో భాగంగా ఉద్యమం సాగింది. తెలుగు వారందరిని కలిపి వుండేందుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ఆనాడు అన్ని ప్రాంతాల వారిలోనూ ఉంది.

#తెలంగాణా యోధులు అంతా ఎవరి పరిధిలో వారు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు, కష్టనష్టాలకు ఓర్చి నిరవధికంగా ఉద్యమాలు సాగించడం వలననే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. వారి కృషికి కేంద్రంలో సర్దార్‌  పటేల్‌ తీసుకున్న చర్యలను ఎంతో దోహదం చేసాయి. ముఖ్యంగా సంస్థానాధీశులను ఒప్పించడంలో పటేల్‌ చూపిన ముందుచూపు, సమయస్ఫూర్తి, పట్టువిడుపుల వైఖరి నభూతో నభవిష్యత్‌.మహాత్మునికి అనుసరునిగా స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి పటేల్‌ సారథ్యం వహించారు. జీవితాంతం గాంధీజీ ఆశయాలకు కట్టుబడి దృఢదీక్షాధ్యక్షునిగా స్వరాజ్య సాధనా సమరానికి అంకితమయ్యారు. దేశ సేవా తత్పరునిగా సర్వస్వం త్యాగం చేసి బ్రిటిష్‌ నిరంకుశ ప్రభుత్వం పారదోలడానికి అనుక్షణం శ్రమించారు.

#బాగ్దోలి ఉద్యమనేత 1931న కరాచి కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కినిస్టిట్యూంట్‌ అసెంబ్లీ వివిధ కమిటీల చైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. స్వాతంత్య్ర అనంతరం నవభారత ఐక్యతా, సమగ్ర జాతి నిర్మాతగా ఉక్కుమనిషిగా జాతీయ అగ్రశ్రేణి నేతగా ఆరాధ్యనీయుడయ్యా రు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్య్ర సర్వాధిపత్య రాజ్యంగా పాలించాలనే రాజ్యకాంక్ష దాహంతో విర్రవీగి ఎదురు తిరిగిన నైజాం నవాబు 1948 సెప్టెంబరు 13, 18 తేదీల పోలీస్‌ చర్యకు లొంగి తలవంచి, ఇండియన్‌ యూనియన్‌కు దాసోహం ప్రకటించడం పటేల్‌ రాజనీతిజ్ఞతకు, ఉక్కుమనిషి సర్దార్‌ దీక్షాదక్షతలకు నిదర్శనం.నవభారత నిర్మాత, సుస్థిర రక్షకుడు, భారతజాతి ప్రియతమ నాయకుడు ఉక్కుమనిషి కార్యశూరుడైన పటేల్‌ తన 75వ ఏట 1950 డిసెంబరు 15వ తేదీన స్వర్గస్తులయ్యారు.

#ఆయన చివరి కోరిక ప్రకారం బొంబాయిలోని ”క్వీన్స్‌ మేరి శ్మశాన వాటికలో ఆయన పవిత్ర దేహాన్ని దహనం కావించారు. అగ్నిదేవుడా! శరీరాన్నాహుతి గొనేవేళ లక్షోప లక్షల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రధాని నెహ్రూ తన కుడి భుజం పడిపోయినట్లుగా ఎంతగానో వాపోయారు. నేటికీ దేశం ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పు డు ‘ఈ సమయంలో #పటేల్‌ ఉంటే ఎంత బావుండేదో అనేమాట ప్రజల నాలుకలపై ఆడుతుంటుంది. కాశ్మీర్‌ సమస్య తలెత్తినప్పుడల్లా భారత్‌ ప్రజలు పటేల్‌ను జ్ఞాపకం చేసుకోని భారతీయులుండరు.

#బిరుదులు
1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

#ఐక్యతా ప్రతిమ:

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధింతి

🌷🙏 ఆంధ్రరాష్ట్ర అవరతణకు మూలపురుషుడు......
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్థంతి సందర్భంగా 🙏🌷





##పొట్టి శ్రీరాములు గారు భారతదేశ మెర్కాటరా??##

***భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది #శ్రీరాములేనా?***

@@ #ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ.. శ్రీరాములు గారి గురించి  ఏమన్నాడు?@@

##శ్రీరాములు గారి గురించి గాంధీజీ  ఏమన్నాడు?##
....     .....      .....     .....      .....

#ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు #అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన #మహనీయులు పొట్టి శ్రీరాములు.

#బాల్యం-తొలి జీవితం:

పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. జీతం నెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ మరణించాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమంచేరాడు.

#స్వాతంత్ర ఉద్యమంలో:

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి చెప్పబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ గాంధీ ఆదరాన్నీ చూరగొన్నాడు.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులోయెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 

#ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష:

1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

*#గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి.

##శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు.##

1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.

#జీవితం చివరిదశలో.....

జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడలో వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.

#ప్రత్యేక  రాష్ట్ర సాధన కొరకు #నిరాహారదీక్ష:

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రదేశానికి కూడా మద్రాసు రాజధానిగా వుండేది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.
ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.
చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంఏర్పరచారు. 
తర్వాత 1956 నవంబర్ 1 న.తెలంగాణ తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

*#ప్రముఖ రచయిత, చరిత్రకారుడు #రామచంద్ర గుహ.. శ్రీరాములు గురించి ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు.. *

*#దురదృష్టవశాత్తూ ఆంధ్రా బయట ఆయనొక మర్చిపోయిన వ్యక్తి. భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై శ్రీరాములు గణనీయమైన  ప్రభావం చూపారు. ఆయన దీక్ష, దాని తదనంతర పరిణామాలు.. భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పునఃచిత్రీకరించాయి. పొట్టి శ్రీరాములు భారతదేశ #మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు.‘‘**

***#భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?***

భాషాప్రయుక్త రాష్ర్టాలకు బీజం వేసిన వ్యక్తి  పొట్టి శ్రీరాములే అని మేధావుల అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భారతదేశంలో అనేక భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడినాయి.

#శ్రీరాములు మరణానికి కారకులెవరు?..

పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు.(ఆంధ్రపత్రిక)

#మరణించాక మరీ దారుణం ఎదురైంది:

ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు.
శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు.

#పొట్టి శ్రీరాములు #ప్రశంస:

*తపాలాశాఖ 2000లోపొట్టి శ్రీరాములు గుర్తుగా తపాలాబిళ్ళనువిడుదల చేసింది.
*మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.

*ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.

* *నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

#ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు.



Monday, December 12, 2022

రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వర్థంతి

🌷🙏రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వర్థంతి సందర్భంగా🙏🌷





#ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019)ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి

#బాల్యం, విద్యాభ్యాసం:

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు) విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణంలోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతికశాస్త్రంలో బి.యస్‌సీ (ఆనర్స్) చేశారు.

#ఉద్యోగం:

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో ఈ పత్రికకు మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు.

#రచనా ప్రస్థానం:

మారుతీరావు రాసిన తొలి కథ ‘ఆశాజీవి’. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక ‘రేనాడు’లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.

విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదో అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన ‘అనంతం’ ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు.

#ప్రధానమంత్రి రక్షణ నిధికి....

‘మనస్తత్వాలు’ నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషన్‌కు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి.. చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.

#వందేమాతరం’:

చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం ‘#వందేమాతరం’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. ‘పథర్ కే అన్సూ‘ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించారు.

#రచనలపై పరిశోధన:

ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన ‘కళ్ళు’ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎం.ఫిల్, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

#వివాహం:

మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు.

#సినిమా ప్రస్థానం:

1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు.

#కుటుంబం:

వీరికి ముగ్గురు మగసంతానం. పెద్ద కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. 

#గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు:

మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ: 1.50 లక్షలు నగదు బహుమతినీ, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా రూ: 15 వేలు గొల్లపూడి మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహుమానం అందిస్తున్నారు. సునీల్‌దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యాంబెనగల్, జావెద్‌ అక్తర్, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ఇందులో ప్రసంగించిన ప్రముఖుల్లో ఉన్నారు.

#అవార్డులు:

మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఆరు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

#నంది అవార్డులు:

1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకి ఉత్తమ రచయితగా

1983లో ‘తరంగణి’ సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా
1989లో ‘కళ్ళు’ అనే రచన సినిమాగా వచ్చింది.. దానికి ఉత్తమ రచయితగా
1991లో ‘మాస్టారి కాపురం’ సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా
1994లో ‘ప్రేమపుస్తకం’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి.

2019, డిసెంబరు 12న మరణించాడు. వారి బహుముఖ ప్రజ్ఞత్వం గురించి ప్రత్యేకంగా పత్రికలు ప్రచురించాయి.

Sunday, December 11, 2022

భారతీయ సంగీత హిమశిఖరం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి వర్థంతి 💐💐

💐💐భారతీయ సంగీత హిమశిఖరం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి  గారి వర్థంతి సందర్భంగా💐💐






#కర్ణాటక సంగీత ఝరి..ఎన్నటికీ వాడని మల్లెల సౌరభ సంగీత సుగంధం..ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి.... సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతుంది.
శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ దే......
కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె #భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ #మెగసెసే పురస్కారం పొందిన తొలి #భారతీయ సంగీత కళాకారిణి.

#బాల్యం-తొలి జీవితం:

#కర్ణాటక సంగీత ఝరి ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి. తమిళనాడు రాష్ట్రం మదురైలో 1916 సెప్టెంబరు 16న న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్‌, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌కు సుబ్బలక్ష్మి జన్మించారు. బాల్యంలోనే పాఠశాలకు వెళ్లడం మానేసిన ఆమె - అక్క, అన్నయ్యలతో కలిసి ఇంటివద్దే చదువు, సంగీతసాధన చేసేది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌వద్ద, తరువాత హిందుస్థానీ సంగీతాన్ని పండిత్‌ నారాయణరావు వ్యాస్‌వద్ద శిక్షణ తీసుకున్నారు. పదేండ్ల వయస్సులో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ గుడిలోని వందస్తంభాల హాలులో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.మొత్తం పది భాషల్లో సుబ్బలక్ష్మి పాడారు. అయితే ఏభాషలో పాడినా.. అది తన మాతభాషలో పాడినట్టుగా భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం మరో విశేషం.స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్‌ పత్రిక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సదాశివన్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేండ్లపాటు నాలుగు తమిళ సినిమాలు, వీటిలో మీరాబాయిని హిందీలో రీమేక్‌లోనూ నటించారు. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే.

భారత సాంస్కతిక రాయబారిగా లండన్‌, న్యూయార్క్‌, కెనెడా, తూర్పుతీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివం మరణం తరువాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు.

#మహాత్మాగాంధీ, ప్రశంసించిన మహనీయురాలు సుబ్బులక్ష్మి:

#మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.

#సంగీత సామ్రాజ్ఞిగా:

సుబ్బలక్ష్మి గాత్ర మాధ్యుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా, ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెను వచ్చి వరించాయి. 1998లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో దేశంలో మొదటి సారి ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ దే.

సేవాసదనం' అనే చిత్రం ద్వారా సినీ గాయకురాలిగా పరిచయం అయిన సుబ్బులక్ష్మి 1940లో 'శకుంతలై' అనే చిత్రంలో గాయకురాలిగా తెరపై కనిపించారు. అంతేకాదు 1945లో "మీరా" అనే చిత్రంలో మీరాబాయిగా నటించి జాతీయ గుర్తింపు పొందారు. ఇందులో ఆమె నటనకు ప్రపంచస్థాయి ప్రశంసలు అందాయి.

#ఐక్య రాజ్య సమితిలో #పాడిన #గాయనిగా చరిత్ర

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.

#ఒక వృద్ధురాలు కోసం కచేరీ:

ఒకసారి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు.గేటు బయట ఒక వృద్ధురాలు సుబ్బులక్ష్మిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మి విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు. ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ఆమె మీ కచేరి చూద్దామని 10 మైళ్ళ నుండి నడుచు కొనివచ్చాను. నా దురదృష్టంకొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు అంది. 
 సుబ్బులక్ష్మి ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా సుబ్బులక్ష్మి ఆ ముసలావిడ ఒక్కదాని కోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు. ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ.#ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, #మానవీయమైన #సుగుణసంపత్తి గల వ్యక్తి.

#ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం అజరామరం......

#సుబ్బులక్ష్మి పాడుతుంటే
స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.
మైమరచిపోయేవారు.కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.

#పురస్కారాలు:

#ఎక్కని స్టేజిలేదు.. పాడని కృతిలేదు.. పొందని పురస్కారం లేదు.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఆమె స్వరానికి నీరాజనాలు పట్టాయి. అలాగే ప్రపంచ కర్ణాటక సంగీతంలో మ్యూజిక్ అకాడెమీచే సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రపుటలకెక్కారు. ఫిలిప్పైన్ ప్రభుత్వం రామన్ మెగసెసె అవార్డు కూడా అందించింది. 
అలాగే ఎస్వీ విశ్వవిద్యాలయంతోపాటు పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 

#ప్రపంచ స్థాయిలో ఒక శకాన్ని రూపొందించి ఆబాలగోపాలాన్ని మెప్పించిన ఆ స్వరం 2004 డిసెంబర్ 11న చెన్నైలో మూగబోయింది. అయినా ఇప్పటికీ ప్రతి ఇంటా తెల్లవారు జామునుంచే "కౌశల్యా సుప్రజా రామా" అంటూ ఎంఎస్ స్వరం సంగీత జల్లులు కురిపిస్తూనే ఉంటుంది.