💐🌹స్వాతంత్ర సమరశీలి, యువతకు మార్గదర్శకుడు,ధైర్యానికి మారుపేరు ఉద్దమ్ సింగ్ గారి జయంతి సందర్భంగా🌹💐
ఆరోజు 1940 జూలై 13....
ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం ఆయువకునికి అందింది... వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపా దించాడు.
ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో ఫిస్టల్ దాచాడు..అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు
ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...
అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి.
రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు...కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు...
ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు.
ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...
నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ అప్రమత్తమ య్యేందుకు లేచాడు.
అంతే ఆయువకుడు పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి ,అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు....భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు.
వేలమందిని చంపి భారతీయులు నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆతను జనరల్ ఓడయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు.
ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగి పోయాడాయువకుడు.
ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా?
ఉద్దమ్ సింగ్ ....
1919 ఏఫ్రెల్ 13 #పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ ..... అక్కడ ఓ చిన్నతోటలో .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.
ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..
ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు....... అతడే
#ఉద్దమ్ సింగ్.
#ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని గర్వంగా ప్రకటించాడు. బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్.
#భారత స్వతంత్ర ఉద్యమంలో నిజానికి భగత్ సింగ్ తెలిసినంతగా.. ఉద్దమ్ సింగ్ గురించి చాలామందికి తెలియదు. భారత స్వతంత్ర్య సంగ్రామం గురించి మాట్లాడుకున్నప్పుడు కచ్చితంగా ఉద్దమ్ సింగ్ గురించి చెప్పుకోవాలి. అంతటి గొప్ప సాహస వంతుడు ఉద్ధమ్ సింగ్.
ఉద్దమ్ సింగ్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని సునం తెహసీల్‌కు చెందిన కలన్ గ్రామంలో జన్మించాడు. 1899 డిసెంబర్ 26న ఓ పేద ఇంట్లో ఉద్దమ్ సింగ్ పుట్టాడు. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్ సింగ్. ఉద్ధమ్ సింగ్ ఓ దళితుడు.
అతని తల్లీ పేరు నారాయణ్ కౌర్ చిన్నప్పుడే చనిపోగా.. తండ్రి పేరు తెహాల్ సింగ్ కూడా 1907లో మరణించారు.
తర్వాత ఉద్దమ్ సింగ్ తన అన్న ముక్తా సింగ్‌తో కలసి అనాథశ్రమంలో చేరాడు.
అప్పుడే షేర్ సింగ్‌కు #ఉద్దమ్ సింగ్‌గా పేరు మార్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఉద్దమ్ సింగ్ అన్నయ్య కూడా చనిపోయాడు. దీంతో ఉద్దమ్ అనాథయ్యాడు.
టీనేజ్‌లోనే ఉద్దమ్ సింగ్‌కు దేశభక్తి అమితంగా ఉండేది.
ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు.
14 ఏళ్ల వయస్సు వెయ్యి మందికిపైగా బలైన జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఉద్దమ్ సింగ్ నెత్తురును మండించింది. 1919 సంవత్సరంలో అమృతసర్‌లో జరిగిన ఈ సభకు అనాథ శరణాలయం నుంచి హాజరైన ఉద్దమ్ సింగ్ నేలమీద పడుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.
అక్కడ శవాల గుట్టలను చూసి రగలిపోయాడు.. ఆ నెత్తుటి ధారను చూసి చలించిపోయాడు. అప్పుడే ఆ రక్తమంటిన మట్టిని చేతబట్టుకుని ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిని చంపేదాక తను చావనని వాగ్దానం చేశాడు.
అప్పటి నుంచి #జలియన్ వాలాబాగ్‌కు కారణమైన #డయ్యర్స్‌ను వెతుక్కుంటూ ఉద్దమ్ సింగ్ ముందుకు సాగాడు. అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తుపాకీ కాల్చడం కూడా నేర్చుకున్నాడు. ఉద్దమ్ సింగ్ 1940 మార్చి 13న లండన్ కాక్స్‌టన్ హాల్లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు. దీనికోసం ఉద్దమ్ సింగ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. పేరు మార్చుకున్నాడు.
మారువేషాలు వేశాడు. ఎట్టకేలకు డయ్యర్ ఆ కాన్ఫరెన్స్‌కు హాజరవుతాడని తెలుసుకుని.. లండన్ చేరుకుని, ఎంట్రీ పాస్ సంపాదించి.. పిస్టల్‌ను పుస్తకంలో పెట్టుకుని
వెళ్లి.. డయ్యర్‌పై గుళ్ల వర్షం కురిపించాడు.
అనంతరం నా దేశ ప్రజల ఆత్మను భంగపరిచాడని, అందుకే వాడిని చంపానని కోర్టులో వెల్లడించాడు. అతనిని చంపాడానికి 21 సంవత్సరాలు వేచి చూశానని అన్నాడు. తను చంపేంత తప్పు చేశాడని ప్రకటించాడు. తాను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నానని, నా దేశం కోసం మరణిస్తున్నానని అది నా బాధ్యత అని వెల్లడించాడు.తర్వాత 1940 జూలై 31న #ఉద్ధమ్ సింగ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది.
0 comments:
Post a Comment